💥 జనన సూత్రములు💥

💥 జనన సూత్రములు💥

41)వ్యయారీ పాపయుతౌ బాల మృతిః!

తా) పాపగ్రహములు 6, 12 స్థానమునందు వుండిన శిశువు మరణము సంభవించును.

42) లగ్నేశేసార్కేనీచగేరంధ్రేశే బాలస్యసద్యోమృతిః!

తా) రవి లగ్నాధిపతితో కూడి అష్టమాధిపతికి నీచ పట్టిన యెడల బాలునకు సద్యో మరణము కలుగును.

43) రాహౌకేంద్రేపాపమాత్రయుత దృష్టేబాలస్యసద్యోమృతిః!

తా) రాహువు కేంద్రస్థానమందుండి ఏ పాప గ్రహములతోనైననూ కూడి గాని చూడబడి గాని ఉండిన శిశువునకు సద్యో మరణం కలుగును.

44) నగేర్కేంగేమందేష్టమేభౌమే బాలస్య సద్యోమృతిః!

తా) సూర్యుడు 7 యందు లగ్నమందుశని అష్టమమునందు కుజుడు ఉన్న ఎడల బాలునకు సద్యో మరణం కలుగును.

45) మందారభేస్వేర్కే పాపైదృష్టేబాలస్యసద్యోమృతిః!

తా) శని కుజుల క్షేత్రములందు గాని లగ్నమందు గాని సూర్యుడుండి పాప గ్రహములతో చూడబడిన ఎడల శిశువునకు సద్యో 
మరణము కలుగును.

46)షష్టాష్టమేచంద్రేపాపైదృష్టే బాలస్యసద్యోమృతిః!

తా) చంద్రుడు 6 , 8 స్థానములందుండి పాపులచే చూడబడిన ఎడల బాలునకు సద్యో మరణము
కలుగును.

47) చరాంశేచంద్రేశుభైరదృష్టే కోణేపాపాబాలస్యమృతిః!

తా) వ్యయమందు చంద్రుడుండి శుభులచే చూడబక కోణముల యందు పాపగ్రహములు ఉండిన బాలునకు సద్యో మరణము కలుగును.

48) మందార్కేంద్విరా వ్యయాంకాంగాష్టమగాః
సబలాగుర్వదృష్టా బాలస్యసద్యోమృతిః!

తా) శని రవి చంద్ర కుజులు 12 , 9 , 1, 8, ఈ స్థానములందు ఉండి గురునిచే చూడబడని ఎడల  బాలునకు మరణము కలుగును.

49) కోణాంత్యాస్తాంగేషు పాపయుతశ్చంద్రో
బలీశుభాయుతదృష్టోవా బాలస్యసద్యోమృతిః!

తా) 9, 5 ,12 , 7, 1 ఈ స్థానములందు చంద్రుడు పాప గ్రహములతో కూడి శుభ గ్రహములతో గూడక చూడబడకుండిన ఎడల బాలునకు సద్యో మరణము కలుగును.

50) చంద్రే౽ంగేస్తే పాపాబాలస్యమృతిః

తా) లగ్నము నందు చంద్రుడు ఉండి సప్తమ మందు పాపగ్రహములు వున్న ఎడల బాలునకు సద్యో మరణము కలుగును.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: