🌸 దైవ - మానవ - రాక్షస గుణములు🌸

🌸   దైవ - మానవ - రాక్షస గుణములు🌸

మానవునికి మూడు రకాలైన  గుణములు ఉంటాయి. 
దైవ
మానవ
రాక్షస

శ్రీకృష్ణ భగవానుడు ఒక విషయాన్ని సష్టంగా చెప్తాడు.

శమదమాదులు కలిగినటువంటి వారి చేతిలో వృద్ధి చెందుతుంది అని. ఇలాంటి వారికి ఏదైనా ఇచ్చిన, చెప్పిన, అది అభివృద్ధి పథంలో ఉంటుంది. వీరి దగ్గర నుంచి అడిగిన ప్రశ్నకు సమాధానం వస్తుంది.

దానం అనేటువంటిది చేసేవారి వలన వారు ఉన్నంతవరకు ఉదరపోషణం జరుగుతుంది. వీరికి ఏదైనా ఇస్తే అభివృద్ధి చెందదు, నాశనం కూడా జరగదు. ఉన్నది ఉన్నట్లుగానే ఉంటుంది. కాని చేతులు మారడం అనేది సహజంగా జరుగుతుంది. వీరికి ప్రశ్న వేస్తే తనకు తెలిసింది చెప్తూ తన దగ్గర ఉన్నది ఇస్తారు. 

దయ కలిగి ఉండవలసినటువంటి వారు దయ లేకుండా ప్రవర్తించినప్పుడు క్షీణ దశ ఏర్పడుతుంది. వీరికి ఇచ్చింది ఏదైనా  క్షీణించిపోతుంది నశించిపోతుంది. వీరి దగ్గర అభివృద్ధి చెందాలంటే వారికి దయ ఉండాలి. తమకు పనికిరాని ఏదైనా దాచుకోవడం వీరి లక్షణం. వారు వాడు కోరు ఇంకొకరికి ఉపయోగపడరు. తన చేతిలో ఉన్న దాన్ని నాశనం చేసేదాకా చేస్తారు. యుద్ధాలకు కూడా దిగుతారు. ఆర్భాటాలకు పోతారు. వీరి దగ్గర నుంచి ప్రశ్నకు సమాధానం రాదు. అడిగిన వాడితో శత్రుత్వం పెరుగుతుంది. 

ఈ మూడు గుణాలను జ్యోతిష్యం దేవ మానవ రాక్షస అనే మాటలతో చెప్తూ ఉంటారు. 

పాండవుల సంతానమును కృష్ణుడు ఎందుకు రక్షించలేదు అని అడిగినప్పుడు డు కృష్ణుడు ఈ రకమైన సమాధానం చెప్తాడు 🙏

ఈ గుణములలో మనకు ఏదో ఒక గుణం ఉండి తీరుతుంది. దీన్ని ఒక అందమైన కథ రూపంలో చెబుతారు. *ద*
అని ఒక మాట తో

ద దేవతలకు దమము
ద మానవులకు దానము
ద రాక్షసులకు దయ

మనము ఏ గణములో పుట్టాము, ఏమి చేస్తే బాగుంటాము అనేది పైన తెలుపబడిన విషయములలో ఉంటుంది. దీనికి భిన్నంగా మనం ప్రవర్తిస్తే అంత్యకాలము ఆ జాతి సంభవిస్తున్నట్లు అర్థం 🙏

మీ మీ నక్షత్రాలు ఏ  గుణానికి సంబంధించినవి అని చూసి మీరు ఏమి చేయాలో ఆచరించండి.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: