💠 నక్షత్ర ప్రమాణం💠

                 💠  నక్షత్ర ప్రమాణం💠
నక్షత్రప్రమాణము 13॰20'. 27నక్షత్రముల మొత్తం 13॰20x27=360॰. ఇది స్థూలప్రమాణము.  అయితే అన్నినక్షత్రములు ఒకే ప్రమాణము కలిగి ఉన్నాయా? అనే విషయములో వశిష్ఠాది మునులు ప్రత్యేకమైన సూక్ష్మనక్షత్ర ప్రమాణములను విడిగా తెలియజేసారు. దీని ప్రకారం ఈనక్షత్రములను 3రకాలుగా విభజించారు. అవి ఇలా ఉంటాయి.
1) *బృహన్నక్షత్రములు* (19॰45' 52").
రోహిణి,పునర్వసు,ఉత్తరాత్రయం,విశాఖ ఈ 6 నక్షత్రములను *అద్యర్థభోగ నక్షత్రములు* అని కూడా అంటారు.
19x60+45=1185లిప్తలు-52విలి

2) *జఘన్నక్షత్రములు* 
(6॰ 35' 17")
భరణి,ఆరుద్ర,ఆశ్రేష,స్వాతి,జ్యేష్ఠ,
శతభిషం. ఈ 6 నక్షత్రములను *అర్థభోగ నక్షత్రములు* అని కూడా అందురు.
6x60+35=395లిప్తలు-17విలి.

3) *సమనక్షత్రములు*
(13॰ 10' 35")
అశ్వని,కృత్తిక,మృగశిర,పుష్యమి,మఖ,పూర్వాత్రయం,హస్త,చిత్త,అనూరాధ,మూల,శ్రవణం,ధనిష్ఠ,రేవతి. ఈ 15 నక్షత్రములను *ఏకభోగ నక్షత్రములు* అని కూడా అందురు.
13x60+10=790లిప్తలు-35విలి.

బృహన్నక్షత్రములు
 6x19॰ 45' 52"=118॰ 35' 12"
జఘన్నక్షత్రములు
6x6॰ 35' 17"=     39॰ 31' 42"
సమనక్షత్రములు
15x13॰ 10' 35"=197॰ 38' 45"
--------------------------------------------
                        355॰ 45' 39"
అభిజిత్                4॰ 14' 21"
------------------------------------------
       మొత్తము   360॰ 00' 00"
 మీ ఇంద్రకంటి. చంద్రమౌళి శర్మ🙏






                          

               
              
         

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: