💠 నదీ నదములు 💠

💠    నదీ నదములు 💠

మనకి సనాతన ధర్మంలో నదులకు అత్యంత ప్రముఖమైన విశేషము ఉంది.  మనం ఏదైనా పూజ చేయాలంటే మొదట "కలశారాధన" పేరుతో పుణ్యనదులను నీటిలోకి ఆవాహన చేస్తాము.  గంగా, యమునా, నర్మద, గోదావరి, కృష్ణ...   ఇలా పంచ నదీమ తల్లులను మంత్ర పూర్వకముగా ఆవాహనచేసి, స్థల శుద్ధి, పాత్రశుద్ధి, శారీరక శుద్ధి...చేసి ఏ పూజ నైనా ప్రారంభం చేయడం జరుగుతూ ఉంది.
పవిత్ర నదీ జలాలకు అంతటి ప్రాధాన్యత కలిగించారు..  ఆ ఆవాహన చేసిన నదీ జలాలను ఆరాధించే మూర్తి మీదే కాకుండా అందరిపై ప్రోక్షణ చేస్తారు.  సనాతన ధర్మంలో నదులకు ఉన్నంత గౌరవం, వాటికి చేసే పూజ, వాటి వైశిష్ట్యం విశేషంగా ఉంటుంది..  ప్రతి నదికి ఒక అనుష్టాన దేవత ఉంటుంది..  అది కేవలం నీటినుండి ఉత్పన్నమైన శక్తి కాదు.  ఒక్కొక్క నదీ అనుష్టాన దేవత ప్రజలను ఒక్కొక్క రకంగా అనుగ్రహిస్తూ ఉంటుంది..  నదులున్న చోటనే నాగరికతలు వెలిశాయి..  ఎన్నో ప్రఖ్యాతి గాంచిన పుణ్య క్షేత్రాలు వీటి తీరాలలో వెలిశాయి..

12 సంవత్సరాలకు ఒకసారి పవిత్రమైన నదులకు "పుష్కరోత్సవాలు" జరుగుతాయి..  నదులకు ఉన్న అధిష్టాన దేవతలు ప్రార్థన చేసిన భక్తులను అనుగ్రహిస్తూ వుంటారు. భాగవతోత్తములైన వారు నదీ స్నానాలకు వెళ్లినప్పుడు, ఆ నది అధిష్టాన దేవత వారితో మాట్లాడి ఏదో ఒక బహుమానాన్ని తాను కోరుకొని స్వీకరించి, సంతోషించిన వేళలు కోకొల్లలు... నదులు... నదాలు... వేరు వేరు.. పశ్చిమం నుండి తూర్పున ఉన్న సముద్రంలో కలిస్తే దానిని "నది" అని పిలుస్తాము.
అలాగే పశ్చిమాభిముఖంగా ప్రయాణించి పశ్చిమాన ఉన్న  సముద్రంలో కలిసి పోతే అది "నదం" అని పిలుస్తారు. మనందరికీ వేదమే ప్రమాణ వాక్కు.. భగవంతుని ఊపిరి అయిన వేదమే ప్రమాణం. మనం ఎలా బ్రతకాలి అన్నది నిశ్చయం చేసి చెప్పగలిగేది వేదం ఒక్కటే... "యస్మాత్నాదం కృతవత్యః తస్మాత్ నదీతి నామధేయం ప్రాప్తా...". ఎక్కడైతే ప్రవాహం తనంత తానుగా ఒక నాదాన్ని...  ఒక చప్పుడును..  చేస్తుందో..  అది ఎటువంటి చప్పుడు చేస్తుందని..  అడిగితే...  దివ్యలోకం నుండి మొదట ప్రారంభమైన జలప్రవహం మేఘమండలం లోకి చేరి, వర్షంగా పడి పెద్ద జలాధార ఎత్తునుండి క్రింద రాళ్ళ మీద పడినప్పుడు ఎటువంటి ధ్వని వస్తుందో, అటువంటి శబ్దాన్ని ఉత్పన్నం చేస్తూ ప్రవహించేది ఏదో...  దానిని "నది"అని పిలుస్తారు.  నది నిశ్శబ్దంగా ప్రవహించదు.. నది ఒడ్డున నిలబడి చూస్తే ఆ నదీ ప్రవాహానికి ఒక అద్భుతమైన నాదం ఉంటుంది..  అందుకే నదీ తీరాలు "ధ్యానానికి" నిలయాలు.. నదులు ప్రవహిస్తూ వున్నప్పుడు, వాటిలో నుండి వచ్చే నాదంతో  మమేకమై ధ్యానం చేయగలిగిన వాడు కూడా పరమాత్మ అనుభవాన్ని సిద్ధింప చేసుకోగలడు.. అంతటి మహోన్నతమైన నాదంతో ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి వాటికి "నదులు" అని పేరు వచ్చాయి.. వీటిలో ప్రవహించే జలంలో దశగుణాలుఉంటాయి.. ఇది వేద ప్రభోదం.. అవి 1. సాధుగుణమైన రూపం,  2. బలం, 3. తేజస్సు, 4. శౌచం, 5. ఆరోగ్యం, 6. ఆయుర్దాయం, 7. ఆలోలుపత్వం,  8.దుస్వప్నం నశించడం,  9.తపస్స, 10.మేధ..... 

నదీ ప్రవాహానికి అధిష్టానంగా ఉన్న దేవత అనుగ్రహ శక్తిగా అవి ప్రసరిస్తాయి.. వీటితో స్నానం చేసినా, త్రాగినా, నమస్కరించినా, స్మరించినా ఎంతో పుణ్యం కలుగుతుంది.. 
ఈ 10 లక్షణాలను అవి ఇవ్వకలిగి ఉంటాయి.. కొన్ని నదుల నీటిని నోటిలోకి పుచ్చుకుంటే పరమ పుణ్యం. కొన్ని నదీ జలాలను పుచ్చుకోనక్కర లేదు.. తలమీద చల్లు కుంటే చాలు. కొన్నిటిని చూస్తే చాలు.. కొన్నిటిని స్మరిస్తే చాలు.. ఆ నదులు సృష్టి ప్రారంభంలో భగవంతుని అనుగ్రహం చేత భగవంతుని నుండి ఉత్పన్నమై ప్రవహించడం ప్రారంభించాయి.. చంద్రుడికి 'సుధాకిరణుడు" అని పేరు.. సౌందర్యాలహరిలో శంకరాచార్యులవారు హిమకరః అంటూ ఉంటారు.. ఆ చంద్రుడు అమృతకిరణాలను స్రవిస్తే ఆ ధారలను నదీ జలాలు స్వీకరిస్తాయి.. తెల్లవారుజామున నదిలో  స్నానం చేస్తే ఆ నదీ నీటిలో అమృతం ప్రవేశించి ఉంటుంది.. ఓషధీతత్వాన్ని పుచ్చుకొని ఉంటుంది. కాబట్టి అటువంటి నదీ జలాల్లో పుణ్యస్నానాలు ఆచరించడం వలన సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు.. గొప్ప తేజస్సు, బలం కలుగుతాయి.. కూర్మవాయువుని బలం చేస్తుంది. మనం ఒక్కసారి పీల్చిన ఈ కూర్మవాయువు 10 వాయువులుగా విడిపోతుంది.. ఈ వాయువు కాంతిని ప్రసరింప జేస్తుంది...1. ప్రాణ, 2. అపాన, 3. సమాన, 4.వ్యాన, 5.సమాన, 6.నాగ, 7.కూర్మ, 8.కృకర, 9. ధనంజయ 10. దేవదత్తం.. అందుకే పవిత్ర నదీ స్నానాలు ఆయుర్ధాయ కారకాలు. పరమ శివుడు నీటిరూపంలో ఉంటాడు. అందుకే వారిని "భవుడు' అని పిలిచారు....

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: