కార్తవీర్యార్జున స్తోత్రం


కార్తవీర్యార్జున స్తోత్రం 


పోగొట్టుకొనబడిన వస్తువు తిరిగి పొందడానికి కార్తవీర్యార్జున స్తోత్రం 

తప్పిపోయిన, అపహరణకు గురైన పిల్లలు దొరకడానికి, పోగొట్టుకొనబడిన వస్తువు తిరిగి పొందడానికి, ఇంటినుండి వెడలిపోయిన అప్తులు తిరిగి రావడానికి... వారి రక్త సంబంధీకులు సంకల్పం చెప్పుకుని ఈ మంత్రం పఠిస్తే తాము పోగొట్టుకున్నవి తిరిగి పొందుతారు...

పారాయణం చేయువారు ఒక ఎర్రని కొత్త వస్త్రమును దర్భాసనముపై పరచి దానిపై కూర్చుని, మొదట గణపతిని ప్రార్థించి, ఆ తదుపరి కుడి చేయి గుప్పెట్లో కందులు తీసుకుని చేతపట్టుకుని (ఏరోజు కారోజు) పారాయణం చేసి, తర్వాత చేతిలో నున్న కందులు ఒక డబ్బాలో పోసి, జాగ్రత్త చేసి, తర్వాత వచ్చే మంగళవారం రోజున గోవులకు ఆహారంగా ఇచ్చుట లేక నానబెట్టిన కందులు దానం ఇచ్చుట చేసిన అతి శీఘ్ర ఫలితములు అందగలవు..

ఓం 
కార్తవీర్యా ఖలద్వేషి 
కృత వీర్యా సుతోబలీ
సహస్రబాహు శతృఘ్నో
 రక్తవాసాధనుర్థరః

రక్తగంధో రక్తమాల్యో
 రాజాస్మర్తురభీష్టదః
ద్వాదశైతాని నామాని కార్తవీర్యాశ్య యః పఠేత్

సంపదస్తస్య జాయంతే 
జనాః సర్వేవశం గతా
రాజానో దాసతం మాన్తి 
రిపక్షో వశ్యతాంగతీః

ఆనయత్యాషు దూరస్థం
 క్షేమలాభయుతం ప్రియామ్
సర్వసిద్ధి కరం స్తోత్రం
 జాప్త్రుణాం సర్వకామదమ్

కార్తవీర్యో మహావీర్యో 
సర్వశత్రు వినాశనం
సర్వత్రసర్వదా తిష్ఠ 
దుష్ఠాన్ నాశయ పాహిమాం

ఉతిష్ఠ దుష్టదమన 
సప్తదీపైన్ పాలకః
త్నమేవ శరణం ప్రాప్తం 
సర్వత్ర రక్ష రక్షమాం

కిం త్వం స్వపిణి కింతష్ఠ-
సి కించిరాయసి
పాహినః సర్వదా సర్వ
భయేభ్య స్వుసుతానివ

మతిభంగః స్వరోహినః శత్రుణం ముఖ భంజనం
రిపూణాంచ సదైవాస్తు
 నభాయాం మే జయంకురుః

యస్య స్మరణ మాత్రేణ సర్వదుఃఖ క్షయోభవేత్
తం నమామిమహావీర-
మర్జునం కృత వీర్యజమ్

హేమయాధిపతేః స్తోత్రం
 సహస్రవృత్తికం కృతమ్
వాంఛికార్థ ప్రదం నృాం సూద్రాద్యైన శృతంయది

 ఏదైనా సంరక్షణకు సంబంధించిన ఉద్యోగంలో ఉన్నవారు తరచుగా ఈ స్తోత్ర పారాయణం చేయుట వలన తమ ఆధీనంలో ఉన్న ఏ వస్తువు కూడా దొంగిలించబడడానికి వీలుపడదు. తద్వారా తమ వృత్తిలో ఉన్నత శిఖరాలు అందుకొనగలరు.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: