గురు కారకత్వాలు

ఓం శ్రీమాత్రేనమః
శ్రీ గురుభ్యోనమః

విద్యా దదాతి వినయం 
వినయాద్యాతి పాత్రతాం
పాత్రత్వాత్ ధనమాప్నోతి
ధనాత్ ధర్మం తతః సుఖమ్

దీనిలో గురు కారకత్వాలున్నాయి.
విద్య,పాత్రత, ధనము...

మొదట ధనమంటే ఏమిటి?

"ధినోతి ప్రీణయతీతి ధనం" అని అమరకోశంలో సంతోషపెట్టునది అని చెప్పబడింది. అంటే కొందరికి జ్ఞానం సంపాదించటంలో సంతోషం, వారికి జ్ఞానమే ధనం. కొందరికి డబ్బు సంపాదించడంలో ఆనందం. వారికి డబ్బే ధనం.....
ఇలా ధనం వేర్వేరు రూపాల్లో సంతోషపెడుతుంది. కనుక ధన కారకత్వం అంటే కేవలం డబ్బే కాదు విద్యా, జ్ఞాన, మాన, ప్రాణ, కుటుంబాది అనేక విషయాలు ఆయా సందర్భాల్లో ధనంగానే భావించబడతాయి. 

వీటిలో జ్ఞానం అన్నింటికీ ఆధారమైనది. ఆ జ్ఞానాన్నిచ్చేది గురువే. కనుకనే గురుస్థానంలో ఉన్న బృహస్పతిని ధనకారకుడన్నారు. జ్యోతిష్కుడికి షట్ శాస్త్రజ్ఞానమవసరమని శాస్త్రవచనంలోని ఉద్దేశ్యం. ఒక శాస్త్రంలో కలిగే సందేహాలకు అక్కడ సమాధానం కష్టమైతే మరోచోట సమాధానముంటుందని ... అందువల్ల నే పూర్వం జ్యోతిష్కులు
తర్కం, వ్యాకరణం, వైద్యం, పురాణం..... వంటి అనేక విషయాలపై పట్టు సాధించేవారు. 
....... 

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: