జ్యోతిష్య శాస్త్ర పరిజ్ఞానము

ప్రారంభదశలో ఉన్న విద్యార్థికి సులభ పద్ధతిలో వ్రాసిన శ్లోకం ఇది.

శీర్షముఖ బాహు హృదయో
 దరాణికటివస్తిగుహ్య సంజ్ఞాని,
 ఊరూ, జానూజంఘే,
 చరణాది రాశయోZజాద్యాః 

 టీక : అజ + ఆద్యాః : మేషము మొదలుకొని
 రాశయః : రాశులు,
 శీర్ష : తల,
ముఖ : ముఖము,
 బాహు : బాహువులు,
 హృదయ : హృదయము,
 ఉదరాణి : ఉదరము,
 కటి : మొల,
 వస్తి : పొత్తికడుపు,
గుహ్య : రహస్యావయవములు,
 ఊరూ : తొడలు,
జానూ : మోకాళ్ళు,
జంఘే : పిక్కలు,
చరణీ : పాదములు,
ఇతి : అని 
సంజ్ఞాని : గుర్తులు.

తా || మేషము మొదలు 12 రాశులును వరుసగా 12 అవయవములకు చిహ్నములు, ఇందు శిరస్సు మొదలు గుహ్యము వఱకు గల 8 రాశులును అనగా, మేషము మొదలు వృశ్చికము వఱకు వేరుగను, మిగిలిన రాశులు వేరుగను చెప్పబడినవి. దానికి కారణమేమనగా మొదటి విభాగమయిన ఎనిమిది భావములును ప్రస్తుత జన్మకు సంబంధించినవి. మిగిలిన నాలుగును పూర్వ జన్మలతో సంబంధించినవి. అనగా భౌతికములకన్న వేరయిన రాశులును భావములును.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: