స్త్రీలు - జ్యోతిష్య శాస్త్రం - అంగ శాస్త్రం

💎 జ్యోతిష్య శాస్త్రం - అదృష్టం 🦜🦜🦜

ఆడవారిలో ఈ శరీర భాగాలు పెద్దగా ఉంటే ధనవంతులు అవుతారు.          

స్త్రీలు - జ్యోతిష్య శాస్త్రం - అంగ శాస్త్రం 

 సాధారణంగా మన ఇళ్ళల్లో పెద్దవాళ్లు అప్పుడప్పుడు కొన్ని విషయాలు చెబుతూ ఉంటారు. పంటి మీద పుండు ఉంటే …మెల్లకన్ను ఉంటే అదృష్టం అని.
 పెద్ద నుదురు ఉంటే భాగ్యవంతులు.
 అని ఇలా రకరకాలుగా చెబుతుంటారు. 

కానీ ఇవన్నీ కూడా వారు ఊరికే చెప్పేవి కావు. ఇప్పుడు వీటి గురించి ఎలా అయితే మాట్లాడుతున్నామో అలా మన పెద్ద వాళ్లు కూడా వాళ్ల పూర్వీకుల నుండి తెలుసుకున్న విషయాలు ఇవి. అయితే ఈ విషయాలన్నీ చాలా పురాతన కాలం నుండి వస్తున్నవే. అంటే మన పురాణాల్లో కూడా వీటి గురించి వివరించడం జరిగిందని గుర్తించాలి.

సాధారణంగా మనిషి శరీరంలో అన్ని అవయవాలు ఒకేలా ఉండకపోవచ్చు ఒక్కొక్కరికి ఒక్కోరకంగా ఉండే అవకాశం ఉంటుంది. దీనినే జ్యోతిష్య శాస్త్రం అదృష్టం అంటుంది. అయితే ఆడవారిలో ఈ ఐదు భాగాలు పెద్దగా ఉండటం వలన వారు అదృష్టవంతులు అవుతారు. వారిని పెళ్లి వారిని పెళ్లి చేసుకున్న వారికి కూడా అదృష్టం కలిసి వస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పెద్ద చెవులు: పెద్ద చెవులు గల ఆడవారు ఎక్కువ కాలం జీవిస్తారు. వారికి అదృష్టం కూడా కలుగుతుంది. అలాగే వీరు పెళ్లి చేసుకున్నాక వారి అత్తగారింట్లో ధన సంపదలు కురిపిస్తారు.

పెద్ద జడ, పెద్ద కురులు కలిగిన ఆడవారు అందంతో పాటు అదృష్టవంతులు సమాజంలో వీరికి ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. వీరికి ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. పొడవాటి కురులు కలిగిన ఆడవారిని అమ్మ వారితో సమానంగా భావిస్తారు. వీరు అత్తవారింట్లో భాగ్యం కలిగిస్తారట.

పెద్ద కళ్లు: పెద్ద కళ్లు అనగానే గుర్తుకు వచ్చేది లక్ష్మీదేవి. వీరు ఎక్కడ ఉంటే అక్కడ ధనాభివృద్ధి కలుగుతుంది. జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు. సమస్యలు ఎదురైనా పరిష్కరించుకొనే సత్తా వీరిలో ఉంటుంది.

పొడవాటి చేతులు : పొడవాటి చేతులు
కలిగిన ఆడవారు మంచి ఆయుష్షు కలిగి ఉంటారు. వీరు జీవితంలో ఎన్నో సుఖాలు మరియు విలాసవంతమైన జీవిత అనుభవాన్ని పొందుతారు. వీరికి మంచి భర్త లభిస్తాడు. వీరి సంసార జీవితం అద్భుతంగా ఉంటుంది.

పెద్ద నాభి: పెద్ద నాభి గల స్త్రీలు అదృష్టవంతులు అవుతారు. నాభీ లోతుగా కుడివైపుకు తిరిగి ఉంటే జీవితంలో ధనానికి లోటు ఉండదు. జీవితంలో అనుకున్నవి సాధించడంలో వీరికి ఎవరు సాటిరారు. ఎవరినైనా ఒక్కసారి నమ్మితే జీవితాంతం వారితోనే కలిసి ఉంటారు.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

KAPU SURNAME AND GOTRALU:

శ్రీ లలిత దేవి చరిత్ర Part-12