స్వభావాలను బట్టి ఆహారాల మీద ఇష్టం కలుగుతుంది
మానవుల్లో సాత్త్వికులు, రాజసులు, తామసులు అని వారి వారి స్వభావాలను బట్టి అంటాం కదా! వారి వారి ఆహారాలెలా ఉంటాయి .??
ఆయుస్సత్వబలారోగ్య
సుఖప్రీతివివర్ధనాః
రస్యాః స్నిగ్ధః స్థిరా హృద్యాః
ఆహారాః సాత్వికప్రియాః 8-17
కట్వమ్లలవణాత్యుష్ణ
తీక్ష రూ క్షవిదాహిసః |
ఆహారా రాజన స్యేష్టా
దుఃఖశోకామయప్రదాః ॥9.17
యాతయామం గతరసం
పూతి పర్యుషితం చ యత్।
ఉచ్చిష్టమపి చామేధ్యం
భోజనం తామసప్రియమ్॥ 10.17౹౹
లోకంలో వాళ్ళ వాళ్ళ స్వభావాలను బట్టి మూడు రకాలైన ఆహారాల మీద ఇష్టం కలుగుతుంది.
ఆయుష్యాన్ని, బుద్ధిబలాన్ని దేహబలాన్ని, ఆరోగ్యాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని పెంపొందించేటువంటి, రసభరితాలు, తైలపక్వాలు, ఆకలి తగ్గించి వేసేటటువంటి హృద్యాలైన ఆహారాలు సాత్త్వికులకు ఇష్టమైనవి.
బాగా కారం పులుపు, ఉప్పు, చేదు రుచులు కలవి, హెచ్చు వేడిగా ఉండేవి, ఉద్రేకాన్ని కలిగించేవి, కడుపుమంట పుట్టించేవి, దాహాన్ని కలిగించేవి అయిన ఆహారాలు రాజసులకు ప్రియమైనవి. వీటివల్ల దుఃఖం శోకం, రోగం కలుగుతుంది.
ఎప్పుడో వండటం వల్ల చల్లారిపోయినది, ఎండిపోయి రుచిలేసనిది, పాసిపోయి వాసన కొట్టేది, నిలువ ఉన్నది, ఎంగిలిది, అపవిత్రమైనది అయిన ఆహారం తామసులకు నచ్చుతుంది.
కొందఱికి ఈ పై చెప్పిన పదార్థాలు బాగా ఇష్టంగా ఉంటాయి. అలాంటి వాటి మీద వాళ్లకు ఇష్టం కలగాలంటే లోపలి స్వభావం దానికనుకూలంగా ఉండాలి. స్వభావాలను బట్టే వారికి అభిరుచులేర్పడతాయి.
Comments
Post a Comment