మనిషి మాంసాహారం ఎందుకు తినకూడదు'

మాంసాహారం తినకూడదు:-

 'మనిషి మాంసాహారం ఎందుకు తినకూడదు' అని అనడానికి కొన్ని కారణాలు...

1. ప్రకృతి సిద్ధమైన కారణాలు
2. శరీర నిర్మాణ కారణాలు
3. మానసిక కారణాలు
4. ఆధ్యాత్మిక కారణాలు

 1. ప్రకృతి సిద్ధమైన కారణాలు:-

మాంసాహార జంతువులు మాంసాహారం మాత్రమే భుజిస్తాయి. శాకాహార జంతువులు శాకాహారాన్ని మాత్రమే భుజిస్తాయి. మనిషి మాంసాహారా, శాకాహారా అని తెలుసుకోవాలంటే - మనిషికి, మాంసాహార జంతువులకు గల అలవాట్లను పోల్చి చూద్దాం.

➡️ మాంసాహార జంతువులైన పిల్లి, కుక్క, పులి ఇవన్నీ నీటిని నాలుకతో తాగుతాయి. శాకాహార జంతువులైన ఆవు, గేదె మరియు మనిషి పెదవుల సహాయంతో నీటిని తాగుతారు.

➡️ మాంసాహార జంతువులకు పుట్టిన పిల్లలు 2, 3 రోజులకు కానీ కళ్ళు తెరువవు. కానీ మానవ శిశువు పుట్టిన వెంటనే కళ్ళు తెరుస్తుంది.

➡️ మాంసాహార జంతువుల గోళ్లు వంపు తిరిగి ఉంటాయి. శాకాహార జంతువులకు గోళ్ళు ఒంపు తిరిగి ఉండవు.

➡️ మాంసాహార జంతువులకు మాంసం చీల్చటానికి 'కోరపళ్ళు' ఉంటాయి. మనిషికి 'కోరపళ్ళు' ఉండవు.

ఈ తేడాలను గమనిస్తే మనిషి 'ప్రకృతి సిద్ధంగా శాకాహారి' అని, మాంసాహారం తినటం ప్రకృతి విరుద్ధం అని తెలుస్తోంది.

2. శరీర నిర్మాణ కారణాలు:-

 మనిషి జీర్ణాశయంలో ఆహారం 3 లేక 4 గంటలు మాత్రమే నిలువ ఉంటుంది. ఆ సమయం మాంసాహారం పూర్తిగా జీర్ణం అవ్వడానికి సరిపోదు. అసంపూర్ణంగా జీర్ణమైన మాంసాహారంలో 'టాక్సిన్ అమినో ఆమ్లాలు' (విష పదార్థాలు) ఉత్పన్నమవుతాయి. వీటి ఉత్పత్తి వల్ల కాలేయం, మూత్రపిండాలు సరిగా పనిచేయవు. జీవ రసాయనిక చర్యలు కుంటుపడి గ్యాస్ సమస్య పెరుగుతుంది. "అసంపూర్ణ జీర్ణం సకల రోగాలకు మూలం", అందువల్ల మాంసాహారం మానవ శరీరానికి నిషిద్ధం.

3. మానసిక కారణాలు:-

 ఒక కోడిని కోసేటప్పుడు, అది ఎంతో బాధతో గిలాగిలా కొట్టుకుంటుంది, భయంతో రెక్కలు టపటపలాడిస్తుంది. అతి భయం వల్ల దాని శరీరంలో కొన్ని విష పదార్థాలు ఉత్పన్నమవుతాయి. ఈ విష పదార్థం కోడి యొక్క శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. అంటే ఆ కోడి తింటున్నప్పుడు దాని భయాన్ని కూడా తింటున్నామన్నమాట. ఇదే పరిస్థితి ఏ జంతువుని తిన్నా జరుగుతుంది. ఆ జంతువు యొక్క భయాలే మనలోని 'మానసిక ఆందోళనలు'.

4. ఆధ్యాత్మిక కారణాలు:-

➡️ చనిపోయిన శరీరాన్ని 'మృత కళేబరాలు' అంటారు. అలాంటి మృత కళేబరాలను మన శరీరంలో పడవేసి 'దేవాలయం' వంటి శరీరాన్నీ 'స్మశాన వాటిక'గా చేసుకోకూడదు.

➡️ మనకు కనబడే స్థూల శరీరం చుట్టూ, ఎనర్జీ బాడీ ఉంటుంది. మాంసాహారం తినడం వలన ఈ ఎనర్జీ బాడీ క్షీణిస్తుంది. ఆ కారణంగా 'రోగ నిరోధక శక్తి' తగ్గిపోతుంది, దీని వల్ల రోగాలు సంభవిస్తాయి.

➡️ మనలో ప్రవేశించే విశ్వప్రాణశక్తి ని మాంసాహారం తినడం వల్ల ఉత్పన్నమయ్యే 'నెగటివ్ ఎనర్జీ' ఆటంకపరుస్తుంది. అందుకే "మాంసాహారం తినకూడదు".

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: