శ్రీ సాహితిజ్యోతిషాలయం మూల గ్రంధములు:బహు పుత్ర యోగః
శ్రీ సాహితిజ్యోతిషాలయం మూల గ్రంధములు:
బహు పుత్ర యోగః
సుత భవనేభృగుజీవసౌమ్యనాదైర్బల సహితైరవలోకితేయుతేవా!
బహుసుతజననంవదంతి సంతస్సుతభవనేశ బలేనచింత్యమేతత్!!
తా: పుత్ర స్థానం అనగా పంచమము శుక్ర బృహస్పతి బుధుడు, నాథుడు అనగా పంచమ స్థానాధిపతి వీళ్ళతో కూడినదై అధవా చూడబడినదై యుండినయెడల బహు మంది పుత్రులు కలుగుదరని సత్పురుషులు చెప్పుదురు. పుత్ర స్థానాధిపతి బలము చేతను ఈ సంతాన విషయమును చింతింప వలయును.
సంతాన యోగః
సుతభేశే బలసహితే హోరాధిపసంయుతేధవా దృష్టే!
సుతభే పాపవిముక్తె సంతతిలాభో వినిర్దేశ్యః!!
తా: పుత్ర స్థానాధిపతి బలవంతుడై లగ్నాధిపతితో చేరి గానీ చూడబడుతున్న పుత్ర స్థానము పాపగ్రహ సంబంధం లేనిదైవుండిన ఎడల సంతాన లాభమని చెప్పవలయును.
పుత్రస్థానంగతేభౌమే మేష సింహాళి మీనగే !
జీవదృష్టియూతేవాపి పుత్రావాప్తిం వినిర్దిశేత్!!
తా: మేష సింహ వృశ్చికమీనములలో నొకరాశి పుత్రస్థానమై అందు కుజుడు గురువుతోచేరిగాని అధవా చూచినగాని యున్నయెడల పుత్రలాభము కలుగును.
గ్రహాణాంస్థితిభేదః పుత్రభేదయోగః
శ్లో ) సుతభే శుభ మధ్యస్థే శుభ దృష్టి యుతేధవా!
సుతభేశ యుతేవాపి పుత్రావాప్తింవినిర్దిశేత్!!
తా) పుత్ర స్థానము శుభగ్రహమధ్య మందు ఉండి శుభగ్రహ దృష్టితో కూడినదిగాని అధవా పుత్ర స్థానాధిపతితో చేరిన గాని పుత్ర లాభము కలుగును అని చెప్పవలెను.
శ్లో) జీవేశే బలసంయుక్తే పుత్రస్థే సప్తమేథదా!
లగ్నేపాపైరదృష్టేపి సంతానాప్తింవినిర్దిశేత్!!
తా) లగ్నాధిపతి బలిష్టుడై పుత్ర స్థానము నందు గాని సప్తమునందు గాని ఉండి లగ్నము పాప గ్రహములచే చూడబడక యుండిన యెడల పుత్రలాభము కలుగునని తెలియవలెను,
శ్లో) సుతేశే బల సంయుక్తే శుభ మధ్య గతేథవా!
శుభదృష్టి యూతేవాపి సుతావాప్తిం వినిర్దిశేత్!!
తా) పుత్ర స్థానాధిపతి బలయుక్తుడైనను శుభగ్రహ మధ్యమందు ఉండిననూ ఆ శుభ గ్రహ దృష్టియుతుడైన సంతాన లాభము కలుగును.
శ్లో) సుతనాథ జీవకుజ భాస్కరేషువా పురుషాంశ రాశిషుగతేషుకుత్రచిత్!
మునయోవదంతి బహుపుత్రతాం తధాసుతనాథవీర్య వశతస్సుపుత్రతామ్!!
తా) సూర్యుడు గురు కుజుడు వీరు పుత్రస్థానాధిపతులై పురుషగ్రహ రాశులయందైనను పురుషగ్రహాంశములయందైనను ఉండిన యెడల బహుమంది పుత్రులు గలుగుదురని మునులు చెప్పుదురు. పుత్రస్థానాధిపతి బలమువలన పుత్రులు కలుగుదురు.
ప్రకారాంతరేణ బహుపుత్రయోగః
శ్లో) పరమోచ్చగతే సుతాధినాధే సుతరాశౌ శుభఖేచరేణ దృష్టే!
సుతభేత్వశుభైరదృష్టయుక్తే బహుపుత్రాన్ ప్రవదంతిబుధ్ధిమంతః!!
తా) పుత్రస్థానాధిపతి పరమోచ్చ స్థానమందుండి పుత్రస్థానము శుభగ్రహయుతమై పాపగ్రహ సంబంధదృష్టి రహితమైయుండిన యెడల బహుపుత్రులుకలుగుదురని బుధ్ధిమంతులు చెప్పుదురు.
పుత్ర పౌత్రాది యోగః
శ్లో) సుతేశేరంధ్రరిఃఫారిభావాదన్యత్రసంస్థితే!
బలయుక్తెశుభైదృష్టే పుత్రపౌత్రాన్వినిర్దిశేత్!!
తా) పుత్రస్థానాధిపతి 6, 8, 12, వ్యతిరిక్తస్థానములయందు బలిష్టుడై శుభగ్రహదృష్టి యుతుడైయుండిన పుత్రపౌత్రులు జనిచుదురని చెప్పవలయును,
పుత్రీపుత్ర సంఖ్యా ప్రతిపాదకం
దశపుత్రయోగః
శ్లో) సుతేశే పరమోచ్చస్థే కారకేస్వోచ్చరాశిగే!
వర్గోత్తమగతేజీవే దశసంఖ్యాకసూనవః!!
తా) పుత్ర స్థానాధిపతి పరమోచ్చమందుండి పుత్ర యోగకారకుడు స్వోచ్ఛమందుండి వర్గోత్తమాంశమును గానిపొందియుండిన యెడల పదిమందిపుత్రులు కలుగుదురు.
షోడశపుత్రయోగః
శ్లో) పుత్రస్థానంగతేశుక్రే స్వక్షేత్రే బలసంయుతే!
జీవదృష్టియుతేచైవ సూనవష్షోడశస్మృతాః!!
తా) తులా వృషభములలో ఒకటి పుత్రస్థానమై అందు బృహస్పతి దృష్టితోకూడిన శుక్రుడుండగా పదహారుమంది పుత్రులు ఉద్భవిచేదరు.
ఏకాదశ పుత్రయోగః
శ్లో) సుతస్థానంగతేసూర్యే కర్మరాశౌ గురౌస్థితే!
భాగ్యేశేలాభరాశిస్థే పుత్రైకాదశభాగ్భవేత్!!
తా) పుత్ర స్థానమున సూర్యుడు దశమమందు బృహస్పతి నవమాధిపతి లాభమందుండినయెడల పదకొండుమంది పుత్రులుదయింతురు.
నవసంఖ్యాక పుత్రయోగః
శ్లో) పరమోచ్చగతేజీవే ధనేశేరాహుసంయుతే!
భాగ్యేశేభాగ్యరాశిస్థే నవసంఖ్యాకసూనవః!!
తా) బృహస్పతి పరమోచ్చభాగమందును ద్వితీయస్థానాధిపతి రాహుతోడను భాగ్యస్థానాధిపతి భాగ్యమందును వున్నయెడల తొమ్మిది మంది కమారులుద్భవించేదరు.
అష్టపుత్రయోగః
శ్లో) పుత్రాద్భాగ్యంగతేజీవే సుతేశేబలసంయుతే!
భాగ్యేశే కర్మరాశిస్థే వసుసంఖ్యాక సూనవః!!
తా) పుత్ర స్థానమునకు నవమందు బృహస్పతియును పుత్ర స్థానాధిపతి బలిష్ఠుడు గాను దశమాధిపతి దశమ స్థానమందును ఉన్న ఎడల ఎనిమిది మంది పుత్రులు కలుగుదురు.
సప్తపుత్రయోగః
శ్లో) పంచమాత్పంచమంమందే సుతస్థేతదధీశ్వరే!
సూనవస్సప్తసంఖ్యాస్యు ద్వి౯గర్భోయమళోభవేత్!!
తా) పంచమమునకు పంచమమందు శనియును అపుత్రాత్పుత్రస్థానాధిపతి పుత్రస్థానమందున్న యెడల ఏడుగురు పుత్రులుదయింతురు రెండవ గర్భమున యమళలుద్భవితురు.
షట్పుత్ర షట్పుత్రీయోగః
శ్లో) పిత్రేశేపంచమస్థానే సుతస్థేపంచమాధిపే!
షట్సంఖ్యాసూనవఃప్రోక్తా ఏతేషాంస్త్రీప్రజాసమా!!
తా) నవమస్థానాధిపతి పంచమమందును పంచమాధిపతి పంచమమందును ఉన్న యెడల ఆరు మంది కుమారులు జన్మింతురు ఈసంఖ్యతోసమానముగా స్త్రీసంతానముకలుగును.
పంచసుతయోగః
శ్లో) లగ్నాత్పంచమగేజీవే జావాత్పంచమగేశనౌ!
కామేశేసుతభావస్థే పంచసంఖ్యాకసూనవః !!
తా) లగ్నమునకు పంచమమున బృహస్పతి యును బృహస్పతికి పంచమమున శనియును సప్తమాధిపతి పంచమమందున ఉన్న యెడల ఐదు మంది కుమారులు కలుగుదురు.
చతుఃపుత్రయోగః
శ్లో) సుతేశేపంచమస్థానే భాగ్యేశే వేశ్మసంయుతే!
గురుణాసంయుతేతత్ర చతుస్సంఖ్యాకసూనవః!!
తా) పుత్ర స్థానాధిపతి పంచమమందును, భాగ్యాధిపతి నవమమందును, ఆనవమములందు బృహస్పతి యుండిన నలుగురు పుత్రులు జనింతురు.
త్రిపుత్రయోగః
శ్లో) పుత్రేశేసంయుతేవిత్తే విత్తేశేధర్మసంస్థితే!
ధర్మేశేలాభసంయుక్తె పుత్రత్రయముదీరయేత్!!
తా) పంచమాధిపతి ద్వితీయమందును, ద్వితీయాధిపతి నవమమందును, నవమాధిపతి ఏకాదశంమందును, ఉన్నఎడల ముగ్గురు పుత్రులు కలుగుదురు.
ద్విపుత్రయోగః
శ్లో) చంద్రాత్పంచమగే జీవే జీవాత్పంచమగే శనౌ!
మందాత్పంచమగేరాహు పుత్రద్వయముదీరయేత్!!
తా) చంద్రునికి పంచమమున బృహస్పతియును, బృహస్పతికి పంచమమున శనియును శనికి పంచమమున రాహువు ఉన్న యెడల ఇద్దరు కుమారులు జనింతురు.
ఏక పుత్రయోగః
శ్లో) పుత్రాత్పుత్రగతేజీవే జీవాత్పుత్రగతేరవౌ!
సూర్యాత్కామగతేభౌమే పుత్రమేకంవినిర్దిశేత్!!
తా) పంచమమునకు పంచమమున బృహస్పతియును, బృహస్పతికి పంచమమున సూర్యుడును, సూర్యునికి సప్తమమున కుజుడు, ఉండిన యెడల ఒక పుత్రుడు కలుగును.
స్త్రీసంతానాధికయోగః
శ్లో) లగ్నాత్పుత్రగతే చంద్రే చంద్రాత్పంచమగేసితే!
సితాత్పంచమగేసౌమ్యే స్త్రీప్రజాబహుళంభవేత్!!
తా) లగ్నమునకు పంచమము నందు చంద్రుడును, చంద్రునికి పంచమమున శుక్రుడు, శుక్రునికి పంచమమున బుధుడు, ఉన్న యెడల స్త్రీ సంతానములధికమగును.
షట్పంచాష్ట సంఖ్యాకపుత్రీయోగః
శ్లీ) సుతేశశశిశుక్రేషు స్త్రీరాశ్యంశగతేషుచ!
తథైవకన్యకాలాభః పంచషష్టాష్టసంఖ్యయా!!
తా) పుత్ర స్థానాధిపతి, చంద్ర శుక్రులు, స్త్రీ రాశులలోగాని, స్త్రీ గ్రహ నవాంశములను గాని పొందియుండిన యెడల 5, 6, 8, కన్యలుదయింతురు.
పంచపుత్రీజననాత్పరంపుత్రోత్పత్తియోగః
శ్లో) స్త్రీరాశ్యంశగతేజీవే సుతేశేనయుతేక్షితే!
కన్యకాజననాత్పంచ పుత్రోత్పత్తింవినిర్దిశేత్!!
తా) బృహస్పతియు స్త్రీ రాశ్యంశముల యందుండి, పుత్ర స్థానాధిపత్యమందుండి, శనిచేచూడబడుచున్న యెడల, శూద్రబీజమువలన పుత్రోత్పత్తియగును.
శ్లో) పుత్రేశేనీచరాశిస్థే కారకేకుంభరాశిగే!
నవమేరాహుసంయుక్తే శూద్రబీజాత్సుతోద్భవః!!
తా) పుత్రస్థానాధిపతి నీచరాశియందుండి, పుత్రయోగకారకుడు కుంభరాశియందుండి, నవమమందు రాహువు ఉన్న యెడల శూద్రబీజమువలన పుత్రోత్పత్తియగును.
పుష్పిణ్యాం పుత్రోత్పత్తి యోగః
శ్లో) నీచరాశిగతేసూర్యే సూర్యాత్పంచమగేగురౌ!
చంద్రాత్పంచమగేరాహౌ పుష్పిణ్యాం జాయతేసుతః!!
తా) సూర్యుడు నీచరాశియందును, సూర్యునికి పంచమము నందు బృహస్పతియును, చంద్రునికి పంచమము నందు రాహువు, ఉన్న యెడల రజస్వల స్త్రీ యందు పుత్రోత్పత్తియగును.
నీచాత్పుత్రజననయోగః
శ్లో) పుత్రస్థానాధిపేజీవె నీచేనసహితేసుతే!
వణిక్థ్సితేనసూర్యేణ దృష్టేనీచాత్సుతోద్భవః!!
తా) బృహస్పతి పుత్ర స్థానాధిపతియై ఉండగా, ఆ పుత్ర స్థానమున నీచ గ్రహంముండి, దశమమందుండు సూర్యునిచే చూడబడుతున్న యెడల, నీచునివలన పుత్రోత్పత్తియగును.
ప్రకారాంతరేణ నీచాత్పుత్ర ప్రాప్తియోగః
శ్లో) ఆళిస్థితేవిధౌయస్య సుతేకేతుయుతేథవా!
శుభదృష్టివిహీనేచ నీచబీజాత్సుతోద్భవః!!
తా) చంద్రుడు వృశ్చికమందుండి పుత్ర స్థానమునందు కేతువు ఉండి శుభగ్రహంచే చూడబడకున్న యెడల నీచబీజము వలన పుత్రజననముకలుగును ,
పుష్పిణ్యామన్యబీజాత్పుత్రోత్పత్తియోగః
శ్లో) లగ్నరాశిస్థితేభౌమే భాగ్యాధిప సమన్వితే!
కారకేవ్యయరాశిస్థే పుష్పిణ్యామన్యబీజజః!!
తా) కుజుడు నవమాధిపతితోచేరి లగ్నమందుండి పుత్ర యోగకారకుడు ద్వాదశ మందు ఉండగా రజస్వల స్త్రీ యందు అన్యబీజమువలన పుత్రోత్పత్తియగును.
దత్తపుత్రాదియోగః
--------------------------
శ్లో) పుత్రస్థానేబుధక్షేత్రే మందక్షేత్రేధవాభవేత్!
మందమాందియుతేదృష్టే తదాదత్తాదయస్సుతాః!!
తా) పంచమ స్థానం బుధ క్షేత్రము గాని, శని క్షేత్రము గాని, అయి అందు శని గుళికలు వుండిన, అధవా చూచినను, అప్పుడు దత్తాదులే పుత్రులుఅగుదురు.
భంగ్యగతరేణ దత్తపుత్రయోగః
శ్లో) సంపూర్ణ జలసంయుక్తః పుత్రస్థానగతశ్శుభః!
అదృష్టఃపుత్రనాధేన తదాదత్తాదయస్సుతాః!!
తా) పంచమ స్థాన మందు సంపూర్ణ బలవంతుడైన శుభ గ్రహము ఉండి, పుత్ర స్థానాధిపతిచే చూడకున్నను, దత్తాదులే పుత్రులు.
మృతపుత్రయోగః
శ్లో) మృగమత్స్యగతేజీవే పుత్రస్థానాధిపేవ్యయే!
కర్కిసంస్థేబుధేయస్య తస్యపుత్రోమృతోభవేత్!!
తా) మకరము నందు గాని, మీనము నందు గాని, బృహస్పతి ఉండి, ద్వాదశమునందు పంచమ స్థానాధిపతి ఉండి, కర్కాటక మందు బుధుడుండిన, జాతకుడికి పుత్రుడు మృతుడగును.
పునఃప్రకారాంతరేణ దత్తపుత్రయోగః
శ్లో) మేషాత్పంచమగేమందే సూర్యేషష్టాష్టమవ్యయే!
కారకేబలహీనేచ దత్తపుత్రోభవేధ్ధృవం!!
తా) మేషమునకు పంచమమున శని యుండి, 6, 8, 12, లలో ఒక్కడైన సూర్యుడి ఉండి, పుత్రయోగకారకుడు బలహీనుడైయుండిన యెడల, ఆ జాతకునికి దత్తుడే పుత్రుడగునని నిశ్చయము.
శ్లో) వృషాత్పంచమగేసౌమ్యే కామేచంద్రేవ్యయేగురౌ!
ధర్మాధిపేవ్యయే నీచే దత్తపుత్రో భవిష్యతి!!
తా) వృషభమునకు పంచమమున బుధుడును, సప్తమము నందు చంద్రుడు, ద్వాదశ మందు బృహస్పతి యును, నవమాధిపతి నీచుడై ద్వదశమునందుండిన దత్తపుత్రుడగును.
శ్లో) నృయుగ్మాత్పంచమేసూర్యే శుక్రోకన్యాగతోయదా!
దృష్టిహీనేసుతస్థానే గురోర్దత్తాదయస్సుతాః!!
తా) మిథునమునకు పంచమమున సూర్యుడును, కన్యయందు శుక్రుడును, పుత్ర స్థానము బృహస్పతి దృష్టి రహితమై వున్న, యెడల దత్తాదులు దత్తపుత్రులగుదురు.
శ్లో) కుళీరాత్పంచమేచంద్రే భౌమేషష్టాష్టమస్థితే!
శుభాధిపేగురౌనీచే దత్తయోగాత్సుతంభవేత్!!
తా) కర్కాటకమునకు పంచమమున చంద్రుడును, షష్టమము నందు గాని అధవా సప్తమము నందు గాని అంగారకుడును, బృహస్పతి శుభస్థానాధిపతి నీచుడైయున్నయెడల, దత్తపుత్రయోగమువలన పుత్రప్రాప్తియగును.
శ్లో) మృగేర్కాపంచమేశుక్రే కామేరాహుసమన్వితే!
కారకేరిఫ్ఫసంస్థేచ దత్తయోగాత్సుతంలభేత్!!
తా) మకరమునందు సూర్యుడుండి, ఆ సూర్యునికి పంచమమున శుక్రుడును, సప్తమమునందు రాహువును, పుత్రకరకుడు ద్వాదశమందును ఉన్న యెడల, దత్తపుత్ర ప్రాప్తియగును.
శ్లో) అంగనాత్పంచమేసౌమ్యే లగ్నాత్కామేధరాసుతే!
కారకేమేషసంస్థేచ దత్తపుత్రోభవిష్యతి!!
తా) కన్యా రాశి పంచమమున బుధుడు లగ్నమునకు సప్తమమున కుజుడు, పుత్ర కారకుడు మేషము నందు ఉన్న యెడల దత్తపుత్రుడు అగును.
శ్లో) జూకలగ్నాద్దారగతే మాందౌవ్యోమగతేగురౌ!
పుత్రేనన్యస్వభావస్థే తస్యదత్తాదయస్సుతాః!!
తా) తులా లగ్నమునకు సప్తమమున గుళికుడును, దశ మునందు గురుడును, పుత్ర స్థానాధిపతి అన్యగ్రహ రాశి యందు ఉన్న యెడల దత్తాదిపుత్రులగుదురు.
దత్త పుత్ర మరణ యోగః
శ్లో) తృతీయలాభరంధ్రస్థే సుతేశేవ్యయసంస్థితే!
తస్యావసానసమయే దత్తపుత్రోమరిష్యతి!!
తా) పుత్ర స్థానాధిపతి 3, 11, 8, 12, ఎక్కడైనను ఉండిన యెడల, ఆజాతకునికి అవసానకాలమందు దత్తపుత్రుడు మృతుడగును.
దత్తపుత్రశత్రుయోగః
శ్లో) సుతేశేరిఃఫసంస్థేచ రిపునాథయుతేపిచ!
గురుదృష్టివిహీనేచ దత్తపుత్రోరిపుర్భవేత్!!
తా) పుత్ర స్థానాధిపతి ద్వాదశమందు గాని, సప్తమాధిపతితో చేరి గాని ఉండి, పుత్రయోగకారకుడు బలహీనుడై ఉండిన యెడల దత్తపుత్రుడు మృతుడగును.
పునర్దత్తపుత్రయోగః
శ్లో) మీనలగ్నాత్సుతాధీశే భాగ్యేభాగ్యాధిపేవ్యయే!
కారకేశత్రురాశిస్థే దత్తపుత్రోభవిష్యతి!!
తా) మీనలగ్నమునకు పంచమాధిపతి నవమమందును, నవమాధిపతి ద్వాదశమునందు ఉండి, పుత్రయోగకారకుడు శత్రుస్థానమందున్న యెడల దత్తపుత్రుడగును.
ఆపత్కాలేదత్తపుత్ర మృతియోగః
శ్లో) పంచమేనవమేపాపౌ కారకోదుర్బలోయది!
తస్యాపత్కాలసమయే దత్తపుత్రోమరిష్యతి!!
తా) 5, 9, లయందు పాపగ్రహములుండి, పుత్రకారకుడు బలహీనమైయున్న యెడల, ఆజాతకుని ఆపత్కాలమందు దత్తపుత్రుడు మృతుడగును.
.
అపుత్ర యోగః
శ్లో) గురులగ్నేశదారేశ పుత్రస్థానాధిపేషుచ!
సర్వేషుబలహీనేషు వక్తవ్యాత్వనపత్యతా!!
తా) బృహస్పతి, లగ్నాధిపతి, సప్తమాధిపతి,
పంచమాధిపతి, బలహీనులై ఉన్న యెడల సంతానం గలుగదని తెలియవలెను.
ప్రకారాంతరేణ అపుత్రయోగః
శ్లో) పుత్రస్థానంగతేపాపే తదీశేనీచసంస్థితే!
శుభదృష్టివిహీనేచ వక్తవ్యాత్వనపత్యతా!!
తా) పంచమమందు పాపగ్రహముండి, ఆ పంచమస్థానాధిపతి నీచస్థానమునుపొంది, శుభగ్రహదృష్టిలేకున్న యెడల, సంతానము కలుగదని తెలియవలెను.
శ్లో) పాపద్వయమధ్యగతేజీవే పుత్రాధిపేచబలహీనే!
సుతభేత్వశుభయుతే సంతతినాశోవినిర్దేశ్యః!!
తా) రెండు పాపగ్రహములమధ్యమందు గురువును, పంచమాధిపతి బలహీనుడుగాను, పంచమమున పాపగ్రహములును ఉన్నయెడల, సంతానహీనమని తెలియవలెను.
శ్లో) నీచారిమౌఢ్యోపగతేసుతేశే రిఫారిరంధ్రాధిపసంయుతేవా!
సుతశ్యనాశోకధితోత్రతద్ జ్ఞేః శుభైరదృష్టేసుతభేసుతేశే!!
తా) పుత్రస్థానాధిపతి నీచస్థానమునుగాని, శతృక్షేత్రమునగాని, మూఢత్వమునుగాని, పొందియుండినను అథవా ద్వాదశషష్టాష్టమాధిపతులతో చేరి, శుభగ్రహదృష్టి లేకుండి, పంచమమును శుభగ్రహము చూడకవుండినను పుత్రులుకలుగరని జ్యోతిశ్శాస్త్రజ్ఞులుచెప్పుదురు.
శ్లో) పంచమేనవమేపాపే తదీశేనీచసంస్థితే!
కారకేనీచరాశిస్థే వక్తవ్యాత్వనపత్యతా!!
తా) 5, 9 దులయందు పాపగ్రహములుండి, ఆ 5, 9 స్థానాధిపతులును పుత్రయోగకారకుడును నీచస్థానములయందు వున్నయెడల, సంతతికలుగదనవలయును.
శ్లో) మేషసింహాళినక్రేషు రాశ్యేకానవమాభవేత్!
తదీశేనయుతేక్లీబే వక్తవ్యాత్వనపత్యతా!!
తా) మేష సింహ వృశ్చిక మకరములలో ఒకటి నవమమై, ఆ నవమస్థానాధిపతి నపుంసక గ్రహముతో చేరియుండిన యెడల సంతానములేదని తెలియవలెను.
అపుత్ర యోగః
శ్లో) గురులగ్నేశదారేశ పుత్రస్థానాధిపేషుచ!
సర్వేషుబలహీనేషు వక్తవ్యాత్వనపత్యతా!!
తా) బృహస్పతి, లగ్నాధిపతి, సప్తమాధిపతి,
పంచమాధిపతి, బలహీనులైఉన్న యెడల సంతానం గలుగదని తెలియవలెను.
ప్రకారాంతరేణ అపుత్రయోగః
శ్లో) పుత్రస్థానంగతేపాపే తదీశేనీచసంస్థితే!
శుభదృష్టివిహీనేచ వక్తవ్యాత్వనపత్యతా!!
తా) పంచమమందు పాపగ్రహముండి, ఆ పంచమస్థానాధిపతి నీచస్థానమునుపొంది, శుభగ్రహదృష్టిలేకున్న యెడల, సంతానము కలుగదని తెలియవలెను.
శ్లో) పాపద్వయమధ్యగతేజీవే పుత్రాధిపేచబలహీనే!
సుతభేత్వశుభయుతే సంతతినాశోవినిర్దేశ్యః!!
తా) రెండుపాపగ్రహములమధ్యమందు గురువును, పంచమాధిపతి బలహీనుడుగాను, పంచమమున పాపగ్రహములును, ఉన్నయెడల సంతానహీనమని తెలియవలెను.
శ్లో) నీచారిమౌఢ్యోపగతేసుతేశే రిఫారిరంధ్రాధిపసంయుతేవా!
సుతశ్యనాశోకధితోత్రతద్ జ్ఞేః శుభైరదృష్టేసుతభేసుతేశే!!
తా) పుత్రస్థానాధిపతి నీచస్థానమునుగాని, శతృక్షేత్రమునగాని, మూఢత్వమునుగాని పొందియుండినను అథవా ద్వాదశషష్టాష్టమాధిపతులతో చేరి శుభగ్రహదృష్టి లేకుండి పంచమమును శుభగ్రహము చూడకవుండినను, పుత్రులుకలుగరని జ్యోతిశ్శాస్త్రజ్ఞులుచెప్పుదురు.
శ్లో) పంచమేనవమేపాపే తదీశేనీచసంస్థితే!
కారకేనీచరాశిస్థే వక్తవ్యాత్వనపత్యతా!!
తా) 5, 9దులయందు పాపగ్రహములుండి, ఆ 5, 9 స్థానాధిపతులును, పుత్రయోగకారకుడును, నీచస్థానములయందు వున్నయెడల సంతతికలుగదనవలయును.
శ్లో) మేషసింహాళినక్రేషు రాశ్యేకానవమాభవేత్!
తదీశేనయుతేక్లీబే వక్తవ్యాత్వనపత్యతా!!
తా) మేష సింహ వృశ్చిక మకరములలో ఒకటి నవమమై, ఆ నవమస్థానాధిపతి నపుంసక గ్రహముతో చేరియుండిన యెడల సంతానములేదని తెలియవలెను.
రేతస్కన్నలక్షప్రతిపాదకః
శ్లో) అధాతస్సంప్రవక్ష్యామి స్కన్నదోషంహిగర్భతః!
పితృశాత్తుసంప్రాప్త శ్రుణుష్వార్యేసుతప్రదమ్!!
శ్లో) లగ్నేశస్థిరరాశీశో రాహుణాసహితోయది!
మైథునేస్కన్నతాంరేతో వ్రజేచ్చాగర్భతామసాత్!!
తా) లగ్నాధిపతియుండు రాశ్యాధిపతితో రాహువుతో చేరియున్న యెడల గర్భమునుండి రేతస్సు జారిపోవును.
పిత్రుశాపాద్వీక్యస్కన్నయోగః
శ్లో) సుతానాధేరిసంస్థేచ చంద్రేణసహితేక్షితే!
కారకేవ్యోమ్నిగేస్కన్నం పితృశాపాద్భవిష్యతి!!
తా) పంచమాధిపతి షష్టస్థానమందుండినను, చంద్రునితో చేరినను, అధవా చూడబడినను, దశమమందు పుత్రయోగకారకుడున్న యెడల పితృశాపమువలన గర్భము జారిపోవును.
ప్రకారాంతరేణ వీర్యస్ఖన్నయోగః
శ్లో) నవమాధిపతేలగ్నౌ వ్యయేశసహితేమృగే!
మందదృష్టియుతేస్కన్నం పితృశాపాద్భవిష్యతి!!
తా) నవమాధిపతి లగ్నంమందును, ద్వదశాధిపతి మకరమందుండి, శనిచే చూడబడుచున్నయెడల పితృశాపములవలన గర్భము నిలువదనితెలియవలేను.
శ్లో) పంచమాధిపతౌకామే కామేశేరిఃఫగేబుధే!
పాపదృష్టియుతేస్కన్నం పితృశాపాద్భవిష్యతి!!
తా) పంచమాధిపతి సప్తమమందును, సప్తమాధిపతి ద్వాదశమందును, బుధుడు పాపగ్రహముచే చూడబడుచున్న యెడల, పితృశాపమువలన గర్భము జారిపోవును.
శ్లో) జాయాస్థానాధిపేక్రూరే సుతేశేనయుతక్షితే!
జాయాయారజసోత్పత్తే ర్బాధాస్యాదుదరేబహు!!
తా) పాపగ్రహము సప్తమాధిపతియై, పంచమాధిపతితో చేరిగాని చూడబడిగాని యున్న యెడల, భార్యకు రజస్సుపుట్టు కాలమున హృదయమందు బహుబాధకలుగును.
శ్లో) కామేశేరిపుభావస్థే రిపునాధేవిలగ్నగే!
రజఃప్రాదుర్భవాత్తస్య జాయాయాఉదరేవ్యధా!!
తా) సప్తమాధిపతి షష్టమమందును, షష్టాధిపతి లగ్నమందును వున్నయెడల, ఆ పురుషుని రేతస్సువలన భార్యకు బాధకలుగును.
శ్లో) కామేశేసుతభావస్థే సుతేశేచంద్రసంయుతే!
వ్యయస్థేరజసఃప్రాక్స్యా త్పరంవాహ్యుదరంవ్యధా!!
తా) సప్తమాధిపతి పంచమమందును, పంచమాధిపతి చంద్రునితోచేరి ద్వదశమందును ఉన్నయెడల, రజస్సుపుట్టుటకు ముందు గాని పుట్టిన అనంతరముగాని ఉదరమునందు వ్యధకలుగును.
శ్లో) సుతస్థానాధిపేభౌమే జాయానాధయుతేక్షితే!
భక్షితంక్రిమిభిస్తత్ర రేతోగర్భభవేన్నృణామ్!!
తా) కుజుడు పంచమస్థానాధిపతియై, సప్తమస్తానాధిపతితో చేరిగాని చూడబడిగాని ఉన్నయెడల, గర్భమందురేతస్సు క్రిములచే భక్షింపబడును.
శ్లో) నవమేపాపసంయుక్తే దారేపాపసమన్వితే!
గురౌపాపేనసంయుక్తే క్రిమికూపోపజాయతే!!
తా) నవమమందును సప్తమమందును పాపగ్రహములుఉండి, గురువు పాపగ్రహయుక్తుడై యుండిన యెడల, క్రిమికూపమౌను అనగా గర్భము క్రిములకు స్థానమగును.
గర్భస్రావయోగః
శ్లో) దారేశస్థితరాశీశో రవిణాస్తంగతోయది!
కారకోనీచరాశిస్థో గర్భస్రావోహిజాయతే!!
తా) సప్తమాధిపతియుండు రాశ్యాధిపతి సూర్యునిచేరి అన్తుడుగాను, పుత్రయోగకారకుడు నీచరాయందును, ఉన్నయెడల గర్భస్రావమగును.
శ్లో) మేషూరణగతశ్చంద్రో గురుసప్తమగోయది!
సుతేశోబలహీనశ్చే త్స్రావగర్భోహిజాయతే!!
తా) దశమమందు చంద్రుడును, సప్తమమందు గరువును, పంచమస్థానాధిపతి బలహీనుడుగాను వున్న యెడల,
గర్భస్రావమగును.
శ్లో) మేషలగ్నేసముత్పన్నే పంచమేశేవ్యయంగతే!
పంచమేచంద్రమాంద్యోశ్చే త్తదాస్రావోభవిష్యతి!!
తా) మేషము జన్మలగ్నమై పంచమాధిపతి ద్వాదశమందును, పంచమమందు చంద్ర గుళికుడు ఉన్న యెడల గర్భస్రావమగును.
శ్లో) వృషభాత్పంచమేశుక్రే తధీశేషష్ఠరాశిగే!
కారకేవ్యోమరాశిస్థే స్త్రీగర్భోజాయతేతధా!
పుంగర్భోజాయతేస్రావః క్వచిద్గర్భోభవిష్యతి!!
తా) వృషభలగ్నమునకు పంచమమున శుక్రుడును, ఆ పంచమాధిపతి షష్ఠమందును, పుత్రయోగకారకుడు దశమమందును ఉన్న యెడల, స్త్రీగర్భముజీవించును. పురుషగర్భము స్రావమగును. ఒకానొకప్పుడు గర్భమౌను.
శ్లో) మిథునాత్పంచమేశుక్రే సపాపేస్తంగతేపివా!
కరకేణయుతేదృష్టే గర్భస్రావోభవిష్యతి!!
తా) శుక్రుడు పాపగ్రహములతో చేరిగాని అస్తంగతుడైగాని మిథునలగ్నమునకు పంచమమందుండి పుత్రయోగకారకుడితో చేరిగాని చూడబడిగాని ఉన్న యెడల గర్భస్రావమగును.
శ్లో) కుళీరాత్పంచమేచంద్రే శనిదృష్టేయుతేతధా!
కారకేమూఢసంయుక్తే గర్భస్రావోభవిష్యతి!!
తా) చంద్రుడు శనితోచేరిగానీ చూడబడిగాని కర్కాటకమునకు పంచమమందును, పుత్రయోగకారకుడు మూఢయుక్తుడుగాను ఉన్న యెడల గర్భస్రావమగును.
శ్లో) సింహాత్పంచమగేమందే మందాత్షష్ఠంగతేగురౌ!
తదీశేవ్యయరాశిస్థే జాయతేస్రావదశ్శిశుః!!
తా) సింహమునకు పంచమమున శనియును, ఆ శనికి షష్ఠమమున బృహస్పతియును, ఆ షష్ఠాధిపతి ద్వాదశమందును ఉన్న యెడల, గర్భస్రావమగును.
రక్తస్రావయోగః
శ్లో) కన్యాయాస్సుతగేజీవే జీవాత్పంమతశ్శశీ!
చంద్రాత్పంచమగేభౌమే రక్తస్రావోభవిష్యతి!!
తా) కన్యాలగ్నమునకు పంచమమున బృహస్పతియును, బృహస్పతికి పంచమమున చంద్రుడును, చంద్రుడికి పంచమమున కుజుడును ఉన్న యెడల రక్తస్రావమగును.
శ్లో) జూకాత్కామేధరాసూనౌ మందయుక్తేధవాభృగౌ!
రక్తస్రావాచ్ఛిశోర్నష్ఠం భవిష్యతినసంశయః!!
తా) కుజుడు శుక్రునితో గాని శనితో గాని చేరి తులా లగ్నమునకు సప్తమమునందుండిన, యెడల రక్తస్రావమువలన శిశు నాశనమౌను.
శ్లో) కీటాత్సుతగతేచంద్రే రాహుణాసహితేక్షితే!
కోదండాద్వాతధాచంద్రే గర్భస్రావోభిజాయతే!!
తా) చంద్రుడు రాహువుతో చేరిగాని చూడబడిగాని వృశ్చిక లగ్నమునకుగాని ధనుర్లగ్నమునకుగాని పంచమమునందుండిన యెడల గర్భస్రావమగును.
శ్లో) నక్రాత్కుంభాత్సుతేసౌమ్యే శత్రుయుక్తేక్షితేధవా!
కారకేరంధ్రరిఃఫారి సుతేస్రావోభిజాయతే!!
తా) బుధుడు శత్రుగ్రహముతో చేరిగానీ చూడబడి గాని, మకరమునకుగాని కుంభమునకు గాని పంచమమందును, పుత్రయోగకారకుడు షష్ఠాష్టమద్వాదశములయందుగాని ఉన్న యెడల గర్భస్రావమగును.
శ్లో) మీనాత్పంచమగేసూర్యే సూర్యాత్పంమగశ్శశీ!
కామేశేబలహీనేచ గర్భస్రావోహిజాయతే!!
తా) మీనమునకు పంచమమున సూర్యడు, సూర్యునికి పంచమమున చంద్రుడు, సప్తమాధిపతి బలహీనుడుగా యున్న యెడల గర్భస్రావమగును.
శ్లో) సుతేశేకామరాశిస్థే కామేశేనిధనంగతే!
తత్స్రావంతుత్వచాజాతం భవిష్యతినసంశయః!!
తా) పంచమాధిపతి సప్తమమందును, సప్తమాధిపతి అష్టమమందును ఉన్న యెడల చర్మముతోడ గర్భస్రావమగును.
శ్లో) పుత్రేశేవ్యయరాశిస్థే వ్యయేశేసుతరాశిగే!
కారకేశత్రుసంయుక్తే గర్భస్రావోభిజాయతే!!
తా) పంచమాధిపతి ద్వాదశమందును, ద్వాదశాధిపతి పంచమమందును, పుత్రయోగకారకుడు శత్రుగ్రహముతో చేరి ఉన్న యెడల గర్భస్రావమగును.
శ్లో) పంచమేనవమేచంద్రే రవిణాసంయుతేక్షితే!
కారకేనీచరాశిస్థే గర్భస్రావోభవిష్యతి!!
తా) చంద్రుడు సూర్యునితో చేరిగానీ చూడబడిగాని పంచమమునగాని నవమమునగాని ఉండి, పుత్రయోగకారకుడైన బృహస్పతి నీచరాశియందు ఉన్న యెడల గర్భస్రావమగును.
శ్లో) నీచరాశిగతేసూర్యే సుతేశేనయుతేక్షితే!
కారకేణయుతేవాపి స్రావోగర్భస్యసంభవేత్!!
తా) సూర్యుడు నీచరాశియందుండి, పంచమాధిపతితోకాని, పుత్రయోగకారకుడగు బృహస్పతితోకాని చేరిఉండినను, అథవా చూడబడినను గర్భస్రావమగును
Comments
Post a Comment