ఆశ్రయించ కూడని వారు...

ఆపత్కాలంలో (కష్ట కాలంలో) కూడా ఆశ్రయించ కూడని వారు......ఎవ్వరో తేలుసుకోండి!

1. షండుడు : సకాలంలో స్నానం చేయని వాడు, దేవతలను, తల్లిదండ్రులను గౌరవింపనివాడు.

2. మార్జానుడు :- అహంకారం తోను, నిర్లక్ష్యం తోను, జప, తపాలు చేసేవాడు.

3. అఖువు :- కావలసినన్ని సంపదలు ఉన్నా తాను తినక, ఇతరులకు పెట్టని వాడు.

4. కుక్కుటుడు :- పక్షపాతం తో తీర్పులు చెప్పేవాడు.

5. పతితుడు :- తన ధర్మం విడిచి పరధర్మం ఆచరించేవాడు.

6. అపవిద్దుడు :- గో హత్య, స్త్రీ హత్య మొదలగు పాతకాలు చేసే వాడు.

 7. నగ్నుడు :- దైవ భక్తి లేనివాడు.

8. ఛండాలుడు :-ఎంతో ఆశతో వచ్చినవానికి, తాను సహాయపడక, ఇతరులు కూడా సహాయపడకుండా అడ్డుపడే వాడు, మరియూ శరణు కోరి వచ్చేవానిని గాలికి వదిలేసేవాడు.

9. అధముడు :- బంధువులు, స్నేహితులు, ఉత్తములు మొదలగువారికి దూరమైనవాడు.

ఇలాంటి వారిని ఎంత కష్టదశలో ఉన్నా వారిని ఆశ్రయించరాదు అని విజ్ఞులైన మన పెద్దలు చెప్పారు.

     తస్మాత్ జాగ్రత్త! 🙏

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

శ్రీ లలిత దేవి చరిత్ర Part-12

KAPU SURNAME AND GOTRALU: