-------------/////// నక్షత్ర గణన /////////-----------
-------------/////// నక్షత్ర గణన /////////-----------
నక్షత్రాలను దేవ, రాక్షస, మానవ గణాలుగా విభజించారు. జ్యోతిషశాస్త్రంలో గణాలను అనుసరించి వ్యక్తుల గుణగణాలను గణిస్తారు. అదే విధంగా ఆది నాడి, అంత్య నాడి, మధ్య నాడి అని ముడు రకాలుగా నాడీ విభజన చేశారు.
భారతీయ సనాతన సంప్రదాయంలో జ్యోతిషశాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా గ్రహాలు కదలిక ఆధారంగా, పుట్టిన జన్మ నక్షత్రం ఆధారంగా మనుషుల జాతకాలను అంచనా వేస్తారు. ముఖ్యంగా జన్మ నక్షత్రాల బలాలు ఆధారంగా వారి భవిష్యత్తును తెలుసుకోవచ్చని నమ్ముతారు. జ్యోతిషం ప్రకారం నక్షత్రాలకు అధిపతులుగా గ్రహాలు, ఆది దేవతలుగా దేవతలు ఉంటారు. నక్షత్రాలను దేవ, రాక్షస, మానవ గణాలుగా విభజించారు. జ్యోతిషశాస్త్రంలో గణాలను అనుసరించి వ్యక్తుల గుణగణాలను గణిస్తారు. అదే విధంగా ఆది నాడి, అంత్య నాడి, మధ్య నాడి అని ముడు రకాలుగా నాడీ విభజన చేశారు.
జన్మరాశులు అనుకూలతలు
ఇదే సమయంలో ఒక్కో నక్షత్రానికి ఒక్కో జంతువు, పక్షి, వృక్షం ఉంటాయి. కొన్నింటిని స్త్రీ నక్షత్రాలని, మరికొన్నింటిని పురుష నక్షత్రాలని విభజించారు. వరహామిహిరుడు రచించిన బృహత్సంహితలో ఈ నక్షత్రాల లక్షణాల గురించి వివరించారు. అశ్వని నక్షత్రం మొదలుకుని రేవతి వరకు 27 తారల లక్షణాలను ఇందులో తెలియజేశారు. జనన సమయంలో నక్షత్రాల ఆధారంగా జన్మరాశిని నిర్ణయించి వారి లక్షణాలను అంచనా వేస్తారు.
నక్షత్రాల లక్షణాలివే..
అశ్వని: చక్కని రూపం, దక్షత కలిగినవారు, నీతివంతులు, ప్రియభాషణులు.
భరణి: దృఢ నిశ్చయం, సుఖమంతులు, సత్యవ్రతులు, ఆరోగ్యవంతులు.
కృత్తిక: ప్రఖ్యతులు, తేజోవంతులు.
రోహిణి: సత్యవంతులు, శుభ్రత, ప్రియంవద, స్థిరమైన బుద్ధి, విద్వాంసులు.
మృగశిర: చపలచిత్తులు, ఉత్సాహవంతులు, చతురులు, భోగులు, భీకరులు.
ఆరుద్ర: గర్వం కలిగి ఉంటారు, కృతఘ్నులు, సొంతవారిపై ప్రేమ కురిపిస్తారు.
పునర్వసు: మంచి స్వభావులు, అల్ప సంతోషులు, రోగులు.
పుష్యమి: శాంతస్వభావులు. పండితులు, ధర్మ పరాయణులు.
ఆశ్లేష: సర్వ భక్షకులు, కృతఘ్నులు, అమాయకులు , సున్నితమనస్కులు.
మఖ: భోగులు, ధనవంతులు, పితృ భక్తులు, మహోద్యమకారులు.
పూర్వఫల్గుణి (పుబ్బ): ప్రియ వచనాలు పలుకుతారు, దాతలు, ద్యుతిమానులు, రాజసేవకులు.
ఉత్తరఫల్గుణి (ఉత్తర): భోగులు, సుఖమయ జీవనం, విద్యావంతులు.
హస్త: ఉత్సాహవంతులు, చోర స్వభావం కలిగినవారు.
చిత్త: మీన నేత్రులు, గడసరులు, చమత్కారులు.
స్వాతి: కృపాళులు, ప్రియ వాక్కు కలవారు, ధర్మాశ్రితులు.
విశాఖ: ఈర్ష్యాపరులు, ద్యుతులు, మాన్యవచనులు.
అనురాధ: విదేశీయానంపై మక్కువ, ధర్మాత్ములు.
జ్యేష్ఠ: మిత్రులను కలిగి ఉంటారు, సంతృప్తి, కోప స్వభావం కలవారు.
మూల: లక్ష్మీపుత్రులు , స్ధిర మనస్కులు, జీవితంలో సుఖపడతారు.
పూర్వషాడ: సౌహార్ద్ర హృదయులు, ఇష్ట పూర్వకంగా పనిచేస్తారు, కళలపై మక్కువ.
ఉత్తరాషాడ: ధార్మికులు, మిత్రులు, కృతజ్ఞత కలిగి ఉంటారు.
శ్రవణం: ఉదార స్వభావం, కీర్తి ప్రతిష్ఠలు, ధనవంతులు.
ధనిష్ట: దాతలు, ధనలబ్ది, సంగీత ప్రియులు.
శతభిషం: సాహసికులు, కోప స్వభావం, వ్యసనపరులు.
పూర్వాభాద్ర: ఆనందాన్ని తృప్తిగా అనుభవించలేరు, ధనవంతులు, దాతలు.
ఉత్తరాభాద్ర: ఎక్కువ సంతానం, ధార్మికులు, జితశత్రులు, వక్తలు.
రేవతి: శూరులు, శుచివంతులు, సుభగులు, సంపూర్ణంగులు
Comments
Post a Comment