🌸 వధూవరుల జన్మకుండలి విశ్లేషణ 🌸
🌸 వధూవరుల జన్మకుండలి విశ్లేషణ 🌸
వధూవరుల జాతకములు వివాహ విషయంలో ఎంతవరకు సరిపోయినవో చూడటం చాలా అత్యవసరము. రవి, చంద్ర, కుజ, శక్తుల గురించి
7, 8వ స్థానముల విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి.
1. వధువు యొక్క చంద్రరాశి వరుని యొక్క లగ్నము అయిన లేదా వరుని యొక్క చంద్రరాశి వధువు యొక్క లగ్నమయినా మంచిది.
2. వధూవరులది ఏక లగ్నమయినా మంచిది.
3. వధూవరుల చంద్రరాశులకు ఒకే గ్రహము అధిపతి అయినా, రాశ్యాధిపతులు, లగ్నాధిపతులు, పరస్పర మిత్రులయినా శుభము.
4. వధూవరులలో ఒకరి జాతకములో చంద్రరాశికి ఇంకొకరి జాతకంలో చంద్రరాశి 1, 3, 4, 7, 10, 11 స్థానాలలో ఉంటే మంచిది.
5. వధూవరులలో ఏ ఒకరి జాతకంలో అయినా ఏడవ స్థానంలో పూర్ణచంద్రుడుగాని గురుడు గాని ఉంటే మంచిది.
6. లగ్న సప్తమాధిపతులుగాని ద్వితీయ సప్తమాధిపతిగాని కలిసి ఉంటే మంచిది.
7. లగ్నసప్తమాధిపతిగాని, శుక్రుడుగాని చూసిన మంచిది.
8. వధూవరులలో ఒకరి జాతకంలో రవి వున్న రాశికి ఇంకొకరి జాతకంలో 1, 3, 4, 8,10,11 స్థానములలో రవి ఉన్న శుభము.
9. వరుని యొక్క లగ్నానికి 8వ ఇంట వధువు యొక్క జాతకములో రవి ఉన్న శుభము
10. వధూవరుల జాతకములలో శుక్రుడున్న స్థానాధిపతులు పరస్పర కేంద్రకోణములలో ఉంటే మంచిది..
11. వధూవరుల జాతకములలో లగ్న సప్తమరాశ్యాధిపతులు పరస్వర కేంద్ర కోణములలో ఉంటే మంచిది.
12. ఒకరి జాతకంలో చంద్రుడు, ఇంకొకరి జాతకంలో సప్తమాధిపతి పరస్పర కేంద్రకోణములలో ఉంటే శుభము.
13. వధూవరుల జాతకములలో ఒకరి లగ్నము ఇంకొకరికి సప్తమ స్థానమైనను, సప్తమాధిపతి వున్న రాశి యైనను. శుక్రుడున్న రాశి అయినను అనుకూలము.
14. వధూవరుల జాతకములలో భాగ్యాధిపతులు పరస్పర కేంద్రకోణములలో ఉన్న భాగ్యప్రదము.
15. కర్కాటక, మకరాలు, సింహ కుంభాలు వదలి మిగిలిన వధూవరుల లగ్నములు రవి చంద్రుల ఏకాధిపత్యములో సమసప్తకములో గాని ఉన్న అనుకూలము.
16. వధూవరులు జాతకాలలో కుజుడు గాని, శుక్రుడు గాని, కుజ శుక్రులు, కుజ శనులు, శుక్ర శనులు, శుక్ర చంద్రులుగాని ఒకే స్థానంలో ఉంటే సమసప్తకములో వున్న వివాహ యోగ్యము.
17. వరుడు లేక వధువు జన్మ లగ్నము నుండి గాని, చంద్ర లగ్నము నుండి గాని రెండవ వారి జాతకములో 5 - 9, లేక 1 - 5 లేక 1 - 9 లగ్నములలో కుజ శుక్రులున్న మంచిది.
🌸 నామ నక్షత్రము. 🌸
వివాహము కేవలము సంసార సుఖ భోగములకే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీని వలన వారి భవిష్యత్తు ఉత్తరోత్తరా ఎంతగానో దెబ్బతింటున్నది. పురుషార్థాలైన ధర్మార్ధకామమోక్షాలకు మూలమైనది. ఇహపర సాధనకు వివాహము మూలము. ఇట్టి వివాహ విషయములో వధూవరుల జాతకాలు ముందుగానే పరిశీలించాలి. ఆరోగ్యం, ఆయుర్భావం, సంతానం, ప్రవర్తన మొదలగు విషయాలు 1, 2, 5, 7, 8, 9 స్థానాలను బట్టి గ్రహించాలి.
వివాహ లగ్నమును మంచి రోజు చూసుకుని సకల దేవతలను పూజించి నమస్కరించిన తరువాత మాత్రమే నిర్ణయించవలెను.
వధువు సంప్రదాయ బద్దమైనదిగాను, సద్గుణ సంపన్న వంతురాలు అయి ఉండవలెను.
స్వకులము, స్వగోత్రము అయిన వారికి వివాహము చేయరాదు. వధువును ఇచ్చే ముందు వరుని వంశము, శీలము, వయస్సు, విద్య, మొదలగు ఎన్నో విషయాలు దృష్టిలో ఉంచుకుని సరిచూసుకుని వివాహం చేయవలెను.
వివాహము అవబోయే వధూవరుల యొక్క నక్షత్రములను పరిశీలించవలెను. వధూవరుల ఇద్దరి జన్మనక్షత్రము తెలియకపోతే నామ నక్షత్రమును పరిగణనలోకి తీసుకోవచ్చు. ఒకరికి జన్మనక్షత్రమును, మరొకరికి నామనక్షత్రమును పరిగణనలోకి తీసుకోరాదు.. -నామ నక్షత్రములు ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. అలాగే ఒక్కొక్క నక్షత్రానికి 4 అక్షరాలు ఉంటాయి.
.....
వధూవరుల యొక్క నక్షత్రము ఒకటే అయినా రాశి ఒకటిగా ఉండరాదు.
వధూవరుల ఎకరాశి భిన్న నక్షత్రమయిన, భిన్నరాశి ఏక నక్షత్రమయినా గణదోషము, నాడీదోషము ఉండదు. నక్షత్రము ఒకటయినా పాదము వేరుగా ఉన్న దోషము ఉండదు.
ఒకే నక్షత్రం, ఒకే పాదం, ఒకేరాశి అయితే ప్రాణహాని కలుగుతుంది.
Comments
Post a Comment