జ్యోతిషం - కాలజ్ఞానం

ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మాత్రే నమః
ఓం వం అమృతవర్షిణ్యై నమః

జ్యోతిషం - కాలజ్ఞానం

నేను వాతవరణ పంచాంగంపై పరిశోధన మొదలుపెట్టినప్పుడు కొన్ని సందేహాలు వచ్చాయి. అందులో కాలం ఏమిటి? ఋతువులు ఏమిటి? వాతావరణం ఏమిటి? వర్షాలు.... చలి... ప్రకృతిలో జరుగుతున్న మార్పులు ఏమిటి? అని తెలుసుకోవడానికి పరిశోధన చేసినపుడు, కాలం యొక్క ప్రాధాన్యత తెలిసింది. కాలానికి జ్యోతిషానికి సంబంధం ఏమిటి అని డటా కలెక్ట్ చేసినపుడు కొన్ని విషయాలు తెలుసుకొని ఆశ్చర్య పోయాను. ఈ బ్రహ్మండం కాలానుగుణంగా ఒక నియమం ప్రకారం సంచరిస్తుంది. ప్రకృతిలోని మార్పులు కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నాయి.

ప్రకృతిపైన, ప్రకృతిలోని జీవులపైన ఏ యే కాలాల్లో ఎటువంటి ప్రభావలుంటాయో తెలుసుకొనేది కాలజ్ఞానం. ప్రతి విషయంలో రెండో కాలాలు ఉంటాయి. అవి మంచి చెడు కాలాలు. శుభాశుభ కాలాలు. ప్రకృతిపై వేరువేరు కాంతులు మంచి ప్రభావం కలిగించే కాలాన్ని శుభాకాలమనీ, చెడు ప్రభావం కలిగించే కాలాన్ని అశుభ కాలమనీ అంటారు. ఏ కాలం శుభమౌతుందో ఏది ఆశుభామౌతుందో తెలుసుకొని మసలుకోవడం కాలజ్ఞానం. ఈ కాలజ్ఞానం అంతా జ్యోతిస్సులపైన, జ్యోతిషశాస్త్రం ద్వారా తెలియజేసే సూత్రలపైన ఆధారపడి ఉంటుంది. మంచి కాలంలో మంచిని పెంచుకొనే ప్రయత్నం, చెడ్డ కాలంలో పరిహారాల ద్వారా చెడును నిరోధించే మార్గంలో ప్రయత్నాలు (జప, హోమ, తప, దాన, ధ్యానాదులు) చేయడం ద్వారా జీవితంలో మంచి ఫలితాలను సాధించుకోవడం నేర్పరుల లక్షణం.

కాలజ్ఞానంపై అవగహన లేకుండా జ్యోతిషశాస్త్రమును అభ్యసించటం అవివేకమే అవుతుంది.

కాలమును క్షణ, నిమిష, ఘడియ, పగలు, రాత్రి, దినము, వారము, మాసము, సంవత్సరముల నుంచి యుగాలు, కల్పాలు వరకు అనేక విధాలుగా లెక్కకట్టి చెప్పింది 'జ్యోతిషశాస్త్రము'. సూర్య సిద్ధాంతం ప్రకారం, వేదాలలో కాలమును మూర్త, అమూర్తగాను వివరించారు. మూర్త అంటే స్థూలంగా కనిపించే కాలం అంటే గణించగల కాలం, అనుభవంలోకి వచ్చేకాలం. ఉదా : నిమిషం, గంట, వారం, మాసం, సంవత్సరం... వంటివి. అలాగే అమూర్త అనగా సూక్ష్మంగా ఉన్నది. అనుభవంలో కనిపించని కాలం. ఉదా : తృటి, రేణు, లవ.. వంటివి, అంటే 1000 కమలం పువ్వు రేకులపై పదునైన సూదితో కుచ్చితే, ఒక పూరేకులో ఆ సూది దిగిన సమయం తృటి అంటాం. ఈ విధంగా మహర్షులు కాలన్ని గణించిన విధానం అద్భుతం.

వేదాలలోని అనేక మంత్రాలలో సూర్యచంద్రాదుల గూర్చి, వివిధ నక్షత్రాల నక్షత్ర మండలాలు, వాటి శుభాశుభ ఫలితా విచారణ, కాలం, రాత్రింబవళ్ళు, మాసాలు, ఋతువులు, ఆయనాలు మొదలైన వాని గూర్చి
వివరాలున్నాయి.

వేదకాలంలో యజ్ఞ యగాదులకు అనుకూలమైన కాలనిర్ణయం కోసం జ్యోతిషశాస్త్రంను వాడేవారు. కాలక్రమేణ ఈ శాస్త్రం భవిష్యత్ తెలిపే శాస్త్రంగా పరిణమించింది.

మన భారత దేశంలో సూర్య చంద్రులే కాల ప్రమాణానికి ఆధారం. వారి గమనాన్ని ఆధారంగా చేసుకోని కాలాన్ని నిర్ణయించారు మన మహర్షులు.

మన భారతీయ జ్యోతిష సిద్ధాంతాల ప్రకారం... మన వైదిక జ్యోతిషం భూకేంద్రక సిద్ధాంతం. భూమిపై నుంచి చూస్తున్నపుడు.. కాలము, ఆకాశంలో కనపడే జ్యోతిషులు జ్యోతిష శాస్త్రానికి ప్రమాణాలు అయినవి. అనగా కాలము, జ్యోతిషులను అనుసరించి రాశిచక్రంను నిర్ణయించడం జరిగినది.

కేప్లర్ మొదటి సూత్రం ప్రకారం సూర్యున్ని చూట్టు గ్రహాలు దీర్ఘ వృతకార కక్ష్యలలో సంచరిస్తున్నాయని ధృవీకరించిన... భూమిపై ఆకాశాన్ని చూస్తూన్న మనకు క్షితిజం నుంచి పడమర వరకు ఒక అర్ధ వృతకారంగానే కనిపించుట మూలంగా క్రాంతి చక్రమును వృత్తముగానే తీసుకొని 360°గా నిర్ణయించారు. ముఖ్యంగా వివిధ సమయాలలో కనిపించే నక్షత్ర స్థానాలను బట్టి, ఆ నక్షత్రాలను మైలు రాళ్ళుగా తీసుకొని సూర్యచంద్రంల సంచారం, వాటి గతులను బట్టి, కాలం, నక్షత్రాల మరియు రాశుల విభజన జరిగినది.

పగలు, తరువాత రాత్రి, రాత్రి తరువాత పగలు... ఈ విధంగా క్రమంగా పగలు రాత్రి వస్తునే ఉంటాయి. వైదికశాస్త్రం ప్రకారం, సూర్యోదయం నుంచి మళ్లి సూర్యోదయం వరకు ఒక రోజుగా నిర్ణయించారు.

నక్షత్రాలను గమనించినపుడు చంద్ర సంచారన్ని బట్టి చంద్రుడు ఒక నక్షత్రం నుంచి తిరిగి మళ్లీ అదే నక్షత్రంలోకి రావడానికి సుమారుగా 27.3 రోజులు పడుతుంది. అనగా ఒక రోజుకు చంద్రుని సంచారం సగటున 13°20గా తీసుకొన్నపుడు,
13°20' X 27 నక్షత్రాలు = 360" ఒక భచక్రం అయినది. కాబట్టి ఒక నక్షత్రం అంటే రాశిచక్రంలో 13"20' నిడివి/దూరం, ఆ ప్రదేశంలో ఉన్న నక్షత్ర సముహాం.

మాసాల విషయానికి వస్తే చంద్రునికళలు ఒక నిర్ణీత క్రమంలో మారుతున్నాయి. పూర్ణిమ నుంచి పూర్ణిమకు సూమారు 30 రోజులు పడుతుంది. 30 రోజులను ఒక మాసం/నెలగా తీసుకొన్నారు. పౌర్ణమి రోజు చంద్రుడు. ఉన్న నక్షత్రం ఆధారంగా ఆ మాసానికి పేరు పెట్టారు. ఉదా: పౌర్ణమి రోజు చిత్త - చైత్రం, విశాఖ - వైశాఖం, జ్యేష్ట జ్యేష్టం. అలాగా 12 మాసాలు.

చంద్రుడు ఒక నక్షత్రంలో ఉండగా వచ్చే పౌర్ణమి, తిరిగి అదే నక్షత్రంలో 13వ మాసంలో పౌర్ణమి తిరిగి రావడం గమనించి 12 మాసల తరువాత అదే నక్షత్రంలో పౌర్ణమి తిరిగి వస్తుందని గమనించారు. అలాగా 12 మాసాలు ఒక చాంద్ర సంవత్సరంగా నిర్ణయించారు.

భూమి సూర్యుని చుట్టు ఒకసారి తిరిగి రావడానికి 12 మాసాలు పడుతుంది. 12 మాసాలు కలిస్తే ఒక సంవత్సరంగా నిర్ణయించారు. రవి ఒక మాసంలో సంచరించే సమయాన్ని బట్టి రాశి నిడివిని 30°గా, ఒక సంవత్సరంలో రవి సంచరించే విధానాన్ని బట్టి భచక్రమును 12 భాగాలుగా.. అనగా 12 రాశులుగా విభజించారు. అంటే ఒక రాశి 30° అయితే, 30° X 12రాశులు = 360° రాశిచక్రం అవుతుంది. అలాగే 27 నక్షత్రాలను 108 పాదాలుగా విభజించి, ప్రతి రాశికి సమంగా 9పాదాలు చోప్పున కేటాయించి రాశులలో నక్షత్రాలను కూడా పొందుపరిచారు.

చాంద్రమానం ప్రకారం ఒక సంవత్సరం 354 రోజులు. సౌరమానం ప్రకారం ఒక సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి. సౌరమాన సంవత్సరంలో చాంద్రమాన సంవత్సరం కన్న 11 రోజులు ఎక్కువగా ఉంటాయి. కావున చాంద్ర మానంలో సుమారుగా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి 13 మాసాలు వస్తాయి. దీనినే అధిక మాసం అంటారు. ఈ అధిక మాసం వల్ల చాంద్ర సౌర సంవత్సరాలకు మధ్య సమన్వయమేర్పడుతుంది. (అధికమాసం అంటే రవి సంక్రమణ లేని చాంద్ర మాసం). ప్రస్తుతం వాడుకలోన్న గ్రెగొరియాన్ కాలెండర్ లేకుండా మన చాంద్రమానం ప్రకారమే కాలాన్ని చూస్తే ఏ విధంగా ఉంటుందో ఉహించండి. మన వైదిక శాస్త్రాల విశిష్టత అప్పుడే మాత్రమే తెలుస్తుంది. కాలగణన ఎందుకు ఇలా చేసారో, ఈ పద్ధతులు ఎందుకు వాడరో అర్ధం అవుతుంది. ఒక పద్ధతిలో జరుగుతున్న గ్రహల సంచారన్ని అనుసరించి బట్టి కాలగణన చేసారని అర్థం అవుతున్నది.

భూమిపై నుంచి చూస్తున్నపుడు, రాశిచక్రం అనేది మనకు ఒక ఫ్రేమ్ లా కనపడుతూ ఉంటుంది. కాని, అక్కడ ఉన్న గ్రహాలు, నక్షత్రాలు ఒకదానికి ఒకటి ముందు వెనక చాలా చాలా దూరంలో ఉన్నాయి. ఆకాశంలో చాలా నక్షత్రాలు ఉన్నాయి. అన్నీ మనకు కనిపించటం లేదు. మన కంటి సామర్ధ్యం ఉన్నంత వరకు మాత్రమే మనకు నక్షత్రాలు కనపడుతున్నాయి. అలా ఆ నక్షత్ర/ ఖగోళ కాంతులు మనకు కనిపించినపుడే, వాటి ప్రభావం మనపై ఉంటుంది.

అలాగే ఈ విశ్వంలో శక్తి అనేది వివిధ రూపాలలో (light, sound, magnatic, heat, etc) ఉంటుంది. పరిస్థితులను బట్టి ఆ శక్తులు వివిధ రూపాలలోకి కూడ మారుతూ ప్రకృతికి అనుగుణంగా పని చేస్తూ ఉంటాయి. ఆ శక్తుల తత్వాల గురించి వేదాల ద్వారా పరిపూర్ణ జ్ఞానం పొందిన మన ఋషులు మనకు వివిధ గ్రంథాల రూపంలో అందించారు. అంటే మహర్షులు జ్యోతిషశాస్త్రం కంటే ముందు గణితశాస్త్రంపై, దాని కంటేముందు ఖగోళశాస్త్రంపై, దానికంటే ముందు వేదాలపై పరిపూర్ణ జ్ఞానం పొందారు. వారి కృషి ఎంతటిదో తెలుస్తుంది.

ఈ విధంగా ప్రకృతిలో ఏర్పడే వివిధ మార్పులను దైవాంశ సంభూతులైన మహర్షులు గమనించి విజ్ఞానవంతమైన కాలజ్ఞాన సంబంధిత విషయాలను ఈ జ్యోతిషశాస్త్రములో పొందుపరిచారు. ప్రకృతిలో సంభవించే వివిధ రకములైన వైపరీత్యాలను, సంఘటనలను, అధికమించుటకు ముందు జాగ్రత్తలను, ఖోగోళంలో సంచరించే గ్రహ స్థితిగతుల ద్వారా సూచించారు. దైవజ్ఞులు సూచించిన సూత్రాలను పాటించిన యెడల ఎన్నో విపత్తుల నుండి జాగ్రత్తలు తీసుకొనే అవకాశం ఉంటుంది.

ఈ విధంగా జ్యోతిషులు ప్రత్యేక సమయంలో ప్రత్యేక ప్రదేశంలో కనిపించినప్పుడు, ఆ సమయంలో చేయవలసిన యజ్ఞ యాగాదులు, పండగలు, తీసుకోవలసిన ఆహారం, జాగ్రత్తలు మరియు ఉండవలసిన నియమాలను ఈ శాస్త్రం ద్వారా తెలియజేయడం జరిగినది. మహర్షులు లోక కళ్యణం కోసం, అందరు కలిసి సంతోషంగా జీవించడమే లక్ష్యంగా మార్గదర్శనం చేశారు. భారతీయత అంటే ఏమిటో చెప్పారు. కాబట్టి మంచి సమయాన్ని సరిగ్గా వాడుకొని మంచి ఫలితాలను సాధించుకోవాలి. కర్మ పరిపక్వతను
సాధించుటకు కాలమే శరణం. కాలమే పరబ్రహ్మం...

ఇవే కాకుండా ఇంకా ఘడియలు, పక్షాలు, ఋతువులు, అయనాలు అనేక రకాలుగా కాల విభజన మరియు కాలమానాలు చేశారు. ఇంకా వివిధ గ్రహాల స్థితిగతులను, సంచారన్ని బట్టి కూడా చేసిన కాలనిర్ణయం ఏ విధంగా ఉంటుందో మరోసారి చర్చిద్దాం. ఇంకొంత deep analysis అనమాట..

సర్వేజన సుఖినోభవంతు.... హరి ఓం తత్ సత్

లలితా శ్రీహరి
9490942935
వేద సంస్కృత పరిషత్ వారి ఉపన్యాసధార సమావేశపు ఉపన్యాసానికి వ్రాతపత్రి
12/09/2021

Comments

  1. 07/06/1988 time 7 am before puttanu please tell me my horoscope narsimha.nalla@gmail.com

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: