వ్య‌క్తిత్వ మ‌నోవికాస గీత‌.


                                                  ◆ ◆ ◆ ◆ ◆
         ★★వ్య‌క్తిత్వ మ‌నోవికాస గీత‌.★★
◆ ◆ ◆ ◆ ◆      


కలియుగ భ‌గ‌వ‌ద్గీత‌ - నెటి ఆధునిక గీతాసారం 

ఆధునిక కాలంలో ప‌ద్మ‌వ్యూహంలాంటి జీవితం నుంచి అర్థంకాని స‌గ‌టు మాన‌వుడికి శ్రీభ‌గ‌వానుడు మాదిరి ఉప‌దేశ‌మే ఈ వ్య‌క్తిత్వ మ‌నోవికాస గీత‌. 

దాయాదులైన కౌరవ పాండవుల యుద్ధంలో కర్తవ్య విమూఢుడైన అర్జునుడికి జ్ఞానం బోధించి, కర్తవ్యంవైపు నడిపించిన శ్రీకృష్ణ‌భ‌గ‌వానుడి ఉప‌దేశం భ‌గ‌వ‌ద్గీత‌.

1. అర్జునుడు :- నిత్య జీవితంలో ఖాళీ సమయంలేదు ఎందుకు? 

శ్రీకృష్ణ‌భ‌గ‌వానుడు :- కార్యాచరణతో ప‌నిచేస్తే ఫ‌లితం ల‌భిస్తుంది. ప్రణాళికాబ‌ద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తే ఖాళీ స‌మ‌యం దొరుకుతుంది. 

2. అర్జునుడు:- జీవితం ఎందుకు ఇంత‌ సంక్లిష్టంగా మారింది?

శ్రీకృష్ణ‌భ‌గ‌వానుడు :- జీవితాన్ని విశ్లేషిస్తూ కూర్చుంటే సంక్లిష్టంగా మారుతుంది. జీవిస్తూ జీవితాన్ని ఆస్వాదించండి. వాస్త‌వానికి జీవితం చాలా స‌ర‌ళ‌మైన‌ది. దానిని మ‌న‌కి మ‌నం సంక్లిష్టం చేసుకుంటాం. 

3. అర్జునుడు :- మ‌న‌మంతా నిత్యం  సంతోషంగా ఉండ‌లేక‌పోతున్నామెందుకు?

:- ఈసురోమ‌ని మ‌నుషులుంటే దేశ‌మేగ‌తి బాగుప‌డునోయ్ అన్నారు గుర‌జాడ‌. 
శ్రీకృష్ణ‌భ‌గ‌వానుడు :-
రోజూ ఏడుస్తూ కూర్చుంటే సంతోషం ఎలా ల‌భిస్తుంది.

4. అర్జునుడు :- మంచివాళ్లే ఎప్పుడూ క‌ష్టాలు ఎందుకు ఎదుర్కొంటారు?

శ్రీకృష్ణ‌భ‌గ‌వానుడు :- కోయ‌కుండా వ‌జ్రం మెర‌వ‌దు. అగ్నిలో క‌ర‌గ‌క‌పోతే బంగారు ఆభ‌రణంగా మార‌దు. మంచివాళ్లు క‌ష్టాలెదుర్కొని..వాటిని ప‌రిష్క‌రించుకుని రాటుదేలి..వాటి నుంచి గుణ‌పాఠాలు నేర్చుకుంటారు. 

5. అర్జునుడు :- మంచివాళ్లు క‌ష్టాలు ఎదుర్కోవ‌డం మంచిదంటారా?

శ్రీకృష్ణ‌భ‌గ‌వానుడు :- ప్ర‌తీ క‌ఠిన‌మైన స‌మ‌స్య ఓ విలువైన పాఠం నేర్పే ఉపాధ్యాయుడిలాంటిది. పరీక్షని ఎదుర్కొంటే అదే గుణ‌పాఠంగా త‌రువాత ఉప‌యోగ‌ప‌డుతుంది. 

6. అర్జునుడు :- అనేక సమస్యల కారణంగా, దారి తెన్నూ తెలియ‌డంలేదు ఎలా? 

శ్రీకృష్ణ‌భ‌గ‌వానుడు :- కళ్లు దృష్టిని ఇస్తే... హృదయం మార్గం చూపుతుంది. మీ బ‌య‌ట చూడ‌టం కాదు..అంతః దృష్టితో చూడాలి ..స్ప‌ష్ట‌మైన మార్గం కనిపిస్తుంది.  

7. అర్జునుడు :- మ‌నం స‌రైన మార్గంలో వెళ్లినా, వైఫల్యం ఎదురై బాధిస్తే?

శ్రీకృష్ణ‌భ‌గ‌వానుడు :- ఇత‌రుల‌కు విజ‌యం కొల‌మానం. మ‌నకు సంతృప్తి మాత్ర‌మే కొల‌మానం.

8. అర్జునుడు :- కష్ట సమయాల్లో,  ప్రేరణ ఎలా పొందాలి?

శ్రీకృష్ణ‌భ‌గ‌వానుడు :- ఇంకా ఎంత దూరం వెళ్లాల‌నే ఆలోచ‌న మానేసి, ఇప్ప‌టివ‌ర‌కూ ఎంత దూరం వ‌చ్చారో గుర్తుచేసుకోవాలి. చేజార్చుకున్న వాటి గురించి బాధ‌ప‌డేకంటే, సాధించ‌న‌వి త‌లుచుకుని సంతోష‌ప‌డుతూ వుండాలి. 

9. అర్జునుడు :- వ్య‌క్తుల ప్ర‌వ‌ర్త‌న విభిన్నంగా ఎలా ఉంటుంది?
శ్రీకృష్ణ‌భ‌గ‌వానుడు :- క‌ష్టాలున్న‌ప్పుడు నాకే ఇవ‌న్నీ ఎందుకు అనుకుంటారు. వారు సంతోషంగా వున్న‌ప్పుడు త‌న వ‌ల్లే ఈ సంతోషం అని సంబ‌ర‌ప‌డ‌తారు. 

10. అర్జునుడు :- జీవిత‌ల‌క్ష్యాల‌ను చేరుకునే మార్గం ఏంటి?

శ్రీకృష్ణ‌భ‌గ‌వానుడు :- గ‌తం గురించి చింతించ‌కుండా, వర్తమానాన్ని ఆత్మవిశ్వాసంతో వ్య‌వ‌హ‌రించి, భవిష్యత్తు కోసం భయపడకుండా సిద్ధం కావ‌డ‌మే జీవిత ల‌క్ష్యాల‌ను చేరుకునే మార్గం. 

11. అర్జునుడు :- కొన్నిసార్లు నా ప్రార్థనలు ఫ‌లించ‌క‌పోవ‌డానికి కార‌ణం? 

శ్రీకృష్ణ‌భ‌గ‌వానుడు :- నాపై మీరు విశ్వాసం పెంపొందించుకుని భయాన్ని వీడాలి. జీవితం ఒక ర‌హ‌స్యం... పరిష్కరించడానికి అది సమస్య కాదు. ఎలా జీవించాలో తెలిస్తే జీవితం అద్భుతంగా ఉంటుంది.


Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: