మూలాది దుష్ట నక్షత్రాలు - అపవాదులు

మూలాది దుష్ట నక్షత్రాలు - అపవాదులు

శ్వశ్రూవినాశ మహిజౌ సుతరాం విధత్తః
కన్యాసుతే నిరృతిజౌ శ్వశురం హతశ్చ
జ్యేష్ఠా భజాత తనయా స్వధవాగ్రజంచ
శక్రాగ్ని జా భ్వతి దేవర నాశకర్త్రీ 
 - ముహూర్త చింతామణి.

మూలలో జన్మించిన కన్య, సుతుడు మామగార్కి దోషాన్ని కలిగిస్తాడు. ఆశ్లేష జన్మించిన కన్య, సుతుడు అత్తగారికి దోషాన్ని కలిగిస్తాడు.


జ్యేష్ఠా నక్షత్రంలో జన్మించిన స్త్రీ భర్త యొక్క అన్న గారికి దోషకారి అవుతుంది. విశాఖ నక్షత్రంలో జన్మించిన స్త్రీ భర్త యొక్క తమ్మునికి దోషకారి అవుతుంది.   

అపవాదులు
ద్వీశాద్యపాద త్రయజా కన్యా దేవర సౌఖ్యదా
మూలాంత్య పాద సార్పాద్య పాద జాతో తయోః శుభౌ - ముహూర్త చింతామణి.

విశాఖ 1, 2, 3 పాదాలలో జన్మించిన స్త్రీ మరిదికి మేలు చేస్తుంది. మూల చివరి పాదంలోను, ఆశ్లేష 1 వ పాదంలోను జన్మించిన స్త్రీ మామ గారికి అత్త గారికి శుభం చేస్తుంది. 

సుతః సుతావానియతం శ్వశురం హంతిమూలజః
తదంత్య పాదజోనైవ తధాశ్లేషాద్య పాదజః
వత్సరాత్పితరం హంతి మాతరం తు త్రివర్షతః
ద్యుమ్నం వర్షాద్వయేనైవ శ్వశురం నవ వర్షతః
జాతం బాలం వత్సరేణ వర్షైః పంచభిరగ్రజం
శ్యాలకం చాష్టభి ర్వర్షైః అనుక్తాన్ హంతి సప్తభిః
తస్మాచ్ఛాంతిం ప్రకుర్వీత ప్రయత్నా ద్విద్ధిపూర్వకం. – నారదుడు. 

ఈ వచనాలను అనుసరించి ఆయా గండ దోషాలకు పరిమితి ఉందని, శాంతి చేసుకుంటే ఆ దోషం ఉండదని స్పష్టమవుతుంది. 

తండ్రికి దోషం సంవత్సరం లోను, తల్లికి 3 సంవత్సరాలలోను, ధనానికి 2 సంవత్సరాలలోను, మామ గారికి 9 సంవత్సరాలలోను, బాలునికి 1 సంవత్సరాలలోను, అన్నకు 5 సంవత్సరాలలోను, బావమరిదికి 8 సంవత్సరాలలోను, ఇక్కడ వివరించని వ్యక్తులకు సంబందించిన దోషం 7 సంవత్సరాలలోను, కనిపిస్తుంది. అందువలన విధిని అనుసరించి శాంతి చేసుకోవాలి. 

నక్షత్ర శాంతి చేస్తే దోషముండదని దీని భావం. దీనిని బట్టి పూర్వకాలంలో బాల్య వివాహాలు జరిగే సమయంలో మూల, ఆశ్రేష నక్షత్ర దోషాలు ప్రధానంగా ఉండేవి అని జననాది 9 సంవత్సరాల కాల పరిమితి దాటిన తరువాత ఆ దోషం ఉండదని అర్ధం అవుతుంది. 

శాస్త్రంలో ప్రతి అంశానికీ దోషం గురించి ప్రస్తావించిన గ్రంథంలో దోష పరిహారములు ప్రస్తావించలేదు. 

విద్యా, వినయం, వివేకం, గుణం, సాంప్రదాయం, సంస్కారం, రూపం గల వదువులను కన్యలను కోడలిగా తెచ్చుకోవచ్చు.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: