గ్రహ గతులు:
*వక్రం* ప్రతి గ్రహం వాటి వాటి కక్ష్యలలో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. భూమి కూడా తన కక్ష్యలో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కాబట్టి వాస్తవంలో ఏ గ్రహానికి వక్రగతి గానీ ఇతర గతులుగాని ఉండవు. కాని భూమి మీద నున్న పరిశీలకుడు ఒక గ్రహాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఆ గ్రహం ముందుకు వెళ్లినట్లు, ఒక్కొక్కసారి వెనుకకు వెళ్లినట్లు, ఒక్కొక్కసారి కదలకుండా ఉన్నట్లు కనిపిస్తుంది. ఒక గ్రహం ముందుకు వెళ్లినట్లు కనిపించే స్థితినే *ఋజుగతి* అంటారు. ఒక గ్రహం వెనుకకు వెళ్లినట్లు కనిపించే స్థితినే *వక్రం* లేదా *వక్రగతి* అంటారు. ఒక గ్రహం వక్రగతిలో ఉన్నదంటే అది భూమి కంటే వెనుక ప్రయాణిస్తుందన్న మాట. ఇంకో విధంగా చెప్పాలంటే గ్రహం తానున్న రాశి నుండి గాని, నక్షత్ర పాదం నుండి వెనుకకు పోవటాన్ని *వక్రం* అంటారు.
*అతిచారం* గ్రహం వేగంగా ముందుకు వెళ్లినట్లు కనిపించే స్థితినే *అతిచారం* అంటారు. ఇంకోవిధంగా చెప్పాలంటే ఒక గ్రహం ఒక రాశిలో ఉండవలసిన కాలం కంటే ముందుగానే వేరొక రాశిలో ప్రవేశించడం. ఒక గ్రహం అతిచారంలో ఉన్నదంటే ఆ గ్రహం భూమి కన్నా ముందుకు వెళ్తున్నదన్నమాట.
*స్తంభన* : గ్రహం కదలకుండా ఉన్నట్లు కనిపించే స్థితినే *స్తంభన* అంటారు. *వక్రగతి* లో ఉన్న గ్రహం *అతిచారం* లోకి వెళ్లేముందు కొంతకాలం ఈ స్థితిలో ఉంటుంది. ఇంకో విధంగా చెప్పాలంటే ఒక గ్రహం ఒక రాశిలో తాను ఉండవలసిన సమయం కంటే ఎక్కువ కాలం ఉండటాన్ని *స్తంభన* అంటారు. ఒక గ్రహం స్తంభన స్థితిలో ఉంటే ఆ గ్రహం భూమితో పాటు ప్రయాణిస్తున్నదన్న మాట.
వివిధ గ్రహాల వక్రగతి స్తంభన సమయాలు వక్రంగా ఉన్నప్పుడు సూర్యుని నుండి దూరం (డిగ్రీలలో) తిరిగి ఋజుమార్గంలో వచ్చేటప్పుడు సూర్యుని నుండి దూరం (డిగ్రీలలో) చెబుతాను👉
బుధుడు వక్రగతి కాలం 24రోజులు. *వక్రగతి* ప్రారంభం అయ్యేటప్పుడు సూర్యుని నుండి దూరం డిగ్రీలలో. 14°- 20°. స్థిరంగా ఉండే కాలం 1రోజు. *ఋజుగతి* ప్రారంభం అయ్యేటప్పుడు సూర్యుని నుండి దూరం డిగ్రీలలో 17°- 20°.
: శుక్రుడు వక్రగతి కాలం 42 రోజులు. *వక్రగతి* ప్రారంభం అయ్యేటప్పుడు సూర్యుని నుండి దూరం డిగ్రీలలో29°. స్థిరంగా ఉండే కాలం 2రోజులు. *ఋజుగతి* ప్రారంభం అయ్యేటప్పుడు సూర్యుని నుండి దూరం డిగ్రీలలో 29°.
: కుజుడు వక్రగతి కాలం 80 రోజులు. *వక్రగతి* ప్రారంభం అయ్యేటప్పుడు సూర్యుని నుండి దూరం డిగ్రీలలో 228°. స్థిరంగా ఉండే కాలం 3రోజులు. *ఋజుగతి* ప్రారంభం అయ్యేటప్పుడు సూర్యుని నుండి దూరం డిగ్రీలలో 132°.
:గురువు వక్రగతి కాలం 120 రోజులు. *వక్రగతి* ప్రారంభం అయ్యేటప్పుడు సూర్యుని నుండి దూరం డిగ్రీలలో245°. స్థిరంగా ఉండే కాలం 3రోజులు. *ఋజుగతి* ప్రారంభం అయ్యేటప్పుడు సూర్యుని నుండి దూరం డిగ్రీలలో 115°.
: శని వక్రగతి కాలం 140 రోజులు . *వక్రగతి* ప్రారంభం అయ్యేటప్పుడు సూర్యుని నుండి దూరం డిగ్రీలలో251°. స్థిరంగా ఉండే కాలం 3రోజులు. *ఋజుగతి* ప్రారంభం అయ్యేటప్పుడు సూర్యుని నుండి దూరం డిగ్రీలలో 109°.
రవి చంద్రులకు వక్రగతి ఉండదు, రాహుకేతువులకు వక్రగతియే ఋజుగతి.
Comments
Post a Comment