పిశాచ గ్రస్త యోగం

పిశాచ గ్రస్త యోగం

వ్యక్తి పిచ్చివాడు కావటానికి లగ్నాత్తు పంచమంలో చంద్ర కేతు లేదా చంద్ర రాహుల కలయిక కారణం కాగలదు. వాటిపై కౄరగ్రహసంబంధం పిచ్చి/మతిభ్రమణాన్ని ఖాయం చేస్తుంది.

మతిభ్రమణం/పిచ్చి రావటానికి కేతువు ప్రథాన గ్రహం.

తేలికపాటి స్థాయిలో పిచ్చిలక్షణాలు ఉన్న వ్యక్తికి ఉలవల సంబంధమైన ఆహారం పెట్టరు. ఒకవేళ పెడితే పిచ్చి లక్షణాలు ఎక్కువ అవుతాయి. అలాగే తేలికపాటి పిచ్చిలక్షణాలు ఉన్నా, ఒకసారి పిచ్చి వచ్చి తగ్గిన వ్యక్తి ఉలవ చేలలోకి పోకూడదు. అలా వెళ్ళకుండా సమీపవ్యక్తులు జాగ్రత్తపడతారు. ఒకవేళ అటువంటి వ్యక్తులు ఉలవ చేలలోకి వెళ్ళినట్లైతే పిచ్చి తిరగబెడుతుంది.


ఇక్కడ గమనించదగిన విషయమేమంటే..... పిచ్చికి కేతువు కారకుడు. పిచ్చి అనేది మనస్సుకు సంబంధించిన అంశం.
అందువలన పిచ్చి విషయంలో కేతువు చంద్రులను ప్రథానగ్రహాలుగా తీసుటకోవలసి ఉంటుంది.
......

కానీ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. పరమహంస రామకృష్ణ గారి పిచ్చి చేష్టలకి (సామాన్య మానవులకు అర్థం కాని రీతిలో, ఒక సైంటిస్ట్ అయినా సరే, వారి పిచ్చికి....... పిచ్చాసుపత్రిలో ఉన్నటువంటి వారి పిచ్చికి తేడాలు ఉంటాయి కదా...) సామాన్యులు యొక్క పిచ్చి చేస్ట లకి తేడా ఉంటుంది కదా.

 ‌. కేతువు బైరాగులు లో ఉన్న పిచ్చి చేష్టలకు కారకుడు.

. తీవ్ర బుద్ధిమతి యోగములు, బుద్ధిమాంద్య యోగానికి పర్యవసానం పిచ్చే.
......


లగ్నంలో గురువు సప్తమంలో కుజుడు లేదా అటు ఇటు గా ఉన్న ఏడో బావంలో ఆ విధంగా ఉంటే వివాహ జీవితం దెబ్బతిని మానసిక సమస్యకు కారణం అవుతుంది.

కుజుడు బదులుగా శని ఉన్నా డిప్రెషన్ దుఃఖం విచారానికి కారకుడు దాని వల్ల కూడా మానసిక సమస్య వస్తుంది.

లగ్నంలో శని కుజుడు 5 లో లేదా 7 ,9 లో ఉన్నా,
లగ్నంలో శని రవి 12 లో కుజుడు, చంద్రుడు కోణం లో ఉన్నా,
శని క్షీణ చంద్రుడుతో కలిసి  12 లో ఉన్నా,
శని చంద్రుడు నెగిటివ్ థింకింగ్ 12వ స్థానం పాప స్థానం,
శని రెండవ భావాధిపతి రవి కుజుల తో యుతి ఉన్నా,
శని లేదా కుజ హోరలో జన్మించినా,
రవి చంద్రుల యుతి లగ్నంలో లేదా 5, 9 లో ఉండి గురువు కోణంలో ఉన్నా,
మాది గ్రహం ఏడులో ఉండి పాప గ్రహాల వల్ల వేద పొందినా,
మాది గ్రహం వేద పొంది 5 లో ఉన్నా,
రాహువు, చంద్రుడు లగ్నంలో ఉండి పాప గ్రహాలు కోణాల్లో ఉన్నా పిశాచ గ్రస్త యోగం అంటారు. యోగం ఫోబియాను సూచిస్తుంది.
చంద్రుని పై కేతు ప్రభావం ఉంటే మానసిక వైరాగ్యం, తీక్షణమైన విచారం, ఆత్మహత్య చేసుకునే లక్షణం, ఎదుటివారిని అనుమానించటం మొదలగు లక్షణాలు ఉంటాయి.

బుధ గురువులు బలహీనపడడం లేదా పాప గ్రహ ప్రభావం వల్ల వ్యక్తికి అసాధారణ లేదా విపరీత ప్రవర్తన కలుగుతుంది.

మానసిక సమస్యలు యోగాలు జాతక తత్వం నుంచి తీసుకున్నది

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: