లగ్నం కొన్ని విశేషాలు.

లగ్నం కొన్ని విశేషాలు.

లగ్నం నుండి 1,5,9 కోణస్థానములు. 5, 9 స్థానములను త్రికోణ స్థానములని అంటాము.

లగ్నం నుండి 1, 4, 7, 10 స్థానములు కేంద్ర స్థానములు. వీటిని కంటక స్థానములు, చతుష్టయములు అంటారు. కేంద్రములో ఉన్న గ్రహములు బలమైనవి.

లగ్నంలో ఉన్న గ్రహం కంటే, 4 వ స్థానంలో ఉన్న గ్రహం బలమైనది. 4 స్థానంలో ఉన్న గ్రహం కంటే 7 వ స్థానంలో ఉన్న గ్రహం బలమైంది. 7 వ స్థానంలో ఉన్న గ్రహం కంటే 10 వ స్థానంలో ఉన్న గ్రహం బలమైంది.

చంద్రుడి నుండి 3, 6, 10, 11 స్థానాలు ఉపజయ స్థానాలు.

1,2,4,5,7,8,9,12 స్థానములు అనుపజయ స్థానములు. లగ్నము కంటే పంచమ స్థానం పంచమ స్థానం కంటే నవమ స్థానం బలమైనది.

2, 5, 8, 11 స్థానములు పణపర స్థానములు. ఇవి పూర్వ జన్మలో చేసిన పుణ్యకార్యములు తెలియజేస్తాయి. 3, 6, 9, 12 స్థానములు అపోక్లిమ స్థానములు. ఇవి విచక్షణ, హేతు బుద్ధిని తెలియజేస్తుంది.

6, 8, 12 స్థానములు మరుగు స్థానములు దుస్థానములు. 3, 6, 12 స్థానాధిపతులు త్రిషడాయన స్థానములు అంటారు. వీటి
అధిపతులు శుభగ్రహాలే అయినా అశుభమే చేస్తారు.


1, 2, 4, 5, 7, 9, 10, 11 శుభ స్థానములు. ఈ స్థానములో ఉన్న గ్రహాలు శుభఫలితాలు ఇస్తాడు. ఈ స్థానాధి పతులు శుభం కలిగిస్తారు.

2, 7, 11 స్థానములు మారక స్థానములు.

3, 6, 8, 12 స్థానములు పాప స్థానములు. ఈ స్థానములో ఉన్న గ్రహములు గ్రహాధిపతులు శుభాన్ని కలిగిస్తారు. ఉపజయ స్థానములో ఉన్న పాపగ్రహములు కూడా శుభఫలితాలు ఇస్తాయి.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: