తల విలువ నోరు చెబుతుంది.

తల విలువ నోరు చెబుతుంది. 

పూర్వం ఒక దేశ మహారాజ, తన మంత్రిగారి తో, భటుడితో అరణ్యంలోకి వెళ్ళాడు వేటకోసము. 

కొంత సమయానికి రాజుగారికి దాహం వేసి త్రాగే నీరు కావాల్సి వచ్చింది. వెంటనే భటుడిని పంపాడు.

 కొంచం దూరంలో ఒక కళ్ళు లేని అంధ ముని తప్పస్సు చేసుకొంటున్నారు. ఈ భటుడు, "ఇక్కడ మంచి నీళ్ళు ఎక్కడ ఉన్నాయిరా" అని అడిగాడు, "ఆ పక్కన ఉన్నాయి పోరా" అన్నాడు ముని.

 భటుడు నీళ్లు తీసుకొని రాని కారణంగా మంత్రి గారు వెళ్లారు. మంత్రి గారు, "ఓ ముని ఇక్కడ నీటి ఏర్పాటు లేదా" అని అడిగితే, "ఆ పక్కన ఏర్పాటు చేశారు" అని సమాధానం వచ్చింది. 

అలస్య కారణంగా, విపరీత దాహ కారణంగా రాజుగారు స్వయంగా ముని దగ్గరకు వచ్చి "మహాత్మా ఇక్కడ త్రాగే నీరు ఉందా" అని అడిగేతే, ముని లేచి నుంచొని నమస్కారం చేసి "మహారాజ నీటి కోసం మీరే రావాలా" అని అడిగాడు.
ఇంతకు ముందు ఇద్దరు వచ్చారుగా, నేనె మహారాజుని అని ఎలా తెలిసింది అని రాజు అడిగితే ముని, "తల విలువ నోరు చెబుతుంది" అని అన్నాడు.

కొంత మంది ఎదుటివారు తమకంటే తక్కువ వారు అని "గదమాయించి" మాట్లాడుతారు.

 ఇంకొంతమంది వారి అధికారాన్ని గుర్తు చేసుకొంటూ "దర్పంగా" మాట్లాడుతారు.

మరికొందరు ఎదుట వారికి విలువ ఇచ్చి ప్రేమగా మాట్లాడుతూ తిరిగి ప్రేమని పొందుతూ తమ విలువ కాపాడుకొంటారు.

శ్రీ విష్ణు సహస్ర నామములలో కొన్ని నామాలు ఇలా వస్తాయి.
1) ఆమాని=తన మర్యాద గురించి పట్టించుకోని వాడు
2) మాన్యదో=ఇతరులకి మర్యాద ఇవ్వడంలో ఏ మాత్రం అశ్రద్ధ చేయని వాడు.
3) మాన్య=మర్యాద పొందే వాడు.
అంటే భగవానుడు, ఇతరులు ఇచ్చే మర్యాద పట్టించుకోకుండా, ఇతరులకి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వడం వలస తాను ఇతరులచే మర్యాద పొందుతున్నాడు.
4) లోకస్వామి=అందువల్ల లోకానికి స్వామీ అయ్యాడు.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: