దేవునికి తాంబూలం సమర్పించి వేడుకుంటే..

ఏ రాశి వారు ఏ దేవునికి తాంబూలం స‌మ‌ర్పించాలి? 

ఈతిబాధలతో స‌త‌మ‌త‌మ‌య్యేవారు ఏం చేయాలి? ఏ దేవున్ని ప్రార్థించాలి? ఈతిబాధలు తొలిగిపోవాలంటే ఎలాంటి ప‌రిహారం చేసుకోవాల‌ని అడుగుతుంటారు చాలా మంది. అయితే 12 రాశుల్లో జన్మించిన జాతకులు ఏ దేవతలకు తాంబూలం సమర్పించి ప్రార్థించాలో తెలుసుకోవాలి.

12 రాశుల్లో పుట్టిన జాతకులు రాశి ప్రకారం ఏ దేవునికి తాంబూలం సమర్పించి వేడుకుంటే.. ఈతిబాధలు తొలగిపోతాయనేది తెలుసుకుందాం..   
 

🪐మేష రాశి వారు.. తాంబూలంలో మామిడి పండును ఉంచి మంగళవారంలో కుమారస్వామిని ప్రార్థిస్తే ఈతిబాధలు తొల‌గిపోతాయి. 

🪐 వృషభ రాశి వారు తమలపాకులో మిరియాలు ఉంచి మంగళవారం పూట రాహువును స్తుతిస్తే.. కష్టాలుండవు. సుఖసంతోషాలు చేకూరుతాయి. 

 🪐 మిథున రాశి వారు తమలపాకులో అరటిపండును ఉంచి బుధవారం ఇష్టదేవతా పూజ చేస్తే.. అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి.
 
🪐 కర్కాటక రాశి వారు.. తమలపాకులో దానిమ్మను ఉంచి శుక్రవారం పూట కాళిమాతను ప్రార్థిస్తే కష్టాలు తీరిపోతాయి. 

🪐 సింహ రాశి వారు.. తమలపాకులో అరటిపండును ఉంచి గురువారం ఇష్టదేవతా పూజను చేయాలి. అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి.

🪐 కన్యారాశి రాశి వారు.. తమలపాకులో మిరియాలు ఉంచి గురువారం ఇష్టదేవతా పూజ చేస్తే.. దుఃఖం దూరమవుతుంది. 

🪐 తులా రాశి రాశి వారు.. తమలపాకులో లవంగమును ఉంచి శుక్రవారం పూట ఇష్టదేవతను స్తుతిస్తే.. అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి.
 
🪐 వృశ్చిక రాశి వారు.. తమలపాకులో ఖర్జూర పండును ఉంచి మంగళవారం పూట ఇష్టదేవతను పూజిస్తే ఈతిబాధలు తొలగిపోతాయి. 

🪐 ధనుస్సు రాశి వారు.. తమలపాకులో కలకండను ఉంచి గురువారం పూట ఇష్టదేవతను పూజించినట్లైతే సుఖసంతోషాలు చేకూరుతాయి.

🪐 మకర రాశి వారు.. తమలపాకులో బెల్లమును ఉంచి శనివారాల్లో కాళిమాతను పూజిస్తే.. కష్టాలు తీరిపోతాయి. 

🪐 కుంభ రాశి వారు.. తమలపాకులో నెయ్యిని ఉంచి శనివారం పూట కాళిమాతను పూజించినట్లైతే.. దుఃఖాలు తొలగిపోతాయి. 
 
🪐 మీన రాశి వారు.. తమలపాకులో పంచదారను ఉంచి ఆదివారం ఇష్టదేవతను పూజించినట్లైతే సుఖసంతోషాలు చేకూరుతాయి.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: