మాస శివరాత్రి - మాసశివరాత్రి ఎందుకు జరుపుకోవాలి???


    🌗 మాస శివరాత్రి - మాసశివరాత్రి ఎందుకు జరుపుకోవాలి??? 🌗

వేదాలు ఇతిహాస పురాణాలలో ముఖ్యమైనవి...
ఋగ్వేదం చాలా గొప్పది, ఇందులో ఉన్నటువంటి రుద్రం ఇంకా గొప్పది...
పంచాక్షరీలోని శివ అనే రెండక్షరాలు మరీ గొప్పవి...
శివ అంటే మంగళమని అర్థం...
పరమ మంగళకరమైనది శివస్వరూపం...
ఆ పరమ శివుని అనుగ్రహం పొందటానికి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి...
పురాణాలలో చెప్పినటువంటి ఈ మహాశివరాత్రిని ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్థశినాడు జరుపుకుంటాం...

శివరాత్రులు ఎన్ని?
శివరాత్రి వైదిక కాలం నాటి పండుగ, ఏడాదిలో వచ్చే శివరాత్రులు మొత్తం అయిదు...

అవి : - - - -
నిత్య శివరాత్రి,
పక్షశివరాత్రి,
మాసశివరాత్రి,
మహాశివరాత్రి,
యోగశివరాత్రి...
వీటిలో పరమేశ్వరుడి పర్వదినం మహాశివరాత్రి, మార్గశిరమాసంలో బహుళ చతుర్థి, అర్ద్ర నక్షత్రం రోజున శివుడు లింగోద్భవం జరిగింది.
శివునికి అతి ఇష్టమైన తిథి ఇది, అందుకే ఈరోజున శివుణ్ణి లింగాత్మకంగా ఆరాధించిన వారెవరైనా సరైన పురుషోత్తముడు అవుతాడని పురాణాల మాట.
ఈ రోజున శివ ప్రతిష్ట చేసినా లేక శివకళ్యాణం చేసినా ఎంతో శ్రేష్టం, మహాశివరాత్రి రోజు తనను పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టులవుతారని శివుడు చెప్పడాన్ని బట్టి ఈ విశిష్టత ఏంటో అర్థం చేసుకోవచ్చు...

త్రయోదశినాడు ఒంటిపొద్దు ఉండి చతుర్థశినాడు ఉపవాసం ఉండాలి....
అష్టమి సోమవారంతో కూడి వచ్చే కృష్ణ చతుర్థశి నాటి మహాశివరాత్రి మరింత శ్రేష్టమైందంటారు...

లింగోద్భవ కాలం ప్రకారం జన్మాష్టమి నుంచి 180 రోజులు లెక్కిస్తే శివ రాత్రి వస్తుంది...
రూపరహితుడైన శివుడు, జ్యోతిరూపంలో, లింగాకారంగా అవిర్భవించిన సమయం కనుక శివరాత్రిని లింగోద్భవకాలం అంటారు...
ఈ పరమేశ్వరుడి 64 స్వరూపాలలో లింగోద్భవమూర్తి చాలా ముఖ్యమైనది.
అర్థరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ సమయమని పురాణాలలో చెప్పారు.
ఋగ్వేదం ప్రకారం భక్తజనులు ఆరోజు నిద్ర పోకుండా మేల్కొని ఉపవాసముండి, మహాలింగ దర్శనం చేస్తారు.
ఉపవాస దీక్ష స్త్రీలు, పురుషులు కూడా ఆచరించదగినదే, ప్రపంచమంతా శివ శక్తిమయమని తెలుసుకోవాలి.
శివలింగానికి ప్రణవానికి సామ్యముందంటారు...
ఆ పంధాలో చూస్తే ఈ శివలింగం ఆరువిధాలు ఇలా ఒక్కొక్క విధానంలో ఆరేసి లింగాలు ద్వివిదా ద్వాదశలింగాలుగా చెప్పబడుతున్నప్పటికీ, శివాగమాలరీత్యా మాత్రం ఆచార గర్వాది లింగాలే సరియైనవి కనుక ఈ ఆరులింగాలనే అనుదినం ఆరాధించాలి.
ప్రతినెలలో వచ్చే మాసశివరాత్రి జరుపుకుని, మహాశివరాత్రి జరుపుకుంటేనే శ్రేష్టం అని పురాణాల ప్రకారం తెలుస్తుంది, కాబట్టి మాసశివరాత్రి కి ఇంతటి విశిష్టత...

🍃శుభమస్తు🍃

         🙏🙏

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: