నాడీ రాశ్యాధివివరములు*

*నాడీ రాశ్యాధివివరములు*

 శ్లో:- నాడీరాశి తదీశయోనివనితా దీర్ఘా గణశ్చాపిష
        డ్వర్గా ముఖ్యతరా వివాహసమయే శేషాస్తుమథ్యాస్తతః
        మహేంద్రో గణితాయవశ్యదివసావర్ణోడువిద్థాండజా
        రజ్జుర్యోగినిలింగభూతశశియుగ్గోత్రాహ్వయా వింశతిః
*తాత్పర్యము*:- వివాహ విషయములో నాడీకూటము, రాశి, వర, గ్రహ, మిత్రత్వ, యోని, స్త్రీ దీర్ఘవర్గులు విశేషప్రభావములుగలయవి. వాటిని జాగ్రత్తగా పరిశీలించవలయును. మహేంద్ర గణిత వర్గులు, ఆయనదినవర్గులు, జాతివేధకూటములు, పక్షి, రజ్జు కూటములు, యోగిని, లింగ, భూకూటములు, చంద్రయోగ కూటములు, గోత్రవర్గములు మధ్యమములు. ఇంకను పరిశీలించవలసినవి ముందు చెప్పబడుచున్నవి.

 శ్లో:- యాతస్యాస్తు కరగ్రహే యది చతుస్త్రిద్వ్యం ఘ్రిథిష్ణోద్థితా
        దస్రర్షాత్త్రిషు వహ్ని భాద్యది చతుర్ష్వేవేంధుభాత్పంచసు
       నాడీపర్వసు తత్క్రమాచ్చ గణనాభిన్నాంగుళిస్థాశుభా
       నాడిశుద్ధిరిహైవ భాగ్యజననీ మాంగళ్యసూత్రంతుసా
*తాత్పర్యము*:- 4 పాదములుగల నక్షత్ర నందు పుట్టిన స్త్రీకి అశ్వని మొదలు 3 వ్రేళ్ళయందున, త్రిపాద నక్షత్రములందైన కృత్తిక, పునర్వసు, ఉత్తర, విశాఖ, ఉత్తరాషాడ, పూర్వాభాద్రలందు పుట్టిన స్త్రీకి కృత్తికాది 4 వ్రేళ్ళయందును, ద్విపాద నక్షత్రములందు మృగశిరా,చిత్త, ధనిష్ఠలయందు పుట్టిన స్త్రీకి మృగశిర మొదలు వ్రేళ్ళయందు లెక్కించగా వధూవరుల జన్మనక్షత్రములు ఒకే వ్రేలి యందుగాక, భిన్నములైన వ్రేళ్ళయందు పడినచో శుభమగును. వరునకు, ఆయువు వధువుకు సౌభాగ్యమునూ కాగలదు.
 శ్లో:- త్రీణి త్రీణ్యధదస్రభాది గణయే ద్భావక్రమాద్యుత్క్రమా
        ద్దంపత్యోరపి జన్మభే శుభఫలేభిన్నాంగుళిస్థే యది
        పార్శ్వైకాంగుళిసంస్థితం యది వధూహంత్యేవధిష్ణ్యద్వయం
        తన్మధ్యాంగుళి సంస్థియదిపతిం హంత్యేపాణిగ్రహే
*తాత్పర్యము*:- అశ్వని మొదలు 3, 3 నక్షత్రములు 3 వ్రేళ్లయందు క్రమవ్యుత్క్రమములందు లెక్కింప వధూవరుల నక్షత్రములు వేర్వేరు వ్రేళ్లయందైన శుభము. ప్రక్క వ్రేళ్ల మీదనైన వధువును, నడిమివ్రేలియందైన వరునిచంపును.
 శ్లో:- పర్యాయై స్త్రితయైర్యది వ్యవహితం స్తీభంచ పుంభంద్వయం
        పార్శైకాంగుళిసంస్థితం యది తదా తద్రాశికూటేశుభే
        సద్రజ్జౌ వరయోర్నియోగసమయే ప్యేకాధీపత్యే ద్వయో
        ర్మైత్రే కేచిదధైక నాడిజనితో దోషస్తునే త్యూచిరే
*తాత్పర్యము*:- 3 మార్లు పై రీతిగా లెక్కించిన పిమ్మట నొక వ్రేలిమీదనున్నను, వధూవరుల రాశి, రజ్జుకూటములు శుభములైనను, యిద్దరి జన్మలగ్నాధిపులు యొక్కటైనను జన్మలగ్నాధిపులు మిత్రులైనను మంచిది. అట్టి ఈ వ్రేలిపై గణించు నక్షత్రదోషము ఆ దంపతుల నంటజాలదని కొందరు చెప్పుదురు.
 శ్లో:- ఇంద్రాగ్నీ వసుమిత్రపూషశవితృస్వాతీశివాజై కపా
        ద్భే ష్వేవాష్టసు దంపతీజననభే ద్వేహ్యైకథిష్ణ్యే శుభే
        అంత్యొపాంత్యవిధిఅద్విదైవ గిరిశ శ్రీశార్యపిత్ర్యేషువా
        నానాపాదజయోర్యమేందు వరుణబ్రధ్నాప్యసార్పేషువా
*తాత్పర్యము*:- భరణి, రోహిణి, మృగశిర, పుష్యమి, ఆశ్లేష, మఘ, స్వాతి, అనురాధ, పూర్వాషాడ, పూర్వాభాద్ర, శ్రవణం, ధనిష్ఠ, శతభిషా నక్షత్రములు వేర్వేరు పాదములందుగాని, ఆరుద్ర, విశాఖ, హస్త, రేవతి, నక్షత్రములు సమభిన్న పాదములందుగాని వధూవరులు జన్మించిన పై దోషములు లేవు.
 శ్లో:- జ్ఞేయాన్యం ఘ్రిచతుష్టయాని సకలా న్యృక్షాణి దస్రాదితో
        ప్యేకైకస్యనవాంఘ్రికం ప్రతిగృహం జ్ఞేయంచ మేషాదితః
        రాశ్యాంతం గణయే ద్వరస్యతు సదా స్త్రీజన్మరాశ్యాదితః
        ప్రోక్తాదోషనిరూపణే ప్రథమతో మేషాదిరాశీశ్వరాః
*తాత్పర్యము*:- ఒక్కొక్క నక్షత్రమునకు 4 పాదములుండును. అట్టి పాదములు 9 ఇది కలిసినచో ఒక రాశియగును. రాశి కూటాదులను చూచునప్పుడు వధువు జన్మరాశితో మొదలిడి వరుని జన్మరాశి వరకు లెక్కించవలెను.
 శ్లో:- దంపత్యోస్సమసప్తమౌచ సుతదౌతా వేకరాశిస్థయో
        ర్ముఖ్యౌతౌ త్రిభవౌ చతుర్థదశమౌ దత్వ్యయౌవాశుభౌ
        ఉద్వాహే నవ పంచమౌత్వ శుభదౌతద్వ్యత్యయౌవాశుభౌ
        మిత్రత్వే గ్రహ యోరిమావపి శుభా వేకాధిపత్యేపివా
*తాత్పర్యము*:- కన్యయొక్క రాశి నుండి వరుని రాశిని గణింపగా సమసప్తకము (7-7) అయినచో అది పుత్రప్రదమగును. ఇరువురి రాశులూ ఒకటే అయినచో శుభప్రదమని తెలియవలెను.
5-9 రాశులుగానున్ననూ శుభమగును. 9-5గా గాని 3-11 తృతీయ యేకాదశములుగాగాని,చతుర్ధశములు (4-10)గాగాని అది అశుభము. వధూవరులయొక్క రాశ్యాధిపతులు మిత్రత్వము కలవారైనా, ఏకమైనా 9-5 రాశులుగా వచ్చినప్పటికినీ దోషమంటదని ఎరుంగవలెను.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: