అపర ఏకాదశి*

*అపర ఏకాదశి*
🙏🙏✅️✅️🙏🙏🙏🙏🙏🙏
*26-05-2022*

బ్రహ్మాండ పురాణంలోనీ శ్రీకృష్ణ - యుధిష్ఠిర సంవాదము:

యుధిష్టర మహారాజు శ్రీకృష్ణుని ఇట్లు అడిగెను. 

ఓ కృష్ణా ! వైశాఖ మాసములో బహుళ ఏకాదశి వ్రతమునకు ఏమి పేరు, దీని మాహాత్మ్యము ఎట్టిది? నాకు చెప్పమ'న్న శ్రీకృష్ణుడు ఇట్లు చెప్పెను.

 ఓ మహారాజా! అందరి క్షేమముకొరకై మీరు ఈ మంచి ప్రశ్నడిగితిరి. కావున నేను దానికి సమాధానము తప్పక చెప్పెదెను. వినుము. ఈ ఏకాదశి బహుపుణ్యదాయని, మహాపాతకనాశిని, అనంత ఫలప్రదాయని. దీనిని "అపర" ఏకాదశి అందురు. 

ఈ వ్రతమును ఆచరించినవారు మిక్కిలి కీర్తి పొందుగలరు. స్త్రీహత్యా, గోహత్య, పరనిందకులు ఇవియేకాక పరస్త్రీలతో దుష్కర్మలు చేసినవారు కూడ పాపరహితులగుదురు. వంచకుడు, కపటుడు, అబద్ధములు పలుకువాడు ఈ ఏకాదశిని ఆచరించి ముక్తి పొందుదురు. 

ఓ రాజా! ఒకానొకప్పుడు శిష్యుడు గురువుగారి అనుగ్రహముచే బ్రహ్మవిద్య పొందిన పిమ్మట ఆ గురువుగారిని నిందించి దుర్గతి కలిగినవాడు కూడ ఈ 'అపర' ఏకాదశీ వ్రతాచరణము చేసి నిష్పాపులగుదురు.

సూర్యభగవానుడు మకరరాశియందున్న సమయమున మాఘమాసములో ప్రయాగ తీర్థములకు వెళ్లి ఆనదులలో స్నానము చేసినచో ఎటువంటి పుణ్యము కలుగునో అట్టి ఫలితము ఏ వ్రతాచరణ వలన లభించును. 

అంతేకాక గయ తీర్థములో శ్రీవిష్ణు పాదపద్మమున పిండదానము వలనను, బృహస్పతి సింహరాశి యందున్న సమయమున గౌతమి గోదావరి నదులలో స్నాన పుణ్య ఫలములకు సమాన ఫలితము ఈ ఏకాదశి ఆచరణవలన కలుగును.

 కైలాసములో కేదార నాథుని దర్శనము చేసిన ఏమి ఫలితములు లభించునో, సూర్యగ్రహణము సమయములో కురుక్షేత్రములో స్నానము, వస్త్రదానము, గోదానము, ఏనుగుదానము, అశ్వ దానము, ధనదానము మరియు భూదానములు చేసిన ఎట్టి ఫలితములు లభించునో కేవలము ఈ అపర ఏకాదశీ వ్రతము చేసినవారు చాలా సహజముగా అట్టి ఫలితములు పొందుదురు. 

ఈ వ్రత దినములో శ్రీ మహావిష్ణువుని పూజ చేయుటచే విష్ణులోకమునకు వెళ్ళగలరు.

ఈ వ్రతము పాపమనే చెట్టుని నరకు మంచి కత్తివంటిది. పాపరూప మహాంధకారమును ఒక మహాజ్యోతిర్మయ సూర్యుడు మరియు పాపరూప మాయామృగిని వధించు మహాకాల స్వరూపమైన మదించిన సింహములాంటిది.

 ఈ అపర ఏకాదశిని శ్రీకృష్ణుడు యుధిష్ఠిర మహారాజుతో, సర్వలోక మంగళము కొరకై అపూర్వమైన 'అపర ఏకాదశి' మాహాత్మ్యము గురించి చెప్పిరి.

 ఈ కథను యథాప్రకారముగా పఠించిన వారికి సమస్త పాపములు నశించి విష్ణులోకము పొందుటకు అవకాశము కలుగును.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: