తల్లి గౌరవము అధికమని చెప్పబడినది.
ఉపాధ్యాయాన్ దశా చార్యః
ఆచార్యాణం శతం పితా
సహస్రంతు పితుర్మాతా
గౌరవేణా తిరిచ్యతి
అర్థము:--- పది మంది ఉపాధ్యాయుల కంటే ఒక ఆచార్యుడు అధికుడు..నూరు మంది ఆచార్యుల కంటే ఒక తండ్రి అధికుడు. నూరు మంది తండ్రుల కంటే ఒక తల్లి గౌరవము అధికమని చెప్పబడినది.
అన్నదానాత్పరం దానం
విద్యా దానమతః పరం
అన్నైన క్షణికా తృప్తిః
యావజ్జీవంచ విద్యయా
అర్థము:--అన్నదానం గొప్పదే కానీ అంతకంటే గొప్పది విద్యాదానం. అన్నదానము చేసిన తిన్నవాడికి క్షణిక మైన తృప్తియె కలుగును. కానీ విద్యా దానము వల్ల అజ్ఞానమనే చీకటి విడిపోయి జీవిత మంతయు సుఖ
శాంతులు లభిస్తాయి కదా!
గురువులారా! దయచేసి జనుల సరియైన జ్ఞానమును ప్రసాదించండి.
విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం
విద్యా భోగకరీ యశసుఖకరీ విద్యా గురూణాం గురుః
విద్యా బంధు జనో విదేశ గమనే విద్యా పరం లోచనం
విద్యా రాజసుపూజ్యతే నహిధనం విద్యా హీనఃపశుః :(భర్తృహరి సుభాషితము)
అర్థము: మానవులకు విద్యయేఎక్కువ సౌందర్యము నిచ్చునది. అదియే గుప్త ధనము. చదువే కీర్తిని, సుఖమును, భోగమును కలిగించును. విద్యయే గురువులకు గురువైనది
విదేశములకు పోయినప్పుడు విద్యయే బంధువు. అదియే మరియొక కన్ను వంటిది.
రాజ సభలలో పూజార్హత విద్యకే గానీ ధనమునకు కాదు. ఇటువంటి విద్య లేని నరుడు వింత పశువుగా పిలువ పడుతాడు.
Comments
Post a Comment