గురువునకు అగ్రస్థానమీయబడినది.

గురువే సర్వలోకానాం
 భిషజే భవరోగిణాం
 నిధయే సర్వవిద్యానాం
 దక్షిణామూర్తయే నమఃహ్మ్

మన భారతీయ ధర్మశాస్త్రాలలో గురువునకు అగ్రస్థానమీయబడినది. గురువే కనక లేకపోతే ఏ ధర్మమూ లేదు. ఏ సుఖము, ఆనందములూ లేవు. ఏ ధర్మానికైనా, ఏ సుఖానికైనా మూలం గురువే. ఆయన ఇది ధర్మం, దీన్ని ఆచరించాలి... ఇది అధర్మం, దీనిని ఆచరించకూడదు అని బోధించకపోతే మనకు ఎలా తెలుస్తుంది. అంధకార నిరోధకుడు కనుక ఆయనను గురువన్నారు- అని గురు శబ్ద నిర్వచనాన్ని చెప్పారు. 

అంధకారమంటే సంసారమే. దేనివలన జీవుడు దుఃఖాన్ని అనుభవిస్తున్నాడో దానిని అంధకారం అంటారు. జీవుడు సంసారం వల్ల దుఃఖాన్ని అనుభవించడం వల్ల దీనిని తొలగించి ఆనందాన్నందించేవాడు అని ‘గురు’ అనే పదానికి అర్థం. గురువు ఉద్ధరించేవాడై ఉండాలి. శిష్యుడు ఉద్ధరింపబడేవాడై ఉండాలి. శిష్యుణ్ణి గురువు ఉద్ధరిస్తాడు. అతడు నిర్లిప్తుడు, పరిపూర్ణుడు ఆత్మారాముడు. ఒకవేళ గురువు కూడా దుఃఖ సంసారియైయున్నాడు అంటే శిష్యుణ్ణి ఎలా ఉద్ధరించగలడు.

 ‘‘అంధెనైవనీయమా నాయథాంధాః’’

 అంటుంది ఉపనిషత్తు. ఒక అంధుడు ఇంకొక అంధుడిని తీసుకువెళ్ళినట్టు అని దీని అర్థము. ఒక మార్గాన అంధుడు వెళుతుంటే అంధుడు కాని వాడు అంధుడిని తీసుకువెళ్లగలడు. ఇద్దరూ అంధులే అయ్యారంటే ఇద్దరూ దుఃఖాన్ని అనుభవించవలసిందే. 

 ‘‘కృతార్థోహినామ ఆచార్యాభవతి’’

 అని శంకరులు వారి భాష్యమున గురువు కృతార్థుడైయుండాలి అని, శిష్యుడు అకృతార్థుడైనందున వానిని ఉద్ధరించగలడు అన్నారు. శిష్యునిపైన వాత్సల్యముండే గురువు దొరకడం చాలా దుర్లభం. శిష్యవాత్సల్యముండే గురువు శిష్యునికీ దొరకడమూ కూడా అనేక జన్మలలో చేసికొన్న పుణ్యముంటేనే సాధ్యమౌతుంది. 🙏

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: