సంప్రదాయాలకు విరుధ్ధంగా వివాహాలు కావడానికి కారణం :

నేటి కాలంలో కుటుంబ సంప్రదాయాలకు విరుధ్ధంగా వివాహాలు కావడానికి కారణం :

గ్రహల స్థితి, యుతి మరియు వీక్షణల ప్రభావం...

(1) జాతక రీత్య - 
      (a) గ్రహాలు 'రాహువు, కేతువు ' మాత్రమే కాదు, గురువు, శని కూడా.
 రాశి D1 లో గాని లేదా నవాంశ చక్రం D9 లో గాని ద్వితీయ భావంలో పైన చెప్పబడిన గ్రహాలు ఉండడం.

(b) అష్టమాధిపతి D1లో గాని లేదా D9 లో ద్వితీయ భావంలో ఉండడం.

వీటికి తోడు లగ్న, ద్వితీయ, సప్తమాధిపతులకు విడివిడిగా కానీ, కలయికలచేత కానీ శని/రాహువులతో ఉండే సంబంధాలు కూడా కుటుంబ సంబంధాలు సంప్రదాయాలు భ్రష్టమవటానికి కారణమౌతాయి.


అంతేగాక, పితృ కర్మలు సరిగా చేయని కుటుంబాలలో కూడా వివాహాల విషయంలో పొరపాట్లు జరుగుతున్నవి.

 ఈ పితృకర్మల లోపం చేయుట దైవశాపంకన్నా తీవ్రమైనది. పితృశాపానికి వంశనాశనం జరుగుతుంది. 

దీనికి దశమ/నవమ కుజ, రాహు, శనులు ప్రథాన భూమికను పోషిస్తారు.

ఈ విషయంలో నవమం కన్నా దశమం ప్రథానం.

అందుకే అర్హులైనవారు వీలైతే షణ్ణవతిశ్రాద్ధదినాలలో అన్నశ్రాద్ధం కుదరకపోయినా తిలతర్పణలతోనైనా పితరులకు తృప్తికలిగించాలి. 

ఈ పితృశాపాల వలన సంతానం (వంశోద్ధారకులు) కలుగకపోవుట, కలిగినా స్త్రీసంతానమే కలుగుట, సంతాననష్టాలు మొదలైనవి జరుగుతూంటాయి.

(2) వాస్తు శాస్త్ర రీత్యా - 
నివసిస్తున్న ఇంటిలో ఉత్తర ఈశాన్యం, ఉత్తర వాయవ్యం, నైఋతి దిశలలో దోషాలు ఉండడం.

ఉదా: ఉత్తర ఈశాన్యంలో ద్వారం Door వాయవ్యంలో పిల్లల గది childrens' bed room.

ఇక కారకులు :
క్షమించాలి,  కాస్త ఆవేశంతో కూడిన ఆవేదన చెప్పక తప్పడం లేదు. వారు :

(1) Builders
(2) Plans & Designs గీసి ఇచ్చే Architectures / Engineers
(3) Civil construction works చేయించే సుతారి మేస్త్రీ లాంటివారు
(4) Misguide చేస్తున్న Vaastu Consultant
(5) తల్లిదండ్రుల పిసినాసితనం, మూర్ఖత్వం 
+ plus పై వారి అందరి Egoism.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: