విష్ణుమూర్తికి 24 పేర్లు

విష్ణుమూర్తికి 24 పేర్లున్నాయి. వాటిని కేశవనామాలంటారని మనకు తెలుసు.

ఇవి 24 మాత్రమే ఎందుకు ఉన్నాయి? వీటికి కాలచక్రానికి, గణితానికి ఏమైనా సంబంధం వున్నదా?

ఈ *24 కు గణిత పరమైన భూమిక ఏమిటి*?
చూద్దాం.

విష్ణుమూర్తిని చతుర్భుజుడు అంటాం. అంటే నాలుగు చేతులు గలవాడని కదా?
ఈ నాలుగు చేతుల్లో శంఖం, చక్రం, గద, పద్మాలను ధరించి మనకు దర్శనమిస్తాడు.

నిశితంగా పరిశీలిస్తే, ఈ నాలుగు ఆయుధాల యొక్క అమరికలలో వచ్చే మార్పుల వల్ల ఖచ్చితంగా 24 వేరువేరు రూపాలు విష్ణువునకు ఏర్పడతాయి. 

ఈ 24 రూపాలనే కేశవనామాలంటారు.

*1.కేశవ నామాలలో మొదటి నామం కేశవ.*

కేశవ రూపంలో స్వామి కుడివైపు ఉన్న రెండు చేతులతో 
*పద్మము, శంఖము*
ధరించి ఎడమ వైపు ఉన్న రెండు చేతులతో 
*గద, చక్రం* 
ధరించి ఉంటాడు.

 *2.విష్ణువు యొక్క మరొక నామము మాధవ.*

ఈ రూపంలో కుడి వైపు రెండు చేతులతో
*గద, చక్రం* ధరించి, ఎడమవైపు ఉన్న రెండు చేతులతో
*పద్మము, శంఖము* ధరించి ఉంటాడు.

*3.మధుసూధన రూపంలో* 

కుడివైపు చేతులతో *చక్రం, శంఖము* 
మరియు ఎడమవైపు చేతులతో
*గద, పద్మము* ధరించి ఉంటాడు.

*ఈవిధంగా ప్రతి పదిహేను రోజులకు*(పక్షానికొకసారి) 

*పౌర్ణమికి, అమావాస్య కు* తన ఆయుధాలను చేతులు మార్చుకుంటూ ఉంటాడు శ్రీ మహా విష్ణువు.

*ఈ మార్పులు లేదా అమరికలను* మనం గణిత శాస్త్ర పరిభాషలో *ప్రస్తారాలు(permutations)* 
అంటాం.
అనగా 4 వస్తువులను 4! 
(4 factorial) విధాలుగా అమర్చవచ్చు.

 4! = 4×3×2×1=24

*శంఖాన్ని* 'శ' తోను,
*చక్రాన్ని* 'చ' తోను,
*గదను* 'గ' తోను,
*పద్మాన్ని* ' ప'తోను సూచిస్తే,

*ఆ 24 అమరికలు* క్రింది విధంగా వుంటాయి.

*1) శచగప 2) శచపగ*
*3) శపచగ 4) శపగచ*
*5)శగచప 6)శగపచ*
*7)చపగశ 8)చపశగ*
*9)చగపశ 10)చగశప*
*11)చశగప 12)చశపగ*
*13)గపశచ 14)గపచశ*
*15)గచశప 16)గచపశ*
*17)గశపచ 18)గశచప*
*19)పచగశ 20)పతశగ*
*21)పశగచ 22)పశచగ*
*23)పగశచ 24)పగచశ.*

[పైవన్నీ *ఒక క్రమంలో* ఉన్నట్లు పరిశీలించి ఉంటారు.]

ఈ 24 నామాలు పెద్దలందరికీ తెలిసినా‌...

మరోసారి క్రింద ఉదహరిస్తున్నాను.
      
*కేశవ, నారాయణ*
*మాధవ, గోవింద*
*విష్ణు, మధుసూధన*
*త్రివిక్రమ, వామన*
*శ్రీధర, హృషీకేశ*
*పద్మనాభ, దామోదర*
*సంకర్షణ, వాసుదేవ*
*అనిరుధ్ధ, ప్రద్యుమ్న,*
*పురుషోత్తమ, అధోక్షజ*
*నారసింహ, అచ్యుత*
*జనార్ధన, ఉపేంద్ర*
*హరి శ్రీకృష్ణ.*

ఈ నాలుగు ఆయుధాలను అన్ని విధాలుగాను మార్చుకోవటానికి 
*24 పక్షాలు* అంటే
*12 నెలలు*
అనగా *ఒక సంవత్సరం* పడుతుంది.

జై శ్రీమన్నారాయణ 🙏

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: