మృదంగ శైలేశ్వరి ఆలయం బాధల పాలైన దొంగలు
కేరళ లోని ఈ ఆలయంలో విగ్రహాన్ని దొంగతనం చేసిన ప్రతిసారి ఆ విగ్రహాన్ని తీసుకుని వెళ్లలేక దొంగలు మళ్ళీ వదిలి వెళ్ళటం ఇలా 3సార్లు జరిగింది...
"మృదంగ శైలేశ్వరి ఆలయం" అనేది దక్షిణ కేరళ రాష్ట్రంలోని కన్నూర్ జిల్లా, ముజక్కున్ను వద్ద ఉన్న ఒక పురాతన దేవాలయం. ఋషి పరశురామునిచే స్థాపించబడిన 108 దేవాలయాలలో ఇది ఒకటిగా చెప్పబడుతోంది.
కేరళ శాస్త్రీయ నృత్యం "కథాకళి" ఇక్కడే ఉద్భవించింది.
దీనిని జ్ఞానానికి సంబంధించిన ఒక తాంత్రిక శక్తి పీఠంగా చెప్తారు. ఇక్కడ ప్రధాన దేవి దుర్గను "మిఝావిల్ భగవతి" అని కూడా పిలుస్తారు. ఈ ఆలయానికి "మృదంగ శైలేశ్వరి" అని పేరు రావడం వెనుక ఒక కథ ఉంది. ఈ ప్రదేశంలో మృదంగ ఆకారంలో ఉన్న ఒక శిల స్వర్గం నుండి పడిపోయింది అని చెప్తారు. ఇక్కడే శక్తి లేదా దేవి యొక్క ఉనికిని కనుగొన్న పరశురాముడు ఆమెను విగ్రహం లోకి ఆహ్వానించి ఆమె కోసం ఆలయాన్ని స్థాపించాడు అని స్థలపురాణం.
ఈ ఆలయంలో కొద్ది దశాబ్దాలుగా జరుగుతున్న అద్భుతం ఏమిటంటే, నాలుగుసార్లు, దొంగలు ఈ ఆలయ విగ్రహాన్ని దొంగిలించారు, కానీ వారు దానితో ఎక్కువ దూరం వెళ్ళలేకపోవడంతో దానిని వెనక్కి తిరిగి ఇచ్చారు.
ఇటీవల కేరళ డిజిపి (రిటైర్డ్) శ్రీ అలెగ్జాండర్ జాకబ్ భగవతి విగ్రహాన్ని దొంగిలించిన విగ్రహ దొంగల కథను ఒక టివి ఛానల్ లో వివరించాడు. ఈ ‘పంచలోహ విగ్రహం’ మార్కెట్ విలువ దాదాపు 1 నుంచి 2 కోట్ల వరకు ఉంటుంది. ఆయన పనిచేస్తున్నప్పుడు ఆయన సిఫారసు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఈ ఆలయానికి సెక్యూరిటీ గార్డులును ఇవ్వలేదట.
మొదటిసారిగా దొంగలు ఈ విగ్రహం దొంగతనం చేసిన తరువాత దానిని పారక్కడవు వద్ద రోడ్డుపక్కన ఒక నోట్‌తో వదిలేశారు - "ఈ విగ్రహం మృదంగ శైలేశ్వరీ ఆలయానికి చెందినది, దాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోతున్నాం, దానిని తిరిగి ఆలయానికి తీసుకెళ్లవచ్చు అని".
రెండో సారి, 3 సంవత్సరాల తర్వాత, దొంగలు దానిని 300 మీటర్ల దూరం మాత్రమే తీసుకెళ్లారు. రెండు సందర్భాల్లోనూ ఆలయ ఆవరణలో మరియు వారు విగ్రహం వదలిపెట్టిన స్థలంలో కూడా మలవిసర్జనలు జరిగాయి.
మూడవసారి దొంగలు దానిని కాల్పేట వరకు తీసుకెళ్లారు. కానీ విగ్రహానికి సంబంధించిన వివరాలను సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు తెలియచేసి ఆ విగ్రహాన్ని అక్కడి లాడ్జిలో వదిలిపెట్టారు.
Mr. అలెగ్జాండర్ ఈ మూడు సార్లు డ్యూటీలో ఉన్నందున అతను దొంగల వైఫల్యంతో అబ్బురపడ్డాడు. తరువాత, చాలా సంవత్సరాల తరువాత దొంగలు పట్టుబడినప్పుడు, వారు దొంగిలించబడిన విగ్రహంతో తప్పించుకోలేకపోవడానికి ఖచ్చితమైన కారణాన్ని అడిగితే వారు విగ్రహాన్ని దేవాలయం నుండి తీసి తమ వెంట తీసుకెళ్తున్నప్పుడు, వారు తమ దిశను పూర్తిగా కోల్పోతున్నారని, వాళ్ళు తిమ్మిరిలోకి వెళ్ళిపోతానున్నాము అని మరియు అన్నిటి కంటే భయంకరమైన విషయం ఏమిటంటే, వారు తమ ప్రేగు కదలికలపై నియంత్రణను కోల్పోయి మూత్ర విసర్జన మరియు మల విసర్జన అనియంత్రితంగా చేస్తారు అని దొంగలు చెప్పారు.
ఇదే విషయమై ఆలయ పూజారులను ప్రశ్నించినప్పుడు, విగ్రహం యొక్క 'ప్రతిష్ట కర్మ' చాలా సుదీర్ఘమైన ప్రక్రియ (9 రోజుల కంటే ఎక్కువ జరిగింది) అని, ఈ దొంగల అసమర్థత కి కారణం ఆ 'ప్రతిష్ట కర్మ' యొక్క 'తాంత్రిక విధి విధానాల' యొక్క ఫలితం అని వారు చెప్పారు.
అయితే ఈ మూడు విఫల ప్రయత్నాలు కూడా విగ్రహాల దొంగల ముఠా తదుపరి ప్రయత్నాలను నిరోధించలేదు.
ఈసారి అది కేరళ రాష్ట్రంలోని మైనారిటీ వర్గానికి చెందిన అనుభవజ్ఞులైన దొంగల ముఠా ప్రయత్నించారు. కారణం? వారు విగ్రహంలోని అతీంద్రియ శక్తులను విశ్వసించలేదు. కానీ వారు కూడా విగ్రహాన్ని విడిచిపెట్టారు. తరువాత వారు పట్టుబడినప్పుడు, వారు విగ్రహాన్ని విడిచిపెట్టడానికి పైన చెప్పిన కారణాలే చెప్పారు.
మన తెలివితేటలు మరియు మన శాస్త్రీయ పరిజ్ఞానానికి అంతు పట్టని విషయాలు మన ఈ ప్రకృతిలో ఎన్ని ఉన్నాయో?
*జై జగత్ జనని!* 🙏🏻🚩
Comments
Post a Comment