33 కోట్ల దేవతలు ఎవరు?

33 కోట్ల దేవతలు ఎవరు?

వేదపురాణములు తెలుపునట్టి త్రయత్రింశతి కోటి (33కోటి) దేవతలు మరియు వారి పేర్లు మరియు హిందూ ధార్మిక సాహిత్య మందు ఉల్లేఖించబడిన 33కోటి దేవతలు ఎవరు వారి పేర్లు ఏమి అని తెలుసా?

హిందూ ధర్మ - సంస్క్రృతియందు 33కోటి దేవతల ఉల్లేఖన ఉంది. వాస్తవముగా ఈ 'కోటి' సంఖ్యను సూచించే కోటి కాదు. 

సంస్క్రృతములో 'కోటి' అనగా 'విధము' 'వర్గము' (type) అని అర్ధమూ ఉంది.

ఉదా: ఉచ్చకోటి. దీని అర్థం ఉచ్ఛమైన వర్గమునకు చేరిన వారు అని అర్థం. 

అలాగే మరియు ఉదాహరణము: సప్త కోటి బుద్దులు. దీని అర్థం ఏడు ప్రధాన బుద్దులు.
...
యజుర్వేద, అథర్వణ వేద, శతపథ బ్రాహ్మణులు మొదలైన ప్రాచీన కృతులందు 33 విధముల దేవతలను ఉల్లేఖించారు. వీరే కోటి (33కోటి దేవతలు. త్రయత్రింశతి

హిందూ గ్రంధములేకాదు బౌద్ధ, పార్శీ మొదలైనవి కూడ 33 దేవవర్గముల గురించి తెలుపుతాయి. బౌద్ధుల దివ్యవాదము మరియు సువర్ణప్రభాస సూత్రములందు వీటి ఉల్లేఖన ఉన్నది.

ఇపుడు దేవతల ఈ 33వర్గములనూ, అందులో వచ్చు దేవతల పేర్లనూ చూద్దాము:

12 ఆదిత్యులు (ద్వాదశాదిత్యులు) : 1. త్వష్ట, 2. పూష. 3. వివస్వాన్ 4. మిత్ర 5. ధాతా 6. విష్ణు 7. భగ. 8. వరుణ 9. సవితృ 10. శ 11. అంశ 12. ఆర్యమ

11 రుద్రులు (ఏకాదశ రుద్రులు):

1. మన్యు 2. మను 3. మహినస 4. మహాన్ 5. శివ 6. ఋతధ్వజ 7. ఉగ్రతా 8. భవ 9 కాల 10. వామదేవ 11. ధృతవృత.

8 వసువులు(అష్టవసువులు):

1. ధరా 2. పావక 3 అనిల 4. అప 5. ప్రత్యుష 6. ప్రభాస 7. సోమ 8 ధ్రువ.

మరి ఇద్దరు: 1. ఇంద్ర 2. ప్రజాపతి.

త్రయత్రింశతి (33) కోటి దేవతలు ఎవరని తెలిసినది కదా! ఈ పేర్లను కంఠపాఠము చేయునది చాలా సులభము.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: