ఎవరితో వివాదపడరాదు

శ్లో!!ఋత్వి క్పురోహితాచార్యై ర్మాతు లాతిథి సంస్థితైః!
బాల వృద్ధాతురై ర్వైద్యైః జ్ఞాతిసంబంధి బాంధవైః!!
మాతాపితృభ్యాం జామాభిర్భ్రాత్రా పుత్రేణ భార్యయా!
దుహిత్రా దాసవర్గేణ వివాదం న 
సమాచరేత్!!
తా!!
ఎవరితోనూ వివాదపడరాదు. కానీ ముఖ్యముగా వివాదకారణ మున్నను ఈ క్రిందివారితో వివాదము పెట్టకొనరాదు. ఋత్విక్కు, పురోహితుడు, ఆచార్యుడు, మేనమామ, ఇంటికి వచ్చిన అతిథి, బాలుడు, వృద్ధుడు, రోగి, వైద్యుడు, జ్ఞాతి, వియ్యంకుడు, బంధువు, తల్లిదండ్రులు, అక్కచెల్లెల్లు, అన్నదమ్ములు, పుత్రుడు, కుమార్తే, భార్య, సేవకుడు.🙏

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: