⚜️కోపం ఎలా ఉండాలి⚜️


   ⚜️కోపం ఎలా ఉండాలి⚜️       

ఎప్పుడూ కోపంతో ఊగిపోయేవాడి దగ్గరకు వెళ్ళడానికి, స్నేహంగా మెలగడానికి, ఆత్మీయతను పంచుకోవడానికి ఎవ్వరూ ఇష్టపడరు. ఆయనో ఉన్నతాధికారి, ఉపకారం కూడా చెయ్య గలడు. కానీ చాలా కోపిష్టి, ఎప్పుడు కోప్పడతాడో తెలియదు. ఎందుకొచ్చిన గొడవ మరో దారి చూసుకుందాం అనుకుంటారు.

కట్టుకున్న భార్య కూడా భయపడు తుంటుంది. తోబుట్టువులు, స్నేహితులు కూడా ఆయనతో అంతంత మాత్రంగానే ఉంటారు. అది చాలా ప్రమాద కర లక్షణం

'ధన్యాస్తే పురుష శ్రేష్టా యే బుధ్యా కోప -ముత్రితమ్ నిరుంధంతి మహాత్మానో దీపమ గ్నిమివాంభ సా'.... అంటారు.

అగ్ని అంటుకున్న తరువాత మంట పైకి లేస్తుంది. చుట్టూ ఉన్న వస్తువులన్నింటినీ కాల్చేస్తుంది. అప్పుడు నీళ్ళలాగానే ఉంది కదా అని నెయ్యి పోసారనుకోండి. మంట మరింత పెరిగి పోతుంది. 

కోపమూ అంతే.. అప్పుడు దాన్ని ఎలా అణచాలి. ఎలా అదుపు చేసుకోవాలి. అంటే..

యధోరగ స్వచం జీర్ణాం స వై పురు షముచ్యతే.’.. 
పాము ఒంటికి కుబుసం పట్టు కుంటుంది. కుబుసం ఉన్న పాము చాలా కోపంతో ఉంటుంది. 
సరిగా కళ్లు కనపడవు. ఒంటికి తొడుగు ఉంటుంది కాబట్టి దానికి రక్షణ ఉంటుంది. కానీ పాము దాన్ని ఉంచుకోదు.  

దానిని అదెలా విడిచిపెట్టేస్తుందో. అలానే మనిషి కూడా ‘యస్సముత్పత క్రోధం క్షమయైవ నిరస్యతి..’ తనకు వచ్చిన కోపాన్ని ఓర్పుద్వారా పోగొట్టు కోవాలి.

ఉన్నట్టుండి చాలా కోపం వచ్చేసింది. వెంటనే మనం అక్కడి నుండి తప్పు కోవాలి. ఒంటరిగా దూరంగా వెళ్లి మనకు ఎవరి మీద కోపం వచ్చిందో వారిని గురించి సానుకూల ధోరణితో ఆలోచించాలి.  
దానికి ఆ క్షణంలో మనసు మొరాయించి తీరుతుంది. ‘ప్రయత్న పూర్వకంగా’ అలవాటు చేసుకోవాలి.. "ఆయనెంత మంచి వాడు. ఎన్ని ఉపకారాలు చేసాడు. మనమీద ఎంత ప్రేమ ఉన్నవాడు. ఎంతో ఆప్యాయత మనం అంటే... ఏదో తప్పు చేసాడు. అంత మాత్రం చేత అంతగా కోప్పడాలా... వద్దు..." అంటూ మీ మనసుకు సర్ది చెప్పుకున్నారనుకోండి. అగ్ని హోత్రం మీద నీళ్లు చల్లినట్లే, కోపం చప్పున చల్లారి పోతుంది.* 

కోపం వచ్చినప్పుడు ఒక్కసారి అద్దం ముందు నిలబడి చూసు కోండి. మీ రూపం మీకే వికారంగా కనబడుతుంది. ఇంత చెడ్డది కదా కోపం, మరి భగవంతుడు కోపాన్ని ఎందుకు సృష్టించినట్లు? 

అంటే... కోపం మనిషికి ఉండాల్సిందే. ఎలా ఉండాలి అంటే.. చేతిలో ఒక సాధనంగా ఉండాలి. 
చీకట్లో నడిచి వెడుతు న్నారనుకోండి. ఒక కర్రచేత్తో పట్టుకుని వెడతాం. 

ఎందుకు అంటే ప్రమాదకర పరిస్థితుల్లో ఆపదను అడ్డుకోవడానికి, ఆత్మ రక్షణకు.. అలాగే... వ్యవస్థలను చక్క దిద్దడం కోసం, అటువంటి తప్పులు మరలా జరగ కుండా నివారించడం కోసం కోపాన్ని నటించాలి. ఆ కొద్దిసేపు, అవసరం మేరకు దానిని ధరించాలి. 

ఆ తరువాత పాము కుబుసాన్ని వదిలి పెట్టినట్టు వదిలేయాలి. ఇక దాని జోలికి వెళ్ల కూడదు. అంతకు పూర్వం ఎలా ప్రేమ స్వరూపులుగా ఉన్నారో.. అలాగే అంత ప్రేమగా మెలగాలి.

కోపం విషయంలో అందరూ తెలుసుకో వాల్సిన పరమ రహస్యం ఒకటుంది. 

చాలా కోప్పడిన తరువాత మీరు కోరుకున్న మార్పు శాశ్వతంగా మాత్రం రాదు. 

అప్పటికీ మీ విద్యకు, అధికారానికి పెద్దరికానికి భయపడో, మీ డబ్బుకు భయపడో ఎదుటి వారు ఒకటి రెండు రోజులు మారినట్లు కనిపించ వచ్చు. అది మనసులో వచ్చిన మార్పు కాదు. 

కోపానికి విరుగుడు ప్రేమ తప్ప మరొకటి లేదనే విషయాన్ని తెలుసు కోవాలి. దానితో శాశ్వత ప్రయోజనాలను ఎన్నిటినో సాధించ గలరు.

 *లోకా సమస్తా సుఖినో భవన్తు!*

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: