నక్షత్రములకు క్షిప్రమృద్వాది సంజ్ఞలు

3. నక్షత్రములకు క్షిప్రమృద్వాది సంజ్ఞలు:

 శ్లో:- క్షిప్రందస్రరవీజ్య మాసురశివజ్యేష్టో: రగందారుణం
             చిత్రాం త్యేందుభమైత్రభం మృదుభవేద్ర్బ్రాహ్మ్యోత్తరాభం స్థిరమ్
                   ఉగ్రంకాలమఖాత్రి పూర్వమనలేంద్రాగ్నీతు సాధారణం
             స్వాత్యాదిత్యహరిత్రయం చరమిదందద్యాత్స్వ సంజ్ఞాఫలమ్

తాత్పర్యము:- నక్షత్రముల ద్వారమున కలుగు ఫలములను బట్టి వాటిని ఆరు వర్గములుగా విభజించి ఉన్నారు. అందులో 

 అశ్వని హస్త పుష్యమి అను మూడు నక్షత్రములునూ అత్యంత శ్రీఘ్రముగా ఫలములొన గూర్చునవగుటచే వీనిని క్షిప్రతారలు అని అందురు. 

 అతి సున్నితములుగా ఫలించు తారలను మృదుతార లందురు. చిత్తా రేవతి మృగశిర అనురాధ యను ఈ నాలుగు తారలును మృదుతారలు. 

రోహిణి ఉత్తర ఉత్తరాషాడ ఉత్తరాభాద్ర అను నాలుగు తారలును స్థిరనక్షత్రములు. ఇవి సుస్థిరములగు ఫలముల నిచ్చును. 

 భరణీ మఖ పూర్వఫల్గుణి పూర్వాషాడ పూర్వాభాద్ర 5ను ఉగ్రతారలు ఉగ్రఫలముల నోసంగును. 

కృతిక విశాఖ ఈ రెండును సాధారణ తారలు. వీని ఫలములు సాధారణంగానే ఉండును. 

స్వాతి పునర్వసు శ్రవణము ధనిష్ట శతభిషం తారపంచకము చరతారలపబడును.ఇవి చంచలమగు ఫలముల నిచ్చును.

 4.గ్రహముల క్రూర సౌమ్యలింగభేద జాత్యాది వివరములు.

 శ్లో:- క్రూరాభానుతమశ్శనిధ్వజాకూజాశ్శు క్రార్యసౌమ్యేందవ
       స్సౌమ్యాస్తే పురుషాఃకూజార్కగురవోరాహ్విందుశుక్రాః స్త్రియః
       తచ్ఛేషాస్తునాపూసంకా గురుభృగూవిప్రౌకూజార్కౌనృపౌ
       వైశ్యౌచంద్రబుథౌ తదన్యకులజో మందస్తువర్ణేశ్వరః

తాత్పర్యము:- రవి కుజ శని రాహు కేతువులు పాపగ్రహములు. 
చంద్ర బుధ గురు శుక్రులు శుభులు. 
శుభుడగు బుధుడు పాపగ్రహసంపర్కము గల్గినను చంద్రుడు క్షీణచంద్రుడైనను పాపఫలితములిత్తురు. 
సూర్యుడు అంగారకుడు గురుడు పురుష గ్రహములు. 

చంద్ర శుక్ర రాహువులు స్త్రీ గ్రహములు. 

శని బుధ కేతువులు నపుంసక గ్రహములు.

 వర్ణములలో బ్రహ్మణగ్రహములు గురు శుక్రులు. క్షత్రియగ్రహములు రవి కుజులు. 
వైశ్యగ్రహములు బుధ చంద్రులు. 
శూద్రగ్రహము శనిగా గ్రహించవలయును.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: