దోషశేషము ముహూర్తము

దోషశేషము ముహూర్తము
 శ్లో:- పూర్వేద్యుశ్చ పరేహని వ్రతదినాత్త స్మాచ్చతుర్థేదినే
        నధ్యాయశ్చ రజస్వలా స్వజననీ గర్భాన్వితావాశిశోః
        ప్రితోశ్చక్షయవత్సరోయది గురో స్సంథ్యాభిజి త్సద్మవా
        బాలోవాయదికర్ణవేథరహితో నైతేషు కార్యం వ్రతమ్
తాత్పర్యము:- ఉపనయన మహూర్తమునకు 4రోజులు వెనుకముందు అనధ్యాయ దినములు కాకూడదు. తల్లి నాందీకర్మమునకు ముందు వెలుపలయుండరాదు. గర్భిణీగా 6మాసము లుండరాదు. తల్లి తండ్రు లిద్దరుగాని యే యొక్కరుగాని మరణించిన సంవత్సరమునకు రవిస్థిత లగ్నమునకు యెనిమిదింట చెవులు కుట్టించరాదు. ఉపనయనము చేయరాదు.

  *నక్షత్ర స్వరూపములు*
 శ్లో:- జన్మర్ క్షం జననోడుకర్మదశమం సాంఘాతికం షోడశం
        వైనాశాఖ్య మథత్రివింశమపిభం తత్పంచవింశం యది
        ఋక్షం మానసంజ్ఞికం ద్వినవమం తత్సాముదాయాభిదం
        త్యాజం సప్తమభంతు నైధనమిదం సర్వేషుకర్మస్వపి
తాత్పర్యము:- నక్షత్రములు కొన్ని గుర్తులు గలవు. కర్మ, సాంఘాతికము, వైనాశము, సాముదాయకము,నైధనమను పేర్లు వాటికున్నవి. జన్మ నక్షత్రమునకు 10వ నక్షత్రము కర్మ నక్షత్రమందురు. జన్మ నక్షత్రమునకు 16వ తార సాంఘాతిక మందురు. దానికి 23వ తార వైనాశము, 18వది సాముదాయక మందురు.7వ తార నైధనతారా దోషము. 25వది మానసమగుటచే ఈ నక్షత్రములందు శుభకార్యములు వర్జింపవలయును.
*జన్మ నక్షత్రములు*
 శ్లో:- శుభదం నిషేకమఖయో శ్చౌలాన్నభుక్త్యోః కృషౌ
        మౌంజీబంధన పట్టబంధనమహీ ప్రాప్త్యక్షరావాప్తిషు
        ఏభ్యోన్యేష్వశుభప్రదంచ సువనే సీమంతసంగ్రామయో
        ర్గర్భాధానపితృక్రియా క్షురభిషగ్యాత్రా వివాహేష్వపి
తాత్పర్యము:- జన్మనక్షత్రమందు పురుషుడు అన్నప్రాశనము, చౌలము, నిషేకము, వ్యవసాయము, ఉపనయనము, రాజ్యాభిషేకము, అక్షరాభ్యాసము, భూసంపాదన యాగము చేయదగును. స్త్రీలకు పుంసవన, సీమంత, గర్భాధాన, ఔషధసేవలు - పురుషులకు యుద్ధ ప్రయాణ, క్షురకర్మ, శ్రాద్ధకర్మలు చేయుటకు తగదు.
 అథ చ్యవనోక్తమ్
 శ్లో:- జన్మర్ క్షం జన్మమాసం చ తథా జన్మదినం శుభం
        స్త్రీణాం జన్మత్రయం శ్రేష్టం వివాహే సర్వసమ్మతం
తాత్పర్యము:- జన్మనక్షత్రము స్త్రీలకు వివాహమునకు చాలా మంచిదిగా చ్యవన మతము.


.....
 ఇందులో మొదటి శ్లోకం గురించి.....

మిత్రమా! 
*ఉపనయన ముహూర్తమునకు ముందు వెనుక 4రోజులు అనధ్యయనములు ఉండకూడదు* అని మొదటిశ్లోకంలో ఉన్నది. దీని ప్రకారంగా.... ఏ శుభతిథికి కూడా ముందు లేదా వెనుక అనధ్యయనతిథి లేకుండా ఉండటం లేదు. 
అనధ్యయన తిథులు..... 1,8,14,15,30.

మరి ముహూర్తానికి ఏ తిథి కుదురుతుందో.... తెలుపప్రార్థన.
: *ఉపనయనముహూర్తం తరువాత 4దినములలో అనధ్యయనం ఉండకూడదు* అని ముహూర్తదర్పణంలో చెప్పారు. 
....
ఉపనయనం తరువాత స్వీకృతమంత్రం అనుష్ఠించటం ఉంటుంది కనుక.... తరువాత 4రోజులలో అనధ్యయనం ఉండకూడదనటం అర్థవంతం. 

మరి 4రోజులు ముందు కూడా అనధ్యయనాలు ఉండకూడదనటంలో ఉద్దేశ్యం తెలియరాలేదు.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: