సీమంతము

3. సీమంతము
(సీమంతోన్నయనం)
సీమంతస్య - కేశరచనా విశేషస్య, ఉన్నయనం - ఉత్తొలనం ఆత్రేతి - సీమన్తోన్నయనం ఇతి గర్బ సంస్కార భేదః కేశరచనా విశేషముచే 

సీమంతము (పాపట తీయుట) సమానముగ నెత్తియెత్తుచు చేయు నొక గర్భ సంస్కారమునకు సీమంతోన్న యనిగాని లేక సీమంతమనిగాని వ్యవహారము.

షష్ఠే చతుర్ధేష్టమే ఏతేషా మన్యత మేమాసి సీమంతోన్న యనాఖ్య కర్మకుర్యాత్‌'' అనువిధి ననుసరించి, గర్బము థరించిన దాది, నాలుగవమాసమునగాని, ఆరవమాసమునగాని, అష్టమమాసమునగాని, సీమంతోన్న యనాఖ్య గర్బసంస్కారక కర్మ చేయదగినది.

ప్రధమే గర్బే చతుర్ధేమాసి షష్ఠే೭ ష్టమేవా శుభే೭హని
దంపతీమంగళస్నాతే భూత్వా. ''జనిష్యమాణ సర్వగర్బాణాంబీజ గర్బసముద్బవైనోని బర్హణ ద్వారా ప్రతిగర్బ సంస్కారాతిశయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, సీమంతోన్నయనం కర్మ కరిష్యేయని సంకల్పింతురు. తోలిగర్బముల, నాలుగు. ఆరు, ఎనిమిది మాసములలో నీ సీమంత మాచరింతురు. ఈసీమంతముచే, గర్బ బీజ దోషశాంతులు గల్గును. అనంతర గర్బములకు నీ సంస్కారబలముచే శుద్ధిగల్గును. పురుష జననమునకు కారణమగును. కాన సూత్రకారులీ సీమంత సంస్కారమునకు ప్రాముఖ్య మొసంగిరి. 
ఉ సంస్కారము సహితము తిది వార నక్షత్ర లగ్నములనెరింగి, శుభ తిది వారాదులలోనే చేయదగినది.

4. ''జాతకర్మ''
గర్బాంబు పానజోదోషః జాతాత్సర్వోపినశ్యతి''
ఈ జాతకర్మ సంస్కారముచే శిసువు గర్బమునందు, గర్జ జలపానాది దొషము నివర్తించును.

కుమారే జాతేసతి జన్మదినసమారభ్య దశదిస పర్యన్తం, దశదిన మధ్యె యస్మిన్‌ కస్మి& దిససే తజ్జాతకర్మ పుత్రవిషయే కుర్యాత్‌''

పుత్రోత్పత్తి కాలమునగాని, పదిదినములలోనే నాడేనియు లేదా పదియవ దినమందైననూ జాతకర్మ యనబడు సంస్కారము చేయదగినది, జన్మించిన శిశువునకీ కార్యముచే ఆయుర్వృద్ధి గల్గును.

'కుమారస్య ఆయుష్యాభివృధ్యర్థం జాతేన కర్మణా సగ్గ్‌స్కరిష్యే అని సంకల్పము, ఇందు ఫలీకరణ హోమమను పేర హోమకార్యముగలదు. ఈ హోమ కార్యముచే, ''ఆయుష్యాభివృద్ధర్థం, అనయోర్బాల సూతికయోః చండాలాదిపిశాచే భ్యోరక్షణార్థం. ఫలీకరణ హోమం కరిష్యే||'' అని సంకల్పింతురు,

జన్మించిన బాలునికి పిశాచాది బాధలనుండియు, బాలగ్రహాది బాధలనుండియు, రక్షణార్థమై యీ ఫలీకరణ హోమము చేయుదురు. దీని వల్ల బాలారిష్టాదులకు శాంతికల్గును.

శిశువు జన్మించిన సమయము ననుసరించి, మాతా పితరులకు క్షేమకరమగునా? లేదా? యనియు, జన్మించిన శిశువునకు బాలరిష్టాది దోషములు లేకను, ఆయుర్వృద్ధికరమైన విధానమున్నదా? లేదా యనియు విచారింపదగియున్నది. అట్లు తల్లి దండ్రులకు, మేనమామలకు, జన్మించిన శిశువునకు దోషములున్నచో, నవగ్రహ, జప, హోమదానాదులచేతనూ తదితర జప హోమశాంతులచేతను దోషనివారణమునకు శాంతికలాపములుగలవు. వానిని యెరింగిన మహనీయులనడిగి, తగిన శాంతులు జరుపుకొని యంనతరము దాని జాతకర్మ నామ కరణాదులు జరపుకొనుట పెద్దలయాచారము. తల్లి దండ్రులకు మేనమామలకు, దోషకరమైన రీతిని కొన్ని జన్మలుండునుగాన విధిగ పెద్దలనడిగి శాంత్యాదులు జరుపుకొనుట శ్రేయస్కరము. ఈ జన్మ దోషాదులు జ్యోతిషము తెలిసిన పెద్దలు చెప్పగలరు. వానికి శాంతులు చక్కని పురోహితులు జరిపించగలరు.

5. ''నామకరణము''
నామ కర్మఫలం త్వేతత్‌ సముద్దిష్టం మనీషిభిః''
అను రీతిని, ఆయుస్సు, వర్చస్సు, వ్యవహారసిద్ధి, గలుటకై ఈ నామ కరణ సంస్కారము జరుపదగినదని పెద్దల నిర్ణయము.

'జననాత్‌ దశరాత్రే సంపత్స రేవా నామకరణం, అహన్య కాదశీనామకరణం|
అనురీతిని పదునొకండవరోజు నామకరణముc జేయదగినది. వసతిలేనిచో సంవత్సరంలోపుగ వసతి ననుసరించియు చేయదగును.

ఆడబిడ్డకు నామకరణం చేయునెడల ''ఈకారాన్తం స్త్రీణాం ఏవం కృతే నామ్నశుచి తత్కులంభవతి'' అనురీతిని ఈ కారాన్తముగ పేరుండులాగున నామకరణ మొనర్చినచో వంశమన్తయు పరిశుద్ధి యగునందురు.

''కుమారస్యాయుష్యాభివృద్ధ్యర్థం. సభాసకల సత్పురుషమథ్యే నామప్రకటన సిధ్యర్థం మాసనామ్నా నక్షత్రనామ్నా వ్యావహారికనామ్నా చసగ్గ్‌స్కరిష్యావహే'' యని సంకల్పము ఈరీతిని, ఆయుర్వృద్ధి కొరకును. సభలలో, పెద్దల సమక్షమున వ్యవహరించుటకును మాసనామము. నక్షత్రనామము, వ్యవహారనామములతో నామకరణము జరుపబడును.

చైత్రమాసమున జన్మించినచో కృష్ణుడు. వైశాఖమాసమున అనంతుడు, జ్యేష్ఠమాసమున అచ్యుతుడు. ఆషాఢమున చక్రీ, శ్రావణమున వైకుంఠుడు, భాద్రపదమున జనార్దనుడు. ఆశ్వయుజమున ఉపేంద్రుడు, కార్తికమున యజ్ఞపురుషుడు, మార్గశీర్షమున వాసుదేవుడు, పుష్యమాసమున హరి, మాఘమాసమున గోవిందుడు, ఫాల్గునమున పుండరీకుడు అని మాస నామములు తొలుత పెట్టుకొనవలయును.

స్త్రీయైనచో చైత్రమాసమున జన్మించినవారికి భూదేవి, వైశాఖమున కల్యాణి జ్యెష్ఠమున సత్వభామా, ఆషాఢమాసమున పుణ్యవతీ, శ్రావణమాసమున రూపిణీ, భాద్రపదమున ఇందుమతీ, ఆశ్వయుజమున చంద్రావతీ, కార్తికమున లక్ష్మీ, మార్గశీర్షమున వాగ్దేవీ, పుష్యమాసమున పద్మావతీ, మాఘమున శ్రీదేవి, ఫాల్గున సావిత్రీ యని మాసనామములు తొలుత పెట్టుకొన దగియున్నది.

నక్షత్ర నామము పెట్టుకొనిన తదుపరి.
''ఆయుజాక్షరం కుమార్యాః, అవిషమాక్షరం కుమారస్య
ఆద్యన్తయోః శ్రీకారం లిఖిత్వా| వ్యవహారనామసమక్షరం.
పుంసః అసమాక్షరం స్త్రియః| 
అను ధర్మము ప్రకారము నామమునకు ఆద్యన్తములలో శ్రీకారము తోలుత వ్రాసి, అనంతరము సమవర్ణములుగల పేరు పురుషులకును, అసమాక్షరముగల పేరు స్త్రీలకును పెట్టుట శ్రేయస్కరము,

'కులదేవతా నక్షత్రసంబంధం పితా నామకుర్యాత్‌"
అనురీతిని. కులదేవత పేరుగాని, నక్షత్ర సంబంధమైన పేరుగాని తండ్రి పెట్టుకొనుట యుత్తమము.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: