మొట్టమొదట భూమి గుండ్రంగా ఉన్నదని మొట్టమొదట చెప్పినది ఎవరు..?
మొట్టమొదట భూమి గుండ్రంగా ఉన్నదని మొట్టమొదట చెప్పినది ఎవరు..?
మనం చదువుకున్న చరిత్ర ప్రకారం 16,17 శతాబ్దాలకు చెందిన కెప్లర్, కోపర్నికస్, గెలీలియోలని.
కాని ఋగ్వేదం లోని క్రింది మంత్రం గమనించండి. 'చక్రాణాసః పరీణహం పృథివ్యా...."అర్థం " అంటే భూమి యొక్క వృత్తపు అంచున ఉన్నవారు..."
అతిప్రాచీన గ్రంథం అయిన " సూర్యసిద్దాంతం " 12వ అధ్యాయం, 32వ శ్లోకంలో "మధ్యే సమంతాదణ్ణస్య భూగోళో వ్యోమ్ని తిష్టతి"
"బ్రహ్మాండం మద్యలో భూగోళం ఆకాశంలో నిలిచిఉంది"... అని దాని ఆర్యభట్టు రచించిన "ఆర్యభట్టీయం" గ్రంథంలోని గోళపాద అధ్యాయంలో
6వ శ్లోకం ' భూగోళః సర్వతో వృత్తః" ..అంటే భూమి వృతాకారంలో ఉన్నదని అర్థం.
క్రీ.శ. 505 లో వరాహమిహిరుడు
పంచ మహాభూతమయస్తారా గణ పంజరే మహీ గోళః.. (13-1)" అంటే .... పంచ భూతాత్మకమైన గుండ్రని భూమి, పంజరం లో వేలాడే ఇనుప బంతిలా, ఖగోళంలో తారల మధ్య నిలిచిఉంది" అన్నాడు.
" లీలావతి " గ్రంథం లో భాస్కరాచార్యుడు.
" నీవు చూసేదంతా నిజం కాదు. ఎందుకంటే నీవు ఒక పెద్ద వృత్తం గీసి అందులో నాల్గవ భాగం చూస్తే అది మనకు ఒక సరళరేఖలా కనిపిస్తుంది. కానీ నిజానికి అది వృత్తమే.
అలాగే భూమి కూడా గుండ్రంగానే ఉన్నది."
.....
Comments
Post a Comment