గ్రహస్తితి జ్యోతిష్య శాస్త్రం

ఏ గ్రహస్తితి జ్యోతిష్య శాస్త్రం నేర్చుకునే వారికి, నేర్చుకున్నవారికి, నేర్చుకోవాలి అనికుంటున్న వారికి ఉంటుంది?

బుధ, గురులు బలంగా ఉండాలి...
బుధ, గురు, శుక్రు లలో ఆధిపత్య శుభులు అయిన వారు కేంద్ర కోణాల్లో ఉండాలి. దశమాధిపతి శుభగ్రహమై కేంద్ర కోణాల్లో, లగ్నాధిపతి తో కలిసి ఉండాలి.
రాశి నవాంశ లలో ఆధిపత్య శుభులు
 (బు, గు,శు, చ) బలంగా ఉండాలి...

...
జ్యోతిష్కుడికి కి ముఖ్యమైన కాంబినేషన్స్ మామూలుగా ఫిఫ్త్ లార్డ్ ఫిఫ్త్ హౌస్ పాయింట్ నెంబర్ వన్. 

శని అకల్ట్ సైన్స్ అంటే జ్యోతిషం, హస్త రేఖలు . ఫిఫ్త్ లార్డ్ రవి సైన్సు. శని పౌరాణికం. జ్యోతిషం పౌరాణికం రవి శనికి కనెక్షన్ రావాలి.

నేర్చుకోవాలంటే 4, 8 లేదా 9, 8 ఒక లింకు కావాలి. 8 హౌస్ అకల్టు సైన్స్. 5వ స్థానం అనేది మిస్టికల్. ఫోర్త్ కంటే నైన్ తో చాలా మంచిది.

జాతకం వివరించాలంటే బుధ కుజ ఏ రాశి అయిన పర్వాలేదు. వీళ్ళిద్దరికీ ఒక లింకు కావాలి కుజుడు బుధుడు పరివర్తన లో గాని లింక్ ట్రైన్ అయినా కానీ లేదా రాహుకేతువులు ద్వారా ఒక లింకు కావాలి. తొమ్మిదవ స్థానానికి బుదుడు గాని గురువు గాని కనెక్షన్ ఉండాలి. రెండవ హౌస్ కు గురు కనెక్షన్ ఉంటే బ్రాహ్మణుడు కదా నిజం చెప్తాడు. కేతువు కనెక్షన్ కుజుడు కనెక్షన్ అయినా మంచిదే. ఐదో స్థానానికి 1, 9 కనెక్షన్ వస్తే చాలా మంచిది.
 
ఇంకా చెప్పాలంటే రెండో స్థానానికి రాహు కేతు లేదా యురేనస్ కనెక్షన్ ఉంటే వారి పలుకులు సత్యం అవుతాయి. కారకాంశ నుంచి చూసినా ఈ కాంబినేషన్స్ ఉన్నా జ్యోతిషం వంట పడుతుంది. కీర్తి రావాలంటే మాత్రం దశమం ఏదో విధంగా కనెక్ట్ అయి ఉండాలి. డబ్బు సంపాదించాలంటే 2, 9, 10,11 కనెక్ట్ కావాలి.

 మామూలుగా బుధుడు జ్యోతిష్య విద్య ప్రసాదిస్తాడని అందరికీ తెలిసిందే. దాంతోపాటు యూరేనస్ కూడా జ్యోతిషం ప్రసాదిస్తాడు. కారకాంశ నుండి వీరికి సంబంధం అంటే గొప్ప జ్యోతిష్యుడు అవుతారు. ఆరుద్ర, శతభిషం, రేవతి నక్షత్రాలు జ్యోతిషంలో ప్రజ్ఞ కలిగిస్తాయి. 

ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది. 
పంచమాధిపతి పంచమ భావం బలంగా ఉండి పంచమాధిపతికి కుజ సంబంధం ఉంటే ఇంట్యూషన్ పవర్ ఉంటుంది. ద్వితీయ భావానికి గాని, గురువు ద్వితీయానికి గానీ సంబంధం ఉంటే లగ్నం లేదా చంద్రలగ్నం నుండి పంచ భావంలో గురువు గాని బుదుడు గాని ఎక్కువ (భిన్నాష్టక వర్గులో) శుభ బిందువులు ఉంటే వారికి జ్యోతిషం అబ్బుతుంది.
 
చతుర్వింశాశలో చంద్రుడు మోక్ష త్రికోణం అయిన 4 8 12 లో ఉంటే వేదాంతం జ్యోతిష్యం అద్వైతం మొదలైన విషయాలపై ఆసక్తి ఉంటుంది.
రవి బుధులు, బుధ శుక్రులు వలన జ్యోతిషం అబ్బుతుంది. రవి బుధులు త్రికమందు గాక ఏ స్థానాల్లో అయినా కలిసి ఉన్నా వారిని శని చూస్తుంటే గణితం జ్యోతిష్యం.

రాసిలో చూస్తే ఆత్మకారకుడు బలంగా ఉంటే అతనికి ఆసక్తి ఎంత ఉందో తెలుస్తుంది. ద్రేక్కాణంలో మొదటిది నారద ద్రేక్కాణంలో గ్రహం ఉంటే జ్యోతిషం లౌకికం సూచిస్తుంది. అదే చంద్రుడు రెండవ ద్రేక్కాణంలో ఉంటే బహు భాషా ప్రావీణ్యత ఉంటుంది. ముఖ్యంగా బుదుడు 1 ,4 ,7 10 లో ఉంటే అంటే కేంద్రాలు ఇవి ఒకదానికంటే ఒకటి ఇ బలమైనవి వీటిలో బుధుడుంటే జ్యోతిషం మీద ఆసక్తి కచ్చితంగా ఉంటుంది. జ్యోతిషం రావడానికి ఇది ముఖ్యమైన కాంబినేషన్.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: