చంద్రబలము – వృద్దిక్షయములు.
5. చంద్రబలము – వృద్దిక్షయములు.
శ్లో:- అష్టమ్యోరుభయోశ్చ మధ్యమగతశ్శుక్లాన్యయోర్వ్యత్యయే
పూర్ణః క్షీణ ఇతిక్రమాచ్ఛశథరః పూర్ణశ్శుభేమంగళే
కృష్ణాదౌదినపంచకం శుభకరం తన్మథ్యమం మధ్యమం
తస్యాంత్యం త్వధామాభిథం శశివశాచ్ఛుక్లేతు తద్వ్యత్యయమ్
తాత్పర్యము:- శుక్లపక్ష మందలి అష్టమి తిథి నుండి బహుళ పక్షమందలి అష్టమి తిథి వరకూ గల్గు చంద్రుని పూర్ణ చంద్రునిగా చెప్పుదురు. తక్కిన పదిహేను దినములులో వచ్చు చంద్రుడు క్షీణ చంద్రునిగా తెలుసుకొనవలెను. విపులముగా చెప్పవలెనన్నచో అమావాస్య మొదలిడి శుక్లపక్షములోని పంచమీతిథివరకూ క్షీణచంద్రుడు. శుక్లపక్ష షష్ఠితిథి నుండి దశమి నాటి వరకూ పూర్ణ చంద్రుడు. ఏకాదశి నుండి పౌర్ణమి వరకు పూర్ణ చంద్రుడు. పౌర్ణమి మొదలుకొని కృష్ణపక్ష పంచమి వరకూ పూర్ణ చంద్రుడు. కృష్ణపక్ష షష్ఠి నుండి దశమి వరకు మధ్యముడు. ఏకాదశి నుండి అమావాస్య వరకూ క్షీణుడు. క్షీణ చంద్రుడు క్షీణ ఫలమునూ మధ్యమ చంద్రుడు మధ్యమ ఫలమునూ పూర్ణ చంద్రుడు పూర్ణ ఫలమునూ అతి పూర్ణచంద్రుడు అతిమిక్కిలి శుభ ఫలములనూ ఇచ్చునని తెలుసుకొనవలెను.
6. ప్రథమ రజోదర్శనము
శ్లో:- కన్యాయాః ప్రథమార్తవే శుభకరాణ్యాద్యంతమూలోత్తరా
బ్రాహ్మీజ్యేందుదినేశ పంచకహరిత్రీణ్యేవనాన్యానితు
వారాశ్చేందుజజీవశుక్ర శశినాం తేషాంచ వర్గాశ్శుభా
కేంద్రోపాంత్య ధన త్రికోణసహితా శ్చాన్యే౭రిలాభత్రిగాః
తాత్పర్యము:- అశ్వని రోహిణి మృగశిర పుష్యమి ఉత్తర హస్త చిత్తా స్వాతి విశాఖ అనురాధ మూల ఉత్తరాషాడ శ్రవణం ధనిష్ఠ శతభిషం ఉత్తరాభాద్ర రేవతి ఈ నక్షత్రములు ప్రథమ రజస్వలకు ప్రశస్తములుగా నెరుగదగును.. మిగిలినవి దుష్ట నక్షత్రములు. వారములలో సోమ బుధ గురు శుక్రవారములూ. వాటి అధిపతులు, వాటికి సంబంధించిన లగ్నాదులునూ ఆ లగ్నాది ద్రేక్కాణ నవాంశ ద్వాదశాంశాదులు చంద్ర హోరలు ప్రశస్తములు.
Comments
Post a Comment