ముహూర్తభేదములు
**ముహూర్తభేదములు*
శ్లో:- రుద్రాఖ్యోరగమిత్రపిత్ర్యవసనోవారాఖ్యవిశ్వేవిధి
బ్రహ్మేంద్రేంద్రహుతాశదైత్యవరుణా చ్చప్యర్యమాఖ్యోభగః
ఏతేపంచదశ క్రమాత్తుదివసేజ్ఞేయా ముహూర్తాభగ
శ్చేంద్రాగ్నీ అహిదైత్యరౌద్రపితర స్త్యాజ్యాస్తుశేషాశ్శుభాః
తాత్పర్యము:- ప్రతి దినమునకు ముహూర్తములు 15 నుండును. 1.రుద్రము,
2.ఉరగము, 3.మిత్రము, 4పిత్ర్యము
5.వసువు, 6.వారము, 7.విశ్వేరేతము, 8.విధి, 9.బ్రహ్మ, 10.ఇంద్రము,
11.ఇంద్రహుతాశనము, 12.దైత్యము,
13.వరుణము 14. మఅర్యము, 15.భగము
ఈ 15 ముహూర్తము లందునా 1, 2, 4, 11, 12, 15, యివి మహోగ్రములైనవి. ఈ ఆరు ముహూర్తములందు శుభములు జరుపరాదు.
మిగిలిన 9 మంచివి.
*రాత్రి ముహూర్తములు*
శ్లో:- రాత్రౌపంచద శేశ్వరాజచరణాహిర్బుధ్న్యపూషాభిథా
నాసత్యాంతకవహ్ని ధాతృశశిన శ్చాదిత్యజీవాచ్యుతాః
అర్కత్వష్టృసమీరణా శ్శుభవిదౌ చత్వార ఏవాశుభాః
రౌద్రాజాంఘ్రియమాగ్నయో యదుడుపో యస్మిన్ క్షణేయత్ఫలమ్
తాత్పర్యము:- ప్రతి రాత్రియు 15 ముహూర్తము లుండును. అందు 1.ఈశ్వర, 2.అజచరణ,
3.అహిర్భుధ్న్య 4.పూష, 5.నాసత్య, 6.అంతక, 7.వహ్ని, 8.ధాత, 9.శశి, 10.ఆదిత్య, 11.జీవము, 12.అచ్యుతము, 13.అర్కము,
14.త్వష్టము, 15.సమీకరణము అను 15 రాత్రి ముహూర్తములు.
ఇందు 1, 2, 6, 7, శుభఫలములనీయవు. నక్షత్రాధిపతులు, ముహూర్తాధిపతులు ఫలములు సమానముగా నిత్తురు. ఏనక్షత్రమే యేశుభములకు తగునో యానక్షత్రాధిపతియున్న ముహూర్తము శుభఫలము నిచ్చును.
Comments
Post a Comment