వార దుర్ముహూర్తములు వాటి దోషములు*

వార దుర్ముహూర్తములు వాటి దోషములు;

 శ్లో:- ఆదిత్యేర్యమనామక శ్శశిదినే బ్రహ్మసురాఖ్యేకుజే
        పిత్రాఖ్యానలసంజ్ఞితౌ బుధదినేస్యాచ్చే న్ముహూర్తోభిజిత్
        దైత్యాహౌ గరువాసరేభృగుదినే బ్రహ్మ్యాఖ్యపిత్ర్యౌశనౌ
        రౌద్రాహిత్వఖి లేశుభేనిధనదాస్తే దురుముహూర్తాః క్రమాత్
తాత్పర్యము:- ఆదివారము అ ముహూర్తము దోషము, సోమవారం బ్రహ్మా సురములు, మంగళవారము పగలు దైత్యము రాత్రి అగ్నిదోషము, బుధవారం అభిజిత్తు, గురువారం దైత్యము అహియును, శుక్రవారం బ్రహ్మపిత్ర్యములు, శనివారము రుద్రాహి యివి వార దుర్ముహుర్తములు పేర్లు. కాన ఈ 12 దుర్ముహూర్తములందు వివాహాది శుభకార్యములు జరుపరాదు.
  *హోరాధిపతులు*
 శ్లో:- యద్వారేచ యదిష్టకాల ఘటికా ద్విఘ్నా శ్శరాప్తాగతాః
       పూర్వాంశా అథవర్తమానసమయస్స్యాత్కాలహోరాక్రమాత్
       వారేశాదిరవిర్భృ గుర్భుధవిధూమందోగురుర్మంగళ
       శ్చేత్పాపగ్రహకాలపానిధనిదాస్త్యాజ్యావివాహిదిషు
తాత్పర్యము:- ఉదయాది ఘడియలు 2చే గుణించి 5చే భావింపగ వచ్చిన శేషము హోరయగును. ఏ వారమునకైనా హోర కావారాధిపతి మొదటిహోరకధిపతి. 2వ హోరకు 6వ గ్రహము, 8వ హోరకు 7వ గ్రహము క్రమముగా హోరాధిపతులగుదురు. అర్థరాత్రినుండి హోర చూడవచ్చును యని కొందరన్నను యది సరికాదు. హోరాకాలము 2 ½ ఘడియలు. అనగా 5 అరఘడియలు యీ 5 అరఘడియలకూ ప్రత్యేకముగా అంతరోవ్వారాధిపతులుందురు. ఉదాహరణమునకు సూర్యహోరలోని 5 అరఘడియలకూ సూర్య, చంద్ర అంగారక, బుధ, బృహస్పతులు అధిపతులు. అట్లే చంద్రహోరలోని 5 అరఘడియలకు వరుసగా చంద్రాంగారక, బుధ, గురు, శుక్రులధిపతులు. అట్లే తక్కిన హోర లెరిగి మసలుకొనవలెనని భావము.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: