నరాకార చక్రము

“నరాకార చక్రము”

గ్రామ నక్షత్రము నుండి, నామ నక్షత్రము వరకు లెక్కించగా వచ్చిన సంఖ్యను బట్టి ఆగ్రామము మీకు సరిపోతుందా లేదా అనేది నిర్ణయించాలి. నరుని శిరము నుండి వివిధ అంగాలకు వివిధ నక్షత్రాలను ఊహ చేసెడి చక్రము కనుక “నరాకార చక్రము” అని దీనికి పేరు.

శ్లోకం : శిరః పంచార్ధ లాభం, ముఖేత్రీ అర్ధ నాశనం మ, బాణరో
ధన దాన్యంచ పాదయో షట్ దరిద్రః ప్రుష్టేకం ప్రాణ సందేహం
చతుర్నాభి శుభావహం, నేత్రే ద్వి ప్రీతి లాభంచ,
సవ్యహస్తేన సంపదా, వామ హస్తనే దరిద్రః

      శిరస్సు నందు 5 నక్షత్రములు ధన లాభమును, ముఖము నందు 3 నక్షత్రములు ధన నష్టమును, గర్భమునందు 5 నక్షత్రములు ధన ధాన్య సమృద్ధిని, పాదముల యందు 6 నక్షత్రములు దరిద్రమును, పృష్టం నందు 1 నక్షత్రము ప్రాణ నష్టమును, నాభి యందు 4 నక్షత్రములు శుభమును, నేత్రముల యందు 2 నక్షత్రములు ప్రీతిని, కుడి చేతి యందు 1 నక్షతము సంపదను, ఎడమ చేతియందు 1 నక్షత్రము దరిద్రమును కలుగజేయును.

ఉదాహరణకు : వారాసీ గూడ అనే ఊరిలో రామారావు ఉండాలనుకుంటున్నాడు. ‘వా’ అంటే రోహిణీ నక్షత్రము, ‘ర’ అంటే చిత్త నక్షత్రము వస్తుంది. రోహిణి నుండి లెక్కిస్తే చిత్త 11 వ నక్షత్రం అవుతుంది. మొదటి 5 ధనలాభం, తరువాత 3 ధన నష్టం, తరువాతి 5 ధనధాన్య సమృద్ధి కనుక రామారావు వారాసీ గూడాలో నిరభ్యంతరముగా ఉండవచ్చు.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: