పితృదేవతలు ఎవరు?: ఎక్కడుంటారు ?

పితృదేవతలు ఎవరు?: ఎక్కడుంటారు ?

తండ్రి, తాత, ముత్తాతలకు పితరులు' అనే శబ్దం వాడతాం. వారి అధిష్టాన దేవతలైన వసు, రుద్ర, ఆదిత్యులను కూడా పితృదేవతలు అంటాం. వీరిలో అనేకరకాలు - అంగిరసులు, వైరూపులు, అథర్వణులు, భృగువులు, నవగ్వులు, దశగ్యులుగా ఋగ్వేదంలో చెప్పబడ్డారు.

బ్రాహ్మణుల యొక్క పితరులు అగ్నిష్వాత్తులని, క్షత్రియల యొక్క పితరులు బర్దిషదులని, వైశ్యుల యొక్క పితరులు కావ్యలని, శూద్రుల యొక్క పితరులు సుకాలినులు అని నంది పురాణంలో హేమాద్రి పేర్కొన్నాడు. 

శాతాతసృతి 12 పితృవర్గాలను వివరిస్తుంది. విష్ణు ధర్మోత్తరాన్ని బట్టి కొంతమంది పితృదేవతలు మూర్తి లేక ఉంటారట. కొంతమంది మూర్తి కలిగి ఉంటారట.

ఋషుల నుండి పితృదేవతలు, వారినుండి దేవతలు, వారినుండి మానవులు పుట్టినట్లు మనువు చెప్పాడు.

దేవతలు తూర్పుకు, పితృదేవతలు దక్షిణపు దిక్కుకు, మానవులు పశ్చిమ దిక్కుకు, రుద్రులు ఉత్తరపు దిక్కుకు చెందిన వారని తైత్తిరీయ సంహిత" అంటుంది.

దేవతలకు స్వహావషట్కారాలతో, పితృదేవతలకు స్వధానమస్కారాలతో పూజ జరుగుతుంది.

వీరెక్కడ ఉంటారు? భూలోకం పైన అంతరిక్షం, ఆపైన పితృలోకం ఉంటుందని తైత్తిరీయ బ్రాహ్మణం చెబుతుంది. "విధూర్ధ్వలోకే పితరో వసంతి" చంద్రమండలం పైన పితృగణాలు ఉంటారు. చంద్రలోకం జల మయమైనది. జలమయమైన లోకమంటే పైన అగ్ని ష్వాత్తాది పిత్స గణాలు ఉంటారని భాగవతం అంటుంది.

ఇక అథర్వవేదంలో ఇలా ఉంది"ఉదస్వతీ ద్యౌరవమా పేలుమతీతి మధ్యమా తృతీయహ ప్రద్యౌరితి యస్యాం పితర ఆసతే" ఆకాశం మొదటి కక్ష్యను 'అవమ' అంటారు. అది జలమయమైనది. మధ్యమ కక్ష్యను పిలమతి' అని పిలుస్తారు.

అంటే- పరమాణు రూపమైనది. తృతీయ కక్ష్యకు ప్రద్యౌ అని పేరు. అది ప్రకాశమయం. అందులో పితరులు ఉంటారు.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: