వాన పలుకులు 💦💦💦
వాన పలుకులు 💦💦💦
వానల కాలం.. వానలు కురుస్తున్నాయి. ఎప్పుడూ ఒకే వాన కురిస్తే ఎలా? ఇన్ని రకాల వానలు కురిస్తే ఎంత బాగుంటుందో కదా!
* గాంధారి వాన = కంటికి ఎదురుగా ఉన్నది కనిపించనంత జోరుగా కురిసే వాన.
* మాపుసారి వాన = సాయంత్రం కురిసే వాన.
* మీసరవాన = మృగశిరకార్తెలో కురిసే వాన.
* దుబ్బురువాన = తుప్పర/తుంపర వాన.
* సానిపి వాన = అలుకు(కళ్లాపి) జల్లినంత కురిసే వాన.
* సూరునీల్ల వాన = ఇంటి చూరు నుండి ధార పడేంత వాన.
* బట్టదడుపు వాన = ఒంటి మీదున్న బట్టలు తడిపేంత వాన.
* తెప్పెవాన = ఒక చిన్న మేఘం నుంచి పడే వాన.
* సాలు వాన = ఒక నాగలిసాలుకు సరిపడా వాన.
* ఇరువాలు వాన = రెండుసాల్లకు & విత్తనాలకు సరిపడా వాన.
* మడికట్టు వాన = బురదపొలం దున్నేటంత వాన.
* ముంతపోత వాన = ముంతతోటి పోసినంత వాన.
* కుండపోత వాన = కుండతో కుమ్మరించినంత వాన.
* ముసురు వాన = విడువకుండా కురిసే వాన.
* దరోదరి వాన = ఎడతెగకుండా కురిసే వాన.
* బొయ్య బొయ్య గొట్టే వాన = హోరుగాలితో కూడిన వాన.
* రాళ్ల వాన = వడగండ్ల వాన.
* కప్పదాటు వాన = అక్కడక్కడా కొంచెం కురిసే వాన.
* తప్పడ తప్పడ వాన = టపటపా కొంచెంసేపు కురిసే వాన.
* దొంగ వాన = రాత్రంతా కురిసి తెల్లారి కనిపించని వాన.
* కోపులు నిండే వాన = రోడ్డు పక్కన గుంతలు నిండేంత వాన.
* ఏక్దార వాన = ఏకధారగా కురిసే వాన.
* మొదటివాన = విత్తనాలకు బలమిచ్చే వాన.
* సాలేటి వాన = భూమి తడిసేంత భారీ వాన.
* సాలు పెట్టు వాన = దున్నేందుకు సరిపోయేంత వాన.
Comments
Post a Comment