రాజయెాగములు
రాజయెాగములు
కారకాంశము, జన్మలగ్నము రెంటి నుండి రాజయెాగకారక స్ఫుటగ్రహములనుబట్టి యెాగవిచారణ చేయవలేను. ఆత్మకారక పుత్రకారకులవలన ఒకటి, లగ్నపంచమాధిపతులవలన రెండు, యెాగములు కలుగును. వీరి పరస్పర సంబంధము బలానుసారముగా పూర్ణము, అర్థ, (1/2) పాద (1/4) యెాగము కలుగును.
మహరాజయెాగము
లగ్నాధిపతి పంచమమున, పంచమాధిపతి లగ్నమున ఉండుట, ఆత్మకారక పుత్రకారక గ్రహములు లగ్న, పంచమ, స్వక్షేత్ర, నవాంశ, ఉచ్ఛరాశులందుండుట; శుభగ్రహములచే చూడబడుట మహరాజయెాగము. దీనిలో పుట్టిన జాతకుడు ప్రసిద్ధుడు, సుఖవంతుడు అగును. భాగ్యాధిపతి ఆత్మకారకగ్రహమున్న, లగ్న, పంచమ, సప్తమములందుండి శుభగ్రహ దృష్టిఉన్న రాజయెాగ కారకులగుదురు. కారకుని నుండి కాని,లగ్నాధిపతి నుండి కాని, 2, 4, 5, స్థానములందు శుభగ్రహములున్న తప్పక మహారాజగును. వారినుండి 3, 6 స్థానములందు కేవల పాపగ్రహములున్నా, చూచినా, రాజగును. శుభ పాప మిశ్ర దృష్టియున్న ధనవంతుడగును.
Comments
Post a Comment