బాలారిష్టములు
బాలారిష్టములు
శ్లో) భౌమాంశకస్థితేమందే భౌమేనైవనిరీక్షితే,
రాహుదృష్టియుతేవాపి వర్షమేకంసజీవతి.
శుక్రాంశకస్థితేమందే శుక్రేణైవనిరీక్షితే,
కేతుదృష్టియుతేవాపి త్రివర్షంతస్యజీవితమ్,
సౌమ్యాంశకస్థితేమందే సౌమ్యేనైవనిరీక్షితే,
సూర్యదృష్టియుతేవాపి త్రివర్షంతస్యజీవితం.
అర్కాంశకస్థితేమందే అర్కేణైవనిరీక్షితే,
కావ్యదృష్టియుతేవాపి చాతుర్వర్షంచజీవతి,
చంద్రాంశకస్థితేమందే చంద్రేణైవనిరీక్షితే,
దేహాధిపేనసందృష్టే షడ్వర్షంతస్యజీవితమ్,
అధవాచాష్టమేవర్షే నజీవతినసంశయః,
జీవాంశకస్థితేమందే జీవేనైవనిరీక్షితే,
చంద్రదృష్టియుతేవాపి చాతుర్వర్షంసజీవతి.
తా) జనన కాల మందు శని అంగారక అంశము నందుండి అంగారకునిచే చూడబడిననూ లేక రాహువుచే చూడబడిననూ ఆశిశు 1 సంవత్సరం జీవించి యుండును,
మరియు శని శుక్రాంశమునందుండి శుక్రునిచే చూడబడిననూ లేక కేతువుచే చూడబడిననూ 3 సంవత్సరముల వరకు జీవించియుండును, మరియు శని బుధాంశము నందుండి బుధునిచే చూడబడిననూ లేక సూర్యుని చూడబడిననూ 3 సంవత్సరముల వరకు జీవించి యుండును, మరియు శని సూర్యాశమునందుండి సూర్యునిచే చూడబడిననూ లేక శుక్రునిచే చూడబడిననూ 4 సంవత్సరములు జీవించి యుండును, మరియు శని చంద్రాంశం నందుండి చంద్రునిచే చూడబడిననూ లేక దేహాధిపతిచే చూడబడిననూ 6 సంవత్సరముల వరకు జీవించి యుండును, లేక 8 వ సంవత్సరము తప్పక మరణం పొందును మరియు శని గురువు యొక్క అంశమునందుండి గురువుచే చూడబడిన లేక చంద్రునిచే చూడబడిననూ 4 సంవత్సరముల వరకు జీవించియుండును.
Comments
Post a Comment