దసరా మూడవరోజు చంద్రఘంట (శ్రీ అన్నపూర్ణాదేవి)...3
దసరా మూడవరోజు చంద్రఘంట (శ్రీ అన్నపూర్ణాదేవి)...3
(శ్రీదుర్గామాత ) శ్రీ అన్నపూర్ణాదేవి గఠఠషోడశోపచార పూజవిధి.
హరిః ಓమ్, ఓం శ్రీ మహాగణాధిపతయేనమః.
ఓం శ్రీ గురుభ్యోన్నమః.
ఓం దీపారాధనం కృత్వా --
ఓం ఉద్దీప్య స్వజాత వేదోపఘ్నం గ మమ ।
పశూగ్ శ్చ మహ్య మావహ జీవనం చ దిశోదిశ॥
(అని దీపమును వెలిగింౘవలెను)
శ్లో॥ భో దీప బ్రహ్మ రూపేణ సర్వేషాం హృది సంస్థితః।
అతస్త్వాం స్థాపయామ్యద్య మదఙ్ఞానముపాకురు ॥
శ్లో॥ భో దీప బ్రహ్మ రూపోసి అంధకార నివారక ।
మయాకృత మిదం స్తోత్రం గృష్ణీష్వ వరదోభవ ॥
(అని దీపమునకు కుంకుమ పుష్పాక్షతలుంచి
నమస్కరింౘవలెను)
శ్లో॥ ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతో√పి వా ।
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యంభ్యంతరః శుచిః॥
ఓం పుండరీకాక్ష, పుండరీకాక్ష, పుండరీకాక్షాయ నమః ।
(పై మంత్రమును చెప్పుచూ మూడుసార్లు జలమును శిరము పైనను, తన చుట్టూ ౘల్లుకొనవలెను)
ఓం దేవీం వా చ మజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవోవదంతి।
సానో మంద్రేష మూర్జందుహానా ధేనుర్వాగస్మా నుపసుష్టుతైతు ॥
అయం ముహూర్తః సుముహూర్తో అస్తు.
శుక్లాంబరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం।
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే॥
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం ।
అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే॥
శ్లో॥ సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ
సాధికే ।
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి
నమోస్తుతే ॥
ఓం శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః।
ఓం శ్రీఉమామహేశ్వరాభ్యాం నమః।
ఓం శ్రీవాణీహిరణ్యగర్భాభ్యాం నమః।
ఓం శ్రీశచీపురందరాభ్యాం నమః।
ఓం శ్రీఅరుంధతీవసిష్ఠాభ్యాం నమః।
ఓం శ్రీఇంద్రాద్యష్టదిక్పాలక దేవతా భ్యోన్నమః। ఓం శ్రీఆదిత్యాదినవగ్రహదేవతాభ్యో నమః ।
ఓం శ్రీగ్రామ దేవతాభ్యో నమః ।
ఓం శ్రీక్షేత్రాధిష్ఠానదేవతాభ్యో నమః।
ఓం శ్రీకుల దేవతాభ్యో నమః।
ఓం శ్రీమాతాపితృభ్యో నమః।
ఓం శ్రీసర్వేభ్యో మహాజనేభ్యో నమః। అవిఘ్నమస్తు ॥
ఘంటానాదం
శ్లో || ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రాక్షసామ్ |
కుర్యాత్ ఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్ ||
ఇతి ఘంటానాదం కృత్వా (ఘంటానాదం చేయవలెను)
[అంటే దేవతలు ఉండే చోట రాక్షసులు ఉండరు కదా. ఈ పరమ పవిత్రమైనటువంటి ప్రదేశంలో దుష్టశక్తులు ఉండకూడదు కాబట్టి మీరు ఇక్కడనుండి వెళ్ళిపొండి అని గంట కొట్టి దేవతలను లాంఛనంగా ఆహ్వానించడానికి గంటానాదం చేయడం జరుగుతుంది]
ఆచమనీయం
( స్త్రీలైతే స్వాహా అనరాదు నమః అనాలి)
ఓం కేశవాయస్వాహా --- {అని తీర్ధం తీసుకోవాలి}
ఓం నారాయనాయస్వాహా --- {అని తీర్ధం తీసుకోవాలి}
ఓం మాధవాయస్వాహా --- {అని తీర్ధం తీసుకోవాలి}
ఓం గోవిందాయనమః --- {అనుచూ నీళ్ళను క్రిందకు వదలవలెను.}
{తదుపరి నమఃస్కారం చేయుచు యీ మంత్రములను పఠించవలెను}
ఓం విష్ణవే నమః,
ఓం మధుసూదనాయ నమః,
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః,
ఓం శ్రీధరాయ నమః,
ఓం హృషీకేశాయ నమః
ఓం పద్మనాభాయ నమః,
ఓం దామోదరాయ నమః,
ఓం సంకర్షణాయ నమః,
ఓం వాసుదేవాయ నమః,
ఓం ప్రద్యుమ్నాయ నమః
ఓం అనిరుద్ధాయ నమః,
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అధోక్షజాయ నమః,
ఓం నారసింహాయ నమః
ఓం అచ్యుతాయ నమః,
ఓం జనార్ధనాయ నమః,
ఓం ఉపేంద్రాయ నమః,
ఓం హరయే నమః ,
ఓం శ్రీకృష్ణాయ నమః,
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ---
( అని కొంచెం నీళ్ళు పళ్ళెములో విడువవలెను)
భూతోచ్ఛాటనము
శ్లో॥ అపసర్పంతు యే భూతా యే భూతా భూమి సంస్థితాః।
యే భూతా విఘ్నకర్తారః తే నశ్యంతు శివాఙ్ఞయా ॥
శ్లో॥ అపక్రామంతు భూతాద్యాః పిశాచ సర్వతో దిశాం ।
సర్వేషామ్ అవిరోధేన పూజాకర్మా సమారభే ॥
శ్లో|| ఉత్తిష్ఠంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః |
ఏతేషామ్ అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ||
{భూతోచ్చాటన మంత్రము చదువుతూ కొన్ని అక్షతలు వాసన చూసి వెనుకకు వేసుకోవలెను}
ప్రాణాయామం
శ్లో|| ఓం భూ: | ఓం భువః | ఓం సువః | ఓం మహః |
ఓం జనః | ఓం తపః | ఓం సత్యం |
ఓం తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః
ప్రచోదయాత్ ||
ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ ||
{ అను మంత్రమును చదువుతూ 3సార్లు ప్రాణాయామము చేయవలెను }
సంకల్పం
(పుష్పాక్షతలు చేతిలో పట్టుకుని సంకల్పము చెప్పవలెను)
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా
శ్రీ అన్నపూర్ణా దేవతా ముద్దిశ్య,
శ్రీ అన్నపూర్ణా దేవతా ప్రీత్యర్ధం, శుభే శోభనే ముహూర్తే శ్రీమహావిష్ణోరాఙ్ఞయా ప్రవర్తమానస్య - అద్యబ్రహ్మణః ద్వితియ పరార్ధే , శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే - కలియుగే, ప్రథమపాదే జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోర్దక్షిణ దిగ్భాగే, శ్రీశైలస్య వాయవ్య/ఈశాన్య ప్రదేశే, కృష్ణా/కావేర్యోః/గంగా/గోదావర్యోః మధ్యదేశే _కావేరీ___నదీసమీపే, స్వగృహే/శోభనగృహే సమస్త దేవతా, బ్రాహ్మణ, హరిహర, గురుచరణ సన్నిధౌ, అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన , ప్రభవాది షష్ఠీ సంవత్సరాణాం మధ్యే శ్రీశుభకృతు నామ సంవత్సరే దక్షి ణాయనే శరత్ ఋతౌ , ఆశ్వయుజ మాసే, శుక్ల పక్షే తదియ తిథౌ సౌమ్య___వాసరే శుభ నక్షత్రే, శుభ యోగే, శుభ కరణే, ఏవం గుణవిశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీమాన్ ______ గోత్రః (గోత్రం) అహం__________ నామ ధేయస్య (పేరు) ధర్మ పత్ని ______________ నామ ధేయవతీ (పేరు)( పురుషులైనచో గోత్రస్య, నామధేయస్య అనియు, స్త్రీలైనచో గోత్రవతీ, నామధేయవతీ అని చెప్పవలెను) అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్ధం, ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ధ్యర్ధం, అభీష్ట సిద్ధ్యర్ధం, సర్వాపదాం నివారణార్ధం, సకలకార్య విఘ్న నివారణార్ధం, సత్సంతాన సౌభాగ్య శుభఫల సిద్ధ్యర్ధం, , చింతిత మనోరథ సిద్ధ్యర్థం శ్రీ అన్నపూర్ణా దేవతా ముద్దిశ్య, శ్రీ అన్నపూర్ణా దేవతా ప్రీత్యర్థం యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే.
{అని సంకల్పించి అక్షతలు నీరు కలిపి పళ్ళెములో విడువవలెను}
ఆదౌ నిర్విఘ్నేన పూజా పరిసమాప్త్యర్ధం మహా గణాధిపతి పూజాం కరిష్యే, తదంగ కలశారాధనం కరిష్యే.
కలశపూజ
తదంగ కలశారాధనం కరిష్యే , కలశం గంధపుష్పాక్షతైరభ్యర్ఛ్య
( మనము ఆచమనము చేసినటువంటి పంచపాత్రలోని నీళ్ళు దేవుని పూజకు వినియోగించరాదు. పూజకు విడిగా ఒక కలశము (చెంబు ) తీసుకుని దానిలో శుద్ధ జలమును పోసి కలశమునకు గంధం, కుంకుమ బొట్లు పెట్టి, కలశంలో తులసిదళము, ఒక పువ్వు, కొద్దిగా అక్షతలు వేసి, కుడి చేతితో కలశంను మూసి పెట్టి, ఈ క్రింది మంత్రాలను చెప్పవలెను}
శ్లో|| కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః।
మూలే తత్ర స్థితోబ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతాః॥
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా
వసుంధరా ।
ఋగ్వేదో థ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః॥
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః |
ఆయాంతు దేవపూజార్థం మమ దురితక్షయ కారకాః ॥
గాయత్రీచైవ సావిత్రీ శాంతిః పుష్ఠి కరీ తథా।
ఆయాంతు దేవపూజార్థం మమ దురితక్షయ కారకాః ॥
గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి |
నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు ||
కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి ।
భాగీరథీతి విఖ్యాతాః పంచగంగా
ప్రకీర్తితాః ॥
ఓం భూర్భువస్సువో, భూర్భువస్సువో, భూర్భువస్సువః
కలశోదకేన పూజాద్రవ్యాణి, దేవం, ఆత్మానం చ సంప్రోక్ష్య.
(పుష్పముతో కలశజలమును పూజా ద్రవ్యములపై, దేవతపై, చివరగా తనపై చల్లుకొనవలెను)
ఆదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే.
(గణపతి విగ్రహమున్నచో పూజింపవచ్చు, లేక పసుపుతో గణపతిని చేసి తమలపాకు పై పెట్టి సర్వ విఘ్నశాంతికై పూజింౘ వలెను)
అథ గణపతి పూజ
మం : ఓం గణానాంత్వా గణపతిగ్ం హవామహే
కవింకవీనాముపమశ్రవస్తమమ్ ।
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన
శ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్॥
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి.
శ్లో॥ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవో సర్వ కార్యేషు సర్వదా॥
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఆవాహయామి.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః సువర్ణ ఖచిత సింహాసనం సమర్పయామి.
శ్రీ మహాగణాధిపతి వద్ద పుష్పము నుంచ వలెను.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః పాదారవిందయోః పాద్యం సమర్పయామి.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోరర్ఘ్యం సమర్పయామి.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఆచమనీయం సమర్పయామి.
మం॥ ఓం ఆపోహిష్ఠా మయోభువః తాన ఊర్ఝే దధాతన
మహేరణాయచక్షసే । యోవశ్శివ తమోరసః ।
తస్యభాజయతే హనః । ఉశతీరవ మాతరః।
తస్మాత్ అరంగమామవః । యస్యక్షయాయ జిన్వధ
ఆపోజనయధాచనః ॥
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః స్నానం పరికల్పయామి(శుద్ధోదక స్నానం)
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దివ్య శ్రీచందనం సమర్పయామి.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః గంధస్యోపరి కుంకుమం సమర్ప యామి. పుష్పమాలాం సమర్పయామి.
పుష్పైః పూజయామి
ఓం సుముఖాయ నమః,
ఓం ఏకదంతాయ నమః,
ఓం కపిలాయ నమః,
ఓం గజకర్ణికాయ నమః,
ఓం లంబోదరాయ నమః,
ఓం వికటాయ నమః,
ఓః విఘ్నరాజాయ నమః,
ఓం గణాదిపాయ నమః,
ఓం ధూమకేతవే నమః,
ఓం గణాధ్యక్షాయ నమః,
ఓం ఫాలచంద్రాయ నమః,
ఓం గజాననాయ నమః,
ఓం వక్రతుండాయనమః,
ఓం శూర్పకర్ణాయ నమః,
ఓం హేరంబాయ నమః,
ఓం స్కందపూర్వజాయ నమః,
ఓం సర్వసిద్ది ప్రదాయకాయ నమః,
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః షోడశనామపూజాం సమర్పయామి.
ధూపం
శ్లో॥ వనస్పత్యుద్భవైః దివ్యైః నానా గంధైస్సు సంయుతమ్ ।
ఆఘ్రేయస్సర్వ దేవానాం ధూపోయం ప్రతిగృహ్యతామ్॥
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపమాఘ్రాపయామి
దీపం
శ్లో॥ సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా।
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహమ్ ॥
భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే।
త్రాహిమాం నరకాద్ ఘోరా ద్దివ్యజ్యోతిర్నమోస్తుతే॥
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి. ధూప, దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి.
నైవేద్యం
భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయ మేవ చ।
ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం గణాధిప ॥
ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
(నీరు నివేదన చుట్టూ చల్లుతూ) ఓంసత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు అమృతో పస్తరణమసి…నీరు నివేదన చుట్టూ చల్లుతూ) ఓంసత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు అమృతో పస్తరణమసి…
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అమృత నివేదనం సమర్పయామి గుడోపహారం నివేదయామి,.....ఫలం సమర్పయామి
ఓం ప్రాణాయ స్వాహా,
ఓం అపానాయ స్వాహో,
ఓం వ్యానాయ స్వాహా,
ఓం ఉదానాయ స్వాహా,
ఓం సమానాయ స్వాహా,
ఓం బ్రహ్మేణ్యే స్వాహా
మధ్యే మధ్యే ఉదక పానీయం సమర్పయామి.(నీటిని వదలాలి).
అమృతాపిధానమసి ఉత్తరాపోశనం సమర్పయామి
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః హస్తౌ ప్రక్షాళయామి..నీరువదలాలి.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః పాదౌ ప్రక్షాళయామి.. నీరువదలాలి.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శుద్దఆచమనీయం సమర్పయామి.
తాంబూలం
పూగీ ఫలైః సకర్పూరం నాగవళ్ళీ దళైర్యుతమ్।
ముక్తా చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగుహ్యతామ్॥
శ్రీ మహాగణాథిపతయే నమ: తాంబూల,
దక్షిణాం సమర్పయామి.
తాంబూలానంతరం ఆచమనం సమర్పయామి.
నీరాజనం
ఘృతవర్తిసహస్రైశ్చ కర్పూర శకలైస్తథా ।
నీరాజనం మయా దత్తం గృహాణ వరదోభవ॥
శ్రీ మహాగణాథిపతయే నమ: కర్పూర నీరాజనం దర్శయామి.
మంత్రపుష్పం
ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి ।
తన్నో దంతిః ప్రచోదయాత్ ॥
ఓం శ్రీ మహాగణాధిపతయేనమః దివ్య సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి.
ఆత్మప్రదక్షణ నమస్కారాన్ సమర్పయామి
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప ।
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే॥
అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణపతిర్దేవతా సుప్రీతా స్సుప్రసన్నో వరదోభవతు।
శ్రీ మహాగణపతి అనుగ్రహ సిద్ధిరస్తు, ఉత్తరే శుభకర్మణ్య నిర్విఘ్నమస్తు,
శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి.
శ్రీ అన్నపూర్ణా దేవతా పూజా ప్రారంభం
ధ్యానం:
శ్లో || చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే
పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః
(శ్రీ దుర్గాదేవ్యై నమః ) శ్రీ అన్నపూర్ణాదేవ్యైనమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి
(పుష్పము వేయవలెను).
ఆవాహనం:
ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజితస్రజాం
చంద్రాం హిరణ్మయీం జాతవేదో మ మావహ
శ్లో || శ్రీ వాగ్దేవిం మహాకాళిం మహాలక్ష్మీం సరస్వతీం
త్రిశక్తిరూపిణీ మంబాం దుర్గాంచండీం నమామ్యహమ్
(శ్రీ దుర్గాదేవ్యైనమః) శ్రీ అన్నపూర్ణాదేవ్యైనమః ఆవాహయామి (పుష్పము వేయవలెను).
ఆసనం:
తాం ఆవహజాతదో లక్ష్మీమనపగామినీమ్ యస్యాం హిరణ్యం
విందేయంగామశ్వం పురుషానహమ్
శ్లో || సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే
రత్న సింహాసనమిధం దేవీ స్థిరతాం సురపూజితే.
(శ్రీ దుర్గాదేవ్యైనమః ) శ్రీ అన్నపూర్ణాదేవ్యైనమః ఆసనం సమర్పయామి.
(అక్షతలు వేయవలెను.)
పాద్యం:
అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రభోధినీం
శ్రియం దేవీముపహ్వమే శ్రీర్మాదేవిజుషతాం
శ్లో || సువాసితం జలంరమ్యం సర్వతీర్థ సముద్భవం
పాద్యం గృహణ దేవీ త్వం సర్వదేవ నమస్కృతే
(శ్రీ దుర్గాదేవ్యైనమః ) శ్రీ అన్నపూర్ణాదేవ్యైనమః పాదయోః పాద్యం సమర్పయామి.
(నీరు చల్లవలెను.)
అర్ఘ్యం:
కాంసోస్మి తాం హిరణ్య ప్రాకార మార్ద్రాంజ్వలంతిం తృప్తాం తర్పయంతీం
పద్మేస్ఠఃతాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం
శ్లో || శుద్దోదకం చ పాత్రస్థం గంధపుష్పాది మిశ్రితం
అర్ఘ్యం దాశ్యామి తే దేవి గృహణ సురపూజితే
(శ్రీ దుర్గాదేవ్యైనమః ) శ్రీ అన్నపూర్ణాదేవ్యైనమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి
(నీరు చల్లవలెను.)
ఆచమనం:
చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియంలోకేదేవజుష్టా ముదారం
తాం పద్మినీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీ ర్మేనశ్యతాం త్వాం వృణే.
శ్లో || సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతాం
మధుపర్కం గృహాణత్వాం దుర్గాదేవి నమోస్తుతే
(శ్రీదుర్గాదేవ్యైనమః ) శ్రీ అన్నపూర్ణాదేవ్యైనమః ఆచమనీయం సమర్పయామి
(నీరు చల్లవలెను.)
పంచామృతం:
(పెరుగు, తేనె, నేయి, నీరు, పంచదార వీనిని పంచామృతం అంటారు.)
శ్లో || మధ్వాజ్యదధిసంయుక్తం శర్కరాజలసంయుతం
మధుపర్కం గృహాణత్వం దుర్గాదేవి నమోస్తుతే
మధుపర్కం:
(శ్రీ దుర్గాదేవ్యైనమః ) శ్రీ అన్నపూర్ణాదేవ్యైనమః మధుపర్కం సమర్పయామి
(పంచామృత స్నానానికి ముందుగా దీనిని దేవికి నివేదన చేయాలి. పంచామృతాలతో సగం అభిషేకించి మిగిలిన దనిని దేవికి నైవేద్యంలో నివేదన చేసి స్నాన జలంతో కలిపి ప్రసాద తీర్ధంగా తీసుకోవాలి.)
పంచామృతస్నానం:
క్షీరము
శ్లో || ఓం ఆప్యాయస్య సమేతు తే విశ్వతస్సోమ
వృష్ణియంభవావాజస్య సంగథే
(శ్రీ దుర్గాదేవ్యైనమః) శ్రీ అన్నపూర్ణాదేవ్యైనమః క్షీరేణ స్నపయామి.
(దేవికి పాలతో స్నానము చేయాలి)
దధిః
శ్లో || ఓం దధిక్రావుణ్ణో అకారిషం జిష్ణరశ్వస్య వాజినః
సురభినో ముఖాకరత్ప్రన ఆయూగం షి తారిషత్
(శ్రీ దుర్గాదేవ్యైనమః ) శ్రీ అన్నపూర్ణాదేవ్యైనమః దధ్నా స్నపయామి.
(దేవికి పెరుగుతో స్నానము చేయాలి)
ఆజ్యం
శ్లో || ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్సవితోత్పునా
తచ్చి ద్రేణ పవిత్రేణ వసోస్సూర్యస్య రశ్శిభిః
(శ్రీ దుర్గాదేవ్యైనమః ) శ్రీ అన్నపూర్ణాదేవ్యైనమః అజ్యేన స్నపయామి.
(దేవికి నెయ్యితో స్నానము చేయాలి)
మధుః
శ్లో || ఓం మధువాతా ఋతాయతే మధుక్షరంతి సింధవః
మాధ్వీర్నస్సంత్వోషధీః, మధునక్తముతోషసి మధుమత్పార్థివగంరజః
మధుద్యౌరస్తునః పితా, మధుమాన్నొ వనస్పతిర్మధుమాగుం
అస్తుసూర్యః మాధ్వీర్గావో భ్వంతునః
(శ్రీ దుర్గాదేవ్యైనమః) శ్రీ అన్నపూర్ణాదేవ్యైనమః మధునా స్నపయామి.
(దేవికి తేనెతో స్నానము చేయాలి)
శర్కరః
శ్లో || ఓం స్వాదుః పవస్వ దివ్యాజన్మనే స్వాదురింద్రాయ సుహవీతునమ్నే,
స్వాదుర్మిత్రాయ వరుణాయవాయవే బృహస్పతయే మధుమాగం అదాభ్యః
(శ్రీ దుర్గాదేవ్యైనమః) శ్రీ అన్నపూర్ణాదేవ్యైనమః శర్కరేణ స్నపయామి.
(దేవికి పంచదారతో స్నానము చేయాలి)
ఫలోదకస్నానం:
శ్లో || యాః ఫలినీర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః
బృహస్పతి ప్రసూతాస్తానో ముంచన్త్వగం హసః
శ్రీ దుర్గాదేవ్యైనమః శ్రీ అన్నపూర్ణాదేవ్యైనమః ఫలోదకేనస్నపయామి.
(దేవికి కొబ్బరి నీళ్ళుతో స్నానము చేయాలి)
(శ్రీదుర్గాదేవ్యైనమః )పంచామృత స్నానం సమర్పయామి
పంచామృతస్నానానంతరం
శుద్దోదక స్నానం
శ్లో || ఆదిత్యవర్ణే తపోసోధి జాతో వనస్పతి స్తవవృక్షో థబిల్వః
తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీ
శ్లో || గంగాజలం మయానీతం మహాదేవ శిరస్ఠఃఇతం
శుద్దోదక మిదం స్నానం గృహణ సురపూజితే
(శ్రీ దుర్గాదేవ్యైనమః ) శ్రీ అన్నపూర్ణాదేవ్యైనమః శుద్ధోదకస్నానం సమర్పయామి
(దేవికి నీళ్ళుతో స్నానము చేయాలి/ నీరు చల్లాలి)
వస్త్రం:
ఉపై తుమాం దేవ సఖః కీర్తిశ్చ మణినాసహ
ప్రాదుర్భూతో స్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతుమే.
శ్లో || సురార్చితాంఘ్రి యుగళే దుకూల వసనప్రియే
వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహణ సురపూజితే
(శ్రీ దుర్గాదేవ్యైనమః ) శ్రీ అన్నపూర్ణాదేవ్యైనమః వస్త్రయుగ్మం సమర్పయామి.
ఉపవీతం:
క్షుత్పిపాసా మలాంజ్యేష్టాం అలక్ష్మీర్నాశయా మ్యహం
అభూతి మసమృద్ధించ సర్వా న్నిర్ణుదమే
గృహతే
శ్లో || తప్త హేమకృతం సూత్రం ముక్తాదామ వీభూషితం
ఉపవీతం ఇదం దేవి గృహణత్వం శుభప్రదే
(శ్రీ దుర్గాదేవ్యైనమః) శ్రీ అన్నపూర్ణాదేవ్యైనమః ఉపవీతం (యజ్ఞోపవీతం) సమర్పయామి.
గంధం:
గంధం ద్వారాందురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం
ఈశ్వరీగ్ం సర్వభూతానాం త్వామిహోపహ్వయే శ్రియం.
శ్లో || శ్రీఖండం చందనం దివ్యం గంధాఢ్యం సుమనోహరం
విలేపనం సురశ్రేష్ఠే చందనం ప్రతిగృహ్యతాం
(శ్రీ దుర్గాదేవ్యైనమః) శ్రీ అన్నపూర్ణాదేవ్యైనమః గంధం సమర్పయామి.
(గంధం చల్లవలెను.)
ఆభరణములు:
శ్లో || కేయూర కంకణ్యైః దివ్యైః హారనూపుర మేఖలా
విభూష్ణాన్యమూల్యాని గృహాణ సురపూజితే
(శ్రీ దుర్గాదేవ్యైనమః ) శ్రీ అన్నపూర్ణాదేవ్యైనమః ఆభరణార్ధం అక్షతాన్ సమర్పయామి.
పుష్పసమర్పణం (పూలమాలలు):
శ్లో ||మనసఃకామ మాకూతిం వాచస్పత్యమశీమహి
పశూనాగం రూపామన్నస్య య
శ్శ్రీ శ్రయతాం యశః.
శ్లో || మల్లికాజాజి కుసుమైశ్చ చంపకా వకుళైస్థథా
శతపత్రైశ్చ కల్హారైః పూజయామి హరప్రియే
(శ్రీ దుర్గాదేవ్యైనమః) శ్రీ అన్నపూర్ణాదేవ్యైనమః పుష్పాంజలిం సమర్పయామి.
పసుపు:
శ్లో || అహిరివభోగైః పర్యేతి బాహుం జ్యాయాహేతిం పరిబాధ్మానః
హస్తఘ్నో విశ్వావయునాని విద్వాన్ పుమాన్ పుమాగంసం పరిపాతు విశ్వతః ||
శ్లో || హరిద్రా చూర్ణమేతద్ది స్వర్ణకాంతి విరాజితం
దీయతే చ మహాదేవి కృపయా
పరిగృహ్యతామ్ ||
ఓం ..శ్రీ అన్నపూర్ణాదేవ్యైనమః.హరిచంద్రాచూర్ణం సమర్పయామి.
కుంకుమ:
శ్లో || యాగం కుర్యాసినీవాలీ యా రాకా యా సరస్వతీ
ఇంద్రాణీ మహ్య ఊత మేవరూణానీం స్వస్తయే ||
ఓం శ్రీ అన్నపూర్ణాదేవ్యైనమః కుంకుమ కజ్జలాది సుగంద ద్రవ్యాణి సమర్పయామి.
అథాంగపూజా:
దుర్గాయైనమః - పాదౌ పూజయామి.
కాత్యాయన్యైనమః - గుల్ఫౌ పూజయామి.
మంగళాయైనమః - జానునీ పూజయామి.
కాంతాయై నమః - ఊరూ పూజయామి.
భద్రకాళ్యై నమః - కటిం పూజయామి.
కపాలిణ్యై నమః - నాభిం పూజయామి.
శివాయై నమః - హృదయం పూజయామి.
జ్ఞానాయై నమః - ఉదరం పూజయామి.
వైరాగ్యై నమః - స్తనౌ పూజయామి.
వైకుంఠ వాసిన్యై నమః - వక్షస్థలం పూజయామి.
దాత్ర్యై నమః - హస్తౌ పూజయామి.
స్వాహాయై నమః - కంఠం పూజయామి.
స్వధాయై నమః - ముఖం పూజయామి.
నారాయణ్యై నమః - నాశికాం పూజయామి.
మహేశ్యై నమః - నేత్రం పూజయామి.
సింహవాహనాయై నమః -లలాటం పూజయామి.
రుద్రాణ్యై నమః - శ్రోత్యే పూజయామి.
(శ్రీ దుర్గాదేవ్యైనమః ) ఓం శ్రీ అన్నపూర్ణా దేవ్యైనమః -. సర్వాణ్యంగాని పూజయామి.
తదుపరి ఇక్కడ ఏ రోజు ఏ దేవిని పూజిస్తారో ఆరోజు ఆ దేవి అష్టోత్తరము చదువవలెను.
తదుపరి ఈ క్రింది విధము గా చేయవలెను
శ్రీ అన్నపూర్ణా అష్టోత్తర శతనామావళి
ఓం అన్నపూర్ణాయై నమః
ఓం శివాయై
ఓం దేవ్యై నమః
ఓం భీమాయై
ఓంపుష్ట్యై నమః
ఓం సరస్వత్యై
ఓం సర్వజ్ఞాయై నమః
ఓం పార్వత్యై
ఓం దుర్గాయై నమః
ఓం శర్వాణ్యై నమః
ఓం శివవల్లభాయై నమః
ఓం వేదవేద్యాయై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం విద్యాదాత్ర్యై
ఓం విశారదాయై నమః
ఓం కుమార్యై
ఓం త్రిపురాయై నమః
ఓం లక్ష్మ్యై
ఓం భయహారిణ్యై నమః
ఓం భ్వాన్యై నమః
ఓం విష్ణుజనన్యై నమః
ఓం బ్రహ్మదిజనన్యై నమః
ఓం గణేశ జనన్యై
ఓం శక్త్యై నమః
ఓం కౌమారజనన్యై
ఓం శుభాయై నమః
ఓం భోగప్రదాయై
ఓం భగవత్యై నమః
ఓం భక్తాభీష్టప్రదాయిన్యై నమః
ఓం భవరోగహరాయై నమః
ఓం భవ్యాయై
ఓం శుభ్రాయై నమః
ఓం పరమమంగళాయై నమః
ఓం భ్వాన్యై నమః
ఓం చంచలాయై నమః
ఓం గౌర్యై నమః
ఓం చారుచంద్రకళాధరాయై నమః
ఓం విశాలక్ష్యై
ఓం విశ్వమాత్రే నమః
ఓం విశ్వవంద్యాయై నమః
ఓం విలాసిన్యై
ఓం ఆర్యాయై నమః
ఓం కల్యాణ నిలయాయై నమః
ఓం ర్ద్రాణ్యై కమలాసనాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓం అనంతాయై నమః
ఓం మత్తపీనపయోధరాయై నమః
ఓం అంబాయై నమః
ఓం సంహారమథన్యై నమః
ఓం మృడాన్యై నమః
ఓం సర్వమంగళాయై నమః
ఓం విష్ణు సేవితాయై నమః
ఓం సిద్దాయై నమః
ఓం బ్రహ్మాణ్యై నమః
ఓం సురసేవితాయై నమః
ఓం పరమానందాయై నమః
ఓం శాంత్యై నమః
ఓం పరమానందరూపిణ్యై నమః
ఓం పరమానంద జనన్యై నమః
ఓం పరానంద ప్రదాయిన్యై నమః
ఓం పరోపకార నిరతాయై నమః
ఓం పరమాయై నమః
ఓం భక్తవత్సలాయై నమః
ఓం పూర్ణచంద్రాబ్భవదనాయై నమః
ఓం పూర్ణచందనిభాంశుకాయై నమః
ఓం శుభలక్షణ సంపన్నాయై నమః
ఓం శుభానంద గుణార్ణవాయై నమః
ఓం శుభసౌభాగ్యనిలయాయై నమః
ఓం శుభదాయై నమః
ఓం రతిప్రియాయై నమః
ఓం చండికాయై నమః
ఓం చండమదనాయై నమః
ఓం చండదర్పనివారిణ్యై నమః
ఓం మార్తాండనయనాయై నమః
ఓం సాధ్వ్యై నమః
ఓం చంద్రాగ్నినయనాయై నమః
ఓం సత్యై నమః
ఓం పుండరీకహరాయై నమః
ఓం పూర్ణాయై నమః
ఓం పుణ్యదాయై నమః
ఓం పుణ్యరూపిణ్యై నమః
ఓం మాయాతీతాయై నమః
ఓం శ్రేష్ఠమాయాయై నమః
ఓం శ్రేష్ఠధర్మాత్మవందితాయై నమః
ఓం అసృష్ట్యై నమః
ఓం సంగరహితాయై నమః
ఓం సృష్టిహేతుకవర్థిన్యై నమః
ఓం వృషారూఢాయై నమః
ఓం శూలహస్తాయై నమః
ఓం స్థితి సంహార కారిణ్యై నమః
ఓం మందస్మితాయై నమః
ఓం స్కందమాత్రే నమః
ఓం శుద్దచిత్తాయై నమః
ఓం మునిస్తుత్యాయై నమః
ఓం మహాభగవత్యై
ఓం దక్షాయై నమః
ఓం దక్షాధ్వరవినాశిన్యై నమః
ఓం సర్వార్థ దాత్ర్యై నమః
ఓం సావిత్ర్యై నమః
ఓం సదాశివకుటింబిన్యై నమః
ఓం నిత్యసుందరస్ర్వాంగై నమః
ఓం సచ్చిదానంద లక్షణాయై నమః
ఓం సర్వదేవతా సంపూజ్యాయై నమః
ఓం శంకరప్రియవల్లభాయై నమః
ఓం సర్వధారాయై నమః
ఓం మహాసాధ్వ్యై నమః
ఓం శ్రీ అన్నపూర్ణాయై నమః
ధూపం:
శ్లో || కర్దమేన ప్రజా భూతా సంభవ కర్దమ శ్రియం
వాసయమేకులే మాతరం పద్మమాలినీమ్
శ్లో || వనస్పత్యుద్భవైర్ధివ్యై ర్నానాగందైః సుసంయుతః
ఆఘ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం
(శ్రీ దుర్గాదేవ్యైనమ ) ఓం శ్రీ అన్నపూర్ణాదేవ్యైనమః ఓం ధూపమాఘ్రాపయామి.
దీపం:
శ్లో || అపసృజంతు స్నిగ్ధాని చిక్లీతవసమే గృహనిచ
దేవీం మాత్రం శ్రియం వాసయమేకులే.
శ్లో ||సాజ్యమేకార్తిసంయుక్తంవహ్నినాయోజితంప్రియం
గృహాణ మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపహం
భక్త్యాదీపం ప్రయచ్చామి దేవ్యైచ పరమాత్మనే
త్రాహిమాం నరకాద్ఘోరా ద్దివ్య జ్యోతిర్నమోస్తుతే
(శ్రీ దుర్గాదేవ్యైనమః ) ఓం శ్రీ అన్నపూర్ణాదేవ్యైనమః దీపం దర్శయామి
నైవేద్యం
శ్లో || ఆర్ద్రాంపుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలీనీమ్
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదోమమా అవహ.
శ్లో || అన్నం చతురిధం స్వాదు రసైః సర్పిః సమనిత్వం
నైవేద్యం గృహ్యతాం దేవి భక్తిర్మే హ్యచలాంకురు
(మహా నైవేద్యం కొరకు ఉంచిన పదార్ధముల పై కొంచెం నీరు చిలకరించి కుడిచేతితో సమర్పించాలి.)
ఓం ప్రాణాయస్వాహా,
ఓం అపానాయ స్వాహా,
ఓం వ్యానాయ స్వాహా,
ఓం ఉదనాయ స్వాహా,
ఓం సమనాయ స్వాహా,
ఓం పరబ్రహ్మణేస్వాహా,
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.
అమృతాభిధానమపి - ఉత్తరాపోశనం సమర్పయామి.
శ్రీ అన్నపూర్ణాదేవ్యైనమః - హస్తౌ పక్షాళయామి.
శ్రీ అన్నపూర్ణాదేవ్యైనమః - పాదౌ ప్రక్షాళయామి.
శ్రీ అన్నపూర్ణాదేవ్యైనమః - శుద్దాచమనీయం సమర్పయామి.
తాంబూలం:
శ్లో || సాస్ హ
.....ఆర్ద్రాం యః కరిణీం యష్టిం సువర్ణాం హేమ మాలినీం
సూర్యాం హిరన్మయీం లక్ష్మీం జాతవేదోమమా అవహ.
శ్లో || పూగీఫలైశ్చ కర్పూరై ర్నాగవల్లీ దళైర్యుతం
కర్పూరచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్
(శ్రీ దుర్గాదేవ్యైనమః ) ఓం శ్రీ అన్నపూర్ణాదేవ్యైనమః తాంబూలం సమర్పయామి.
నీరాజనం:
తాం మ అవహజాతవేదో లక్ష్మీమనపగామినీం య స్యాంహిరణ్యం
ప్రభూతంగావోదాస్యోశ్యాన్ విధేయం పురుషానహమ్
శ్లో || నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం
తుభ్యం దాస్యామ్యహం దేవీ గృహేణ సురపూజితే
సంతత శ్రీరస్తు, సమస్తమంగళాని భవంతు, నిత్యశ్రీరస్తు, నిత్యమంగళాని భవంతు.
(శ్రీ దుర్గాదేవ్యైనమః ) ఓం శ్రీ అన్నపూర్ణాదేవ్యైనమః కర్పూర నీరాజనం సమర్పయామి.
(ఎడమచేతితో గంటను వాయించుచూ కుడిచేతితో హారతి నీయవలెను)
మంత్రపుష్పమ్:
జాతవేదసే సుననామ సోమమరాతీయతో నిదహాతి వేదః |
సనః పర్షదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః ||
తామగ్ని వర్ణాం తపసాజ్వలంతీం వైరో చనీం కర్మ ఫలేషు జుష్టామ్
దుర్గాం దేవీగం శరణమహం పపద్యే సుతరసి తరసే నమః
అగ్నే త్వం పారయా నవ్యో అస్మాన్ స్వస్తిభి రతి దుర్గాణి విశ్వా
పూశ్చ పృథ్వీ బహులాన ఉర్వీ భవాతోకాయ తనయాయ శంయోః
విశ్వాని నోదుర్గహా జాతవేద స్సింధుం ననావా దురితాతి పర్షి
అగ్నే అత్రివన్మనసా గృహణానో స్మాకం బోధ్యవితా తనూనామ్
పృతనాజితగం సహమాన ముగ్ర మగ్నిగం హువేమ పరమాత్సధస్దాత్
సనః పర్షదతి దుర్గాణి విశ్వక్షామద్దేవో అతిదురితాత్యగ్నిః
ప్రత్నోషికమీడ్యో అధ్వరేషు సనాచ్చ హోతా నవ్యశ్చ సత్సి
స్వాంచాగ్నే తనువం పిప్రయస్వాస్మభ్యంచ సౌభగ మాయజస్వ
గోభి ర్జుష్టమయుజో నిషిక్తం తవేంద్ర విష్ణొ రనుసంచరేమ
నాకస్య పృష్ఠ మభిసంవసానో వైష్ణవీం లోక ఇహ మాదయంతామ్
ఓం మహాదేవ్యైచ విద్మహే విష్ణుపత్నైచ ధీమహి।
తన్నోలక్ష్మీ ప్రచోదయాత్॥
ఓం కాత్యాయనాయ' విద్మహే' కన్యకుమారి' ధీమహి |
తన్నో' దుర్గిః ప్రచోదయా''త్ ‖
ఓం వీణాపాణ్యై చ విద్మహే బ్రహ్మపత్నై చ ధీమహి।
తన్నో వాణీః ప్రచోదయాత్॥
ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి ।
తన్నో దంతిః ప్రచోదయాత్ ॥
ఓం తద్భ్రహ్మా | ఓం తద్వాయుః | ఓం తదాత్మా |
ఓం తత్సత్యం | ఓం తత్సర్వం|
ఓం తత్సురోర్నమః |
అంతశ్చరతి భూతేషు గుహాయాం
విశ్వమూర్తిషు |
త్వంయజ్ఞస్త్వం | వషట్కారస్త్వం మింద్రస్త్వగం | రుద్రస్త్వం |
విష్ణుస్త్వం | బ్రహ్మత్వం |ప్రజాపతిః | త్వంతదాప అపోజ్యోతి
రసోమృతం బ్రహ | భూర్భువస్సువరోం|
ఓం శ్రీ అన్నపూర్ణాదేవ్యైనమః సువర్ణమంత్ర పుష్పం సమర్పయామి.
సాష్టాంగ నమస్కారం:
ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా
పధ్బ్యాం కరభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే
(శ్రీ దుర్గాదేవ్యైనమః) ఓం శ్రీ అన్నపూర్ణాదేవ్యైనమః సాష్టాంగనమస్కారన్ సమర్పయామి
ప్రదక్షిణ
(కుడివైపుగా 3 సార్లు ప్రదక్షిణం చేయవలెను)
శ్లో || యానికాని చ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే
పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ
త్రాహిమాం కృపయా దేవి శరణాగత వత్సల
అన్యథా శరనం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరి
(శ్రీ దుర్గాదేవ్యైనమః ) ఓం శ్రీ అన్నపూర్ణాదేవ్యైనమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.
ప్రార్ధనం:
శ్లో || సర్వస్వరూపే సర్వేశి సర్వశక్తి స్వరూపిణి
పూజాం గృహాణ కౌమురి జగన్మాతర్నమోస్తుతే
ఓం శ్రీ అన్నపూర్ణాదేవ్యైనమః ప్రార్దనాం సమర్పయామి
సర్వోపచారాలు:
చత్రమాచ్చాదయామి,
చామరేణవీచయామి,
నృత్యం దర్శయామి,
గీతం శ్రాపయామి,
ఆందోళికం నారోహయామి
సమస్త శక్త్యోపచార, భక్త్యో పచార, రాజోపచార పూజాం సమర్పయామి.
(శ్రీ దుర్గాదేవ్యైనమః) ఓం శ్రీ అన్నపూర్ణాదేవ్యైనమః సర్వోపచార పూజాన్ సమర్పయామి
క్షమా ప్రార్థన
(అక్షతలు నీటితో పళ్ళెంలో విడువవలెను)
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి
యత్పూజితం మయాదేవీ పరిపూర్ణం తదస్తుతే
అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మిక
(శ్రీ దుర్గాదేవ్యైనమః ) ఓం శ్రీ అన్నపూర్ణాదేవ్యైనమః సుప్రీతా స్సుప్రసన్నో వరదో భవతు
సమస్త సన్మంగళాని భవంతుః
శ్రీ దేవి పూజావిధానం సంపూర్ణం
(క్రింది శ్లోకమును చదువుచు అమ్మవారి తీర్థమును తీసుకొనవలెను.)
అకాల మృత్యుహరణమ్ సర్వవ్యాది నివారణం
సర్వపాపక్షయకరం శ్రీదేవి పాదోదకం పావనం శుభమ్ ||
(దేవి షోడశోపచార పూజ సమాప్తం.)
అలంకరణ
నివేదనలకై
( ఆకుపచ్చని వస్త్రాలు-- తీపిపదార్థాలు, కొబ్బరి అన్నము, చిత్రాన్నము )
పులిహోరా
కావలసిన పదార్ధాలు :
బియ్యం - 1 కప్పు
చింతపండు - 2 నిమ్మకాయలంత
పసుపు - 1 టేబుల్ స్పూన్
వేయించిన వేరుశెనగపప్పు - 2 - 3 టేబుల్ స్పూన్స్
ఉప్పు
నూనె
పోపు కొరకు
ఆవాలు - 1 టీ స్పూన్
పచ్చి శెనగపప్పు - 1 టేబుల్ స్పూన్
జీల కర్ర - 1 టేబుల్ స్పూన్
ఎండు మిరపకాయలు - 4
తయారు చేయు విధానం:
ముందుగ బియ్యాన్ని 2 కప్పులు నీళ్ళు పోసి ఉడక పెట్టుకోవాలి. ఉడికించిన అన్నాన్ని పక్కన చల్లార్చి పెట్టుకోవాలి పసుపు, ఉప్పు వేసి కలుపుకోవాలి. చింతపండుని వేడి నీళ్ళల్లో నానపెట్టి రసం తీసి పెట్టుకోవాలి. వేరే బౌల్ తీసుకొని అందులో చింతపండు రసం పోసి చిక్కగా అయ్యే వరకు ఉడక పెట్టుకోవాలి. వేరే పాన్ తీసుకొని తగినంత నూనె పోసి కాగాక ఆవాలు వేసుకోవాలి. తరువాత పచ్చి శెనగపప్పుని వేయించాలి. వేగాక జీలకర్రని, వేరుశెనగపప్పుని, ఎండు మిరపకయాలని వేసి ఒక నిముషం పాటు వేయించాలి. తరువాత ఈ మిశ్రమాన్ని అన్నంలో కలపాలి. తరువాత చింతపండు పులుసు వేసి బాగా కలపాలి.
Comments
Post a Comment