నైవేద్యాల పేర్లు

ఈ పూజ విధానంలో తొమ్మిది రోజులు చేసుకోవచ్చు.

 అభిషేకం చేసుకోలేని వారు అభిషేక మంత్రాలను చదవాల్సిన పని లేదు

పేజీలు ఎక్కువ వున్నాయి ఎక్కువ సమయం పడుతుంది అనుకోకండి

సమయం గురించి ఆలోచించకుండా పూజలో కూర్చుంటే మొదటి రోజు ఒక 40 నిముషాలు పడుతుంది

 తర్వాత రోజు నుండి చేయగలిగిన వాళ్ళు షోడశ ఉపచారాలు చేయలేని వాళ్ళు పంచోపచారాలతో పూజ చేసుకోవచ్చు.

ఈ ఉపచారాలన్నీటి కంటే ముఖ్యమైనది మనసు. అందులో వున్న అమ్మ మీద భక్తి. ఇవేమి చేయకుండా నమస్కారం చేసుకొని నాకు ఇదే వచ్చు అని ఆమెతో చెప్పుకొని ప్రేమతో అమ్మ నామం పలికినా కూడా ఆమె సంతోషిస్తుంది. కాబట్టి మీకు తోచినవిధంగా భక్తితో మనస్ఫూర్తిగా చేయండి 🙏🏻

లలితా సహస్ర నామ పారాయణ చేసే వారు మొదటి పారాయణ రేపు ఉదయం 10:30 కి చేయండి 🙏🏻
సాయంత్రం 7:00 కి మళ్ళీ చేయండి 🙏🏻


 నైవేద్యాల పేర్లు

(తెలుగు పేర్లు – సంస్కృతం పేర్లు)

|| పళ్ళు ||
అరటిపండు – కదళీఫలం
ఆపిల్ – కాశ్మీరఫలం
ఉసిరికాయ – అమలక
కిస్మిస్ – శుష్కద్రాక్ష
కొబ్బరికాయ పూర్తిగా – నారికేళం
కొబ్బరికాయ చిప్పలు – నారికేళ ఖండద్వయం
ఖర్జూరం – ఖర్జూర
జామపండు – బీజాపూరం
దబ్బపండు – మాదీఫలం
దానిమ్మపండు – దాడిమీఫలం
ద్రాక్షపళ్ళు – ద్రాక్షఫలం
నారింజ – నారంగ
నిమ్మపండు – జంభీరఫలం
నేరేడుపండు – జంబూఫలం
మామిడి పండు – చూతఫలం
మారేడుపండు – శ్రీఫలం
రేగు పండు – బదరీ ఫలం
వెలగపండు – కపిత్తఫలం
సీతాఫలం – సీతాఫలం

విశేష నివేదనలు ||

అటుకులు – పృథక్
అటుకుల పాయసం – పృథక్పాయస
అన్నము (నెయ్యితో) – స్నిగ్ధౌదనం
అన్నం (నెయ్యి,కూర,పప్పు,పులుసు,పెరుగు) – మహానైవేద్యం
ఉగాది పచ్చడి – నింబవ్యంజనం
కట్టుపొంగలి (మిరియాలపొంగలి) – మరీచ్యన్నం
కిచిడీ – శాకమిశ్రితాన్నం
గోధుమనూక ప్రసాదం – సపాదభక్ష్యం
చక్కెరపొంగలి – శర్కరాన్నం
చలిమిడి – గుడమిశ్రిత తండులపిష్టం
నిమ్మకాయ పులిహోర – జంభీరఫలాన్నం
నువ్వులపొడి అన్నం – తిలాన్నం
పరమాన్నం (పాలాన్నం)- క్షీరాన్నం
పానకం – గుడోదకం, మధురపానీయం
పాయసం – పాయసం
పిండివంటలు – భక్ష్యం
పులగం – కుశలాన్నం
పులిహోర – చిత్రాన్నం
పెరుగన్నం – దధ్యోదనం
పేలాలు – లాజ
బెల్లపు పరమాన్నం – గుడాన్నం
వడపప్పు – గుడమిశ్రిత ముద్గసూపమ్
వడలు – మాసపూపం
శెనగలు (శుండలు) – చణకం
హల్వా – కేసరి


 వివిధ పదార్థాలు ||
అప్పాలు – గుడపూపం
చెరుకుముక్క – ఇక్షుఖండం
చక్కెర – శర్కర
తేనె – మధు
పాలు – క్షీరం
పెరుగు – దధి
బెల్లం – గుడం
వెన్న – నవనీతం

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

KAPU SURNAME AND GOTRALU:

శ్రీ లలిత దేవి చరిత్ర Part-12