రామాయణ నీతి


   🕉️రామాయణ నీతి!🕉️
                  

ఆడపిల్ల ఉన్న తండ్రి అంటే ఏమిటో అద్భుతంగా చెప్పిన దశరథుడు…

దశరథ మహారాజు తన నలుగురు కొడుకులతో కూడిన వివాహ శోభాయాత్రను తీసుకుని, జనక మహారాజు ద్వారం వద్దకు వెళ్ళాడు.

అప్పుడు జనక మహారాజు, వారి వివాహ శోభాయాత్రకు సాధరపూర్వక స్వాగతం చెప్పాడు.

వెంటనే దశరథ మహారాజు ముందుకు వెళ్లి, జనక మహారాజుకు పాదాభివందనం చేశాడు.

అప్పుడు జనక మహారాజు దశరథ మహారాజు యొక్క భుజం తట్టి పైకి లేపి సంతోషంతో కౌగలించుకుని…
“రాజా! మీరు పెద్దవారు.. పైగా వరుని పక్షంవారు..!
ఇలా మీరు నాకు పాదాభివందనం చేయడం ఏమిటి?
గంగానది వెనక్కు ప్రవహించడం లేదు కదా?” అని అన్నాడు..

అప్పుడు దశరథ మహారాజు అద్భుతమైన, సుందరమైన జవాబు చెప్పాడు..
”మహారాజా, మీరు దాతలు.. కన్యదానం చేస్తున్నారు..
నేనైతే యాచకుణ్ణి.. మీ ద్వారా కన్యను పొందాలని వచ్చాను..
ఇప్పుడు చెప్పండి.. దాత మరియు యాచకులలో ఎవరు పెద్ద? ఎవరు గొప్ప?” అని అన్నాడు.

ఆ మాటలను విన్న జనక మహారాజు కళ్ళల్లోంచి ఆనందభాష్పాలు రాలుస్తూ.. ఇలా అన్నాడు..
“ఏ గృహంలో అయితే కూతుళ్లు ఉంటారో.. వాళ్ళు భాగ్యవంతులు. ప్రతీ కూతురు అదృష్టంలో తండ్రి ఉంటాడు.”

ఇదీ భారతీయత.. ఇదీ సనాతన సంస్కృతి.. ఇదీ రామాయణం నీతి..!*
               
. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                       

   🕉️🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🕉️🙏

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: