దసరా నాల్గవరోజు కూష్మాండా దుర్గ
దసరా నాల్గవరోజు శుభాకాంక్షలు
నాల్గవ రోజు నైవేద్యము చిల్లులులేని "అల్లం గారెలు"
ఆశ్వయుజ శుద్ధ చవితి
దుర్గామాత నాల్గవ స్వరూపము
కూష్మాండా దుర్గా 4వరోజు
29 సెప్టెంబర్ 2022 : నాలుగో రోజు, గురువారం రోజున కుష్మాండ పూజ
కూష్మాండ దుర్గ ( మహాలక్ష్మి)
( కూష్మాండ దుర్గ ) మహాలక్ష్మి పూజావిధానము
హరిః ಓమ్, ఓం శ్రీ మహాగణాధిపతయేనమః
ఓం శ్రీ గురుభ్యోన్నమః
ఓం దీపారాధనం కృత్వా --
ఓం ఉద్దీప్య స్వజాత వేదోపఘ్నం నిఋతిం మమ ।
పశూగ్ శ్చ మహ్య మావహ జీవనం చ దిశోదిశ॥
(అని దీపమును వెలిగింౘవలెను)
శ్లో॥ భో దీప బ్రహ్మ రూపేణ సర్వేషాం హృది సంస్థితః।
అతస్త్వాం స్థాపయామ్యద్య మదఙ్ఞానముపాకురు ॥
శ్లో॥ భో దీప బ్రహ్మ రూపోసి అంధకార నివారక ।
మయాకృత మిదం స్తోత్రం గృష్ణీష్వ వరదోభవ ॥
(అని దీపమునకు కుంకుమ పుష్పాక్షతలుంచి నమస్కరింౘవలెను)
శ్లో॥ ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతో√పి వా ।
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యంభ్యంతరః శుచిః॥
ఓం పుండరీకాక్ష, పుండరీకాక్ష, పుండరీకాక్షాయ నమః ।
(పై మంత్రమును చెప్పుచూ మూడుసార్లు జలమును శిరము పైనను, తన చుట్టూ ౘల్లుకొనవలెను)
ఓం దేవీం వా చ మజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవోవదంతి।
సానో మంద్రేష మూర్జందుహానా ధేనుర్వాగస్మా నుపసుష్టుతైతు ॥
అయం ముహూర్తః సుముహూర్తో అస్తు.
శుక్లాంబరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం।
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే॥
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం ।
అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే॥
శ్లో॥ సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ
సాధికే ।
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి
నమోస్తుతే ॥
ఓం శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః।
ఓం శ్రీఉమామహేశ్వరాభ్యాం నమః।
ఓం శ్రీవాణీహిరణ్యగర్భాభ్యాం నమః।
ఓం శ్రీశచీపురందరాభ్యాం నమః।
ఓం శ్రీఅరుంధతీవసిష్ఠాభ్యాం నమః।
ఓం శ్రీఇంద్రాద్యష్టదిక్పాలక దేవతా భ్యోన్నమః। ఓం శ్రీఆదిత్యాదినవగ్రహదేవతాభ్యో నమః ।
ఓం శ్రీగ్రామ దేవతాభ్యో నమః ।
ఓం శ్రీక్షేత్రాధిష్ఠానదేవతాభ్యో నమః।
ఓం శ్రీకుల దేవతాభ్యో నమః।
ఓం శ్రీమాతాపితృభ్యో నమః।
ఓం శ్రీసర్వేభ్యో మహాజనేభ్యో నమః। అవిఘ్నమస్తు ॥
ఘంటానాదం
శ్లో || ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రాక్షసామ్ |
కుర్యాత్ ఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్ ||
ఇతి ఘంటానాదం కృత్వా
(ఘంటానాదం చేయవలెను)
[అంటే దేవతలు ఉండే చోట రాక్షసులు ఉండరు కదా. ఈ పరమ పవిత్రమైనటువంటి ప్రదేశంలో దుష్టశక్తులు ఉండకూడదు కాబట్టి మీరు ఇక్కడనుండి వెళ్ళిపొండి అని గంట కొట్టి దేవతలను లాంఛనంగా ఆహ్వానించడానికి గంటానాదం చేయడం జరుగుతుంది]
ఆచమనీయం
( స్త్రీలైతే స్వాహా అనరాదు నమః అనాలి)
ఓం కేశవాయస్వాహా --- {అని తీర్ధం తీసుకోవాలి}
ఓం నారాయనాయస్వాహా --- {అని తీర్ధం తీసుకోవాలి}
ఓం మాధవాయస్వాహా --- {అని తీర్ధం తీసుకోవాలి}
ఓం గోవిందాయనమః --- {అనుచూ నీళ్ళను క్రిందకు వదలవలెను.}
{తదుపరి నమఃస్కారం చేయుచు యీ మంత్రములను పఠించవలెను}
ఓం విష్ణవే నమః,
ఓం మధుసూదనాయ నమః,
ఓం త్రివిక్రమాయ నమః,
ఓం వామనాయ నమః,
ఓం శ్రీధరాయ నమః,
ఓం హృషీకేశాయ నమః,
ఓం పద్మనాభాయ నమః,
ఓం దామోదరాయ నమః,
ఓం సంకర్షణాయ నమః,
ఓం వాసుదేవాయ నమః,
ఓం ప్రద్యుమ్నాయ నమః,
ఓం అనిరుద్ధాయ నమః,
ఓం పురుషోత్తమాయ నమః,
ఓం అధోక్షజాయ నమః,
ఓం నారసింహాయ నమః,
ఓం అచ్యుతాయ నమః,
ఓం జనార్ధనాయ నమః
ఓం ఉపేంద్రాయ నమః,
ఓం హరయే నమః,
ఓం శ్రీకృష్ణాయ నమః
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః --- ( అని కొంచెం నీళ్ళు పళ్ళెములో విడువవలెను)
భూతోచ్ఛాటనము
శ్లో॥ అపసర్పంతు యే భూతా యే భూతా భూమి సంస్థితాః।
యే భూతా విఘ్నకర్తారః తే నశ్యంతు శివాఙ్ఞయా ॥
శ్లో॥ అపక్రామంతు భూతాద్యాః పిశాచ సర్వతో దిశాం ।
సర్వేషామ్ అవిరోధేన పూజాకర్మా సమారభే ॥
శ్లో|| ఉత్తిష్ఠంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః |
ఏతేషామ్ అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ||
{భూతోచ్చాటన మంత్రము చదువుతూ కొన్ని అక్షతలు వాసన చూసి వెనుకకు వేసుకోవలెను}
ప్రాణాయామం
శ్లో|| ఓం భూ: | ఓం భువః | ఓం సువః | ఓం మహః |
ఓం జనః | ఓం తపః | ఓం సత్యం |
ఓం తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః
ప్రచోదయాత్ ||
ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ ||
{ అను మంత్రమును చదువుతూ 3సార్లు ప్రాణాయామము చేయవలెను }
సంకల్పం
(పుష్పాక్షతలు చేతిలో పట్టుకుని సంకల్పము చెప్పవలెను)
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవతా ముద్దిశ్య,
శ్రీ మహాలక్ష్మీ దేవతా ప్రీత్యర్ధం, శుభే శోభనే ముహూర్తే శ్రీమహావిష్ణోరాఙ్ఞయా
ప్రవర్తమానస్య - అద్యబ్రహ్మణః ద్వితియ పరార్ధే , శ్వేత వరాహకల్పే
వైవస్వత మన్వంతరే - కలియుగే , ప్రథమపాదే జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోర్దక్షిణ దిగ్భాగే, శ్రీశైలస్య వాయవ్య/ఈశాన్య ప్రదేశే, కృష్ణా/కావేర్యోః/గంగా/గోదావర్యోః మధ్యదేశే _కావేరీ___నదీసమీపే, స్వగృహే/శోభనగృహే సమస్త దేవతా, బ్రాహ్మణ, హరిహర, గురుచరణ సన్నిధౌ, అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన, ప్రభవాది షష్ఠీ సంవత్సరాణాం మధ్యే
శ్రీశుభకృతు నామ సంవత్సరే దక్షి ణాయనే శరత్ ఋతౌ, ఆశ్వయుజ మాసే, శుక్ల పక్షే చతుర్థి తిథౌ బృహస్పతివాసరే శుభ నక్షత్రే, శుభ యోగే, శుభ కరణే, ఏవం గుణవిశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీమాన్ ______ గోత్రః (గోత్రం) అహం__________ నామ ధేయస్య (పేరు) ధర్మ పత్ని ______________ నామ ధేయవతీ (పేరు)( పురుషులైనచో గోత్రస్య, నామధేయస్య అనియు, స్త్రీలైనచో గోత్రవతీ, నామధేయవతీ అని చెప్పవలెను) అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్ధం, ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ధ్యర్ధం, సర్వ అభీష్ట సిద్ధ్యర్ధం, సర్వాపదాం నివారణార్ధం, సకలకార్య విఘ్న నివారణార్ధం, సత్సంతాన సౌభాగ్య శుభఫల సిద్ధ్యర్ధం, చింతిత మనోరథ సిద్ధ్యర్థం (కూష్మాండ దుర్గ) శ్రీ మహాలక్ష్మీదేవతా ముద్దిశ్య, (కూష్మాండ దుర్గ ) శ్రీ మహాలక్ష్మీదేవతా ప్రీత్యర్థం యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే.
{అని సంకల్పించి అక్షతలు నీరు కలిపి పళ్ళెములో విడువవలెను}
ఆదౌ నిర్విఘ్నేన పూజా పరిసమాప్త్యర్ధం మహా గణాధిపతి పూజాం కరిష్యే, తదంగ కలశారాధనం కరిష్యే.
కలశం గంధపుష్పాక్షతైరభ్యర్ఛ్య
( మనము ఆచమనము చేసినటువంటి పంచపాత్రలోని నీళ్ళు దేవుని పూజకు వినియోగించరాదు. పూజకు విడిగా ఒక కలశము (చెంబు ) తీసుకుని దానిలో శుద్ధ జలమును పోసి కలశమునకు గంధం, కుంకుమ బొట్లు పెట్టి, కలశంలో తులసిదళము, ఒక పువ్వు, కొద్దిగా అక్షతలు వేసి, కుడి చేతితో కలశంను మూసి పెట్టి, ఈ క్రింది మంత్రాలను చెప్పవలెను}
శ్లో|| కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః।
మూలే తత్ర స్థితోబ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతాః॥
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా ।
ఋగ్వేదో థ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః॥
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః |
ఆయాంతు దేవపూజార్థం మమ దురితక్షయ కారకాః ॥
గాయత్రీచైవ సావిత్రీ శాంతిః పుష్ఠి కరీ తథా।
ఆయాంతు దేవపూజార్థం మమ దురితక్షయ కారకాః ॥
గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి |
నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు ||
కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి ।
భాగీరథీతి విఖ్యాతాః పంచగంగా
ప్రకీర్తితాః ॥
ఓం భూర్భువస్సువో, భూర్భువస్సువో, భూర్భువస్సువః
కలశోదకేన పూజాద్రవ్యాణి, దేవం, ఆత్మానం చ సంప్రోక్ష్య
(పుష్పముతో కలశజలమును పూజా ద్రవ్యములపై, దేవతపై, చివరగా తనపై చల్లుకొనవలెను)
ఆదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే
(గణపతి విగ్రహమున్నచో పూజింపవచ్చు, లేక పసుపుతో గణపతిని చేసి తమలపాకు పై పెట్టి సర్వ విఘ్నశాంతికై పూజింౘ వలెను)
అథ గణపతి పూజ
మం : ఓం గణానాంత్వా గణపతిగ్ం హవామహే
కవింకవీనాముపమశ్రవస్తమమ్ ।
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన
శ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్॥
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి
శ్లో॥ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవో సర్వ కార్యేషు సర్వదా॥
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఆవాహయామి,
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః సువర్ణ ఖచిత సింహాసనం సమర్పయామి.
శ్రీ మహాగణాధిపతి వద్ద పుష్పము నుంచ వలెను .
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః పాదారవిందయోః పాద్యం సమర్పయామి
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోరర్ఘ్యం సమర్పయామి
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి
మం॥ ఓం ఆపోహిష్ఠా మయోభువః తాన ఊర్ఝే దధాతన
మహేరణాయచక్షసే । యోవశ్శివ తమోరసః ।
తస్యభాజయతే హనః । ఉశతీరవ మాతరః।
తస్మాత్ అరంగమామవః । యస్యక్షయాయ జిన్వధ
ఆపోజనయధాచనః ॥
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః స్నానం పరికల్పయామి (శుద్ధోదక స్నానం)
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దివ్య శ్రీచందనం సమర్పయామి.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః గంధస్యోపరి కుంకుమం సమర్ప యామి, పుష్పమాలాం సమర్పయామి.
పుష్పైః పూజయామి
ఓం సుముఖాయ నమః,
ఓం ఏకదంతాయ నమః,
ఓం కపిలాయ నమః,
ఓం గజకర్ణికాయ నమః,
ఓం లంబోదరాయ నమః,
ఓం వికటాయ నమః,
ఓం విఘ్నరాజాయ నమః,
ఓం గణాదిపాయ నమః,
ఓం ధూమకేతవే నమః,
ఓం గణాధ్యక్షాయ నమః,
ఓం ఫాలచంద్రాయ నమః,
ఓం గజాననాయ నమః,
ఓం వక్రతుండాయనమః,
ఓం శూర్పకర్ణాయ నమః,
ఓం హేరంబాయ నమః,
ఓం స్కందపూర్వజాయ నమః,
ఓం సర్వసిద్ది ప్రదాయకాయ నమః,
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః షోడశనామపూజాం సమర్పయామి
ధూపం
శ్లో॥ వనస్పత్యుద్భవైః దివ్యైః నానా గంధైస్సు సంయుతమ్ ।
ఆఘ్రేయస్సర్వ దేవానాం ధూపోయం ప్రతిగృహ్యతామ్॥
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపమాఘ్రాపయామి.
దీపం
శ్లో॥ సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా।
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహమ్ ॥
భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే।
త్రాహిమాం నరకాద్ ఘోరా ద్దివ్యజ్యోతిర్నమోస్తుతే॥
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి.
ధూప, దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి.
నైవేద్యం
భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయ మేవ చ।
ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం గణాధిప ॥
ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
(నీరు నివేదన చుట్టూ చల్లుతూ) ఓంసత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు అమృతో పస్తరణమసి…నీరు నివేదన చుట్టూ చల్లుతూ) ఓంసత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు అమృతో పస్తరణమసి…
ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మేణ్యే స్వాహా
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అమృత నివేదనం సమర్పయామి.
గుడ సహితఫల నివేదనం సమర్పయామి.
మధ్యే మధ్యే ఉదక పానీయం సమర్పయామి.(నీటిని వదలాలి).
అమృతాపిధానమసి ఉత్తరాపోశనం సమర్పయామి.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః హస్తౌ ప్రక్షాళయామి..నీరువదలాలి.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః పాదౌ ప్రక్షాళయామి.. నీరువదలాలి.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శుద్దఆచమనీయం సమర్పయామి.
తాంబూలం
పూగీ ఫలైః సకర్పూరం నాగవళ్ళీ దళైర్యుతమ్।
ముక్తా చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగుహ్యతామ్॥
శ్రీ మహాగణాథిపతయే నమ: తాంబూల, దక్షిణాం సమర్పయామి.
తాంబూల చర్వణానంతరం ఆచమనం సమర్పయామి.
నీరాజనం
ఘృతవర్తిసహస్రైశ్చ కర్పూర శకలైస్తథా ।
నీరాజనం మయా దత్తం గృహాణ వరదోభవ॥
శ్రీ మహాగణాథిపతయే నమ: కర్పూర నీరాజనం దర్శయామి.
మంత్రపుష్పం
ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి ।
తన్నో దంతిః ప్రచోదయాత్ ॥
ఓం శ్రీ మహాగణాధిపతయేనమః దివ్య సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి.
ఆత్మప్రదక్షణ నమస్కారాన్ సమర్పయామి
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప ।
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే॥
అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మక: శ్రీ మహాగణపతిర్దేవతా సుప్రీతా స్సుప్రసన్నో వరదోభవతు।
శ్రీ మహాగణపతి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు, ఉత్తరే శుభకర్మణ్య నిర్విఘ్నమస్తు,
శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి.
( కూష్మాండ దుర్గ ) శ్రీమహాలక్ష్మీ దేవతా పూజా ప్రారంభం
ధ్యానం
కురుపద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే।
నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవసర్వదా ॥
క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే।
సుస్థిరా భవ మే గేహే సురాసుర నమస్కృతే॥
శ్రీ మహాలక్ష్మీ దేవ్యైనమః ( కూష్మాండ దుర్గ ) ధ్యాయామి, ధ్యానం సమర్పయామి.
ఆవాహనం
ఓం ‖ హిర'ణ్యవర్ణాం హరి'ణీం సువర్ణ'రజతస్ర'జాం |
చంద్రాం హిరణ్మ'యీం లక్ష్మీం జాత'వేదో మ ఆవ'హ ‖
సర్వమంగళ మాంగల్యే విష్ణువక్షస్థలాలయే
ఆవాహయామి దేవిత్వాం సుప్రీతా భవసర్వదా‖
సాంగం--సాయుధం--సవాహనం--సశక్తిం--సభర్తృ,పుత్ర,పరివార సమేతాం (కూష్మాండ దుర్గ ) శ్రీ మహాలక్ష్మీ దేవతాయైనమః ఆవాహయామి
ఆసనం సమర్పయామి.
తాం మ ఆవ'హ జాత'వేదో లక్ష్మీమన'పగామినీ''మ్ |
యస్యాం హిర'ణ్యం విందేయం గామశ్వం పురు'షానహమ్ ‖
సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితం
సింహాసన మిదం దేవిస్థీయతాం సురపూజితే
(కూష్మాండ దుర్గ ) శ్రీ మహాలక్ష్మీ దేవతాయైనమః రత్నసింహాసనం సమర్పయామి.
దేవి పై పుష్పాక్షతలు వేయవలెను.
అర్ఘ్యం
అశ్వపూర్వాం ర'థమధ్యాం హస్తినా''ద-ప్రబోధి'నీమ్ |
శ్రియం' దేవీముప'హ్వయే శ్రీర్మా దేవీర్జు'షతామ్ ‖
శుద్దోదకంచ పాత్రస్థం గంధపుష్పాది మిశ్రితం
అర్ఘ్యం దాస్యామితే దేవి గృహాణ సురపూజితే
(కూష్మాండ దుర్గ ) శ్రీ మహాలక్ష్మీ దేవతాయైనమః హస్తయోరర్ఘ్యం సమర్పయామి.
అమ్మవారి హస్తముపై శుద్ద జలము చిలకరించవలెను.
పాద్యము
కాం సో''స్మితాం హిర'ణ్యప్రాకారా'మార్ద్రాం జ్వలం'తీం తృప్తాం తర్పయం'తీమ్ |
పద్మే స్థితాం పద్మవ'ర్ణాం తామిహోప'హ్వయే శ్రియమ్ ‖
సువాసిత జలం రమ్యం సర్వ తీర్థసముద్భవం
పాద్యం గృహాణ దేవిత్వం సర్వదేవ నమస్కృతే
(కూష్మాండ దుర్గ) శ్రీ మహాలక్ష్మీ దేవతాయైనమః పాదారవిందయోః పాద్యం సమర్పయామి
దేవి పాదములపై కొద్దిగా జలము చిలకరింౘ వలెను.
ఆచమనీయం
చంద్రాంప్రభాసాం యశసాజ్వలంతీం
శ్రియం లోకే దేవజు'ష్టాముదారామ్ |
తాం పద్మినీ'మీం శర'ణమహం
ప్రప'ద్యేఽలక్ష్మీర్మే' నశ్యతాం త్వాం వృ'ణే ‖
సువర్ణకలశానీతం చందనాగరు సంయుతం
గృహాణాచమనం దేవి మయాదత్తం శుభప్రదే
( కూష్మాండ దుర్గ) శ్రీ మహాలక్ష్మీ దేవతాయైనమః ముఖే ఆచమనీయం సమర్పయామి.
అమ్మవారి ముఖపద్మము పై జలమును చిలకరింౘవలెను.
పంచామృతస్నానం.
ఆదిత్యవ'ర్ణే తపసోఽధి'జాతో వనస్పతిస్తవ' వృక్షోఽథ బిల్వః |
తస్య ఫలా'ని తపసాను'దంతు మాయాంత'రాయాశ్చ' బాహ్యా అ'లక్ష్మీః ‖
పయోదధి ఘృతోపేతం శర్కరా మధు సంయుతం
పంచామృత స్నాన మిదం గృహాణ కమలాలయే
క్షీరము
ఆప్యాయస్వమేతుతే విశ్వతః సోమ వృష్ణియమ్।
భవావాజస్య సంగథే॥
(కూష్మాండ దుర్గ ) శ్రీ మహాలక్ష్మీ దేవతాయైనమః క్షీరేణస్నపయామి.
దధిః
దధిక్రావుణ్ణో అకారిషం జిష్ణో రశ్వస్య వాజినః।
సురభినో ముఖా కరత్ప్రణ ఆయుగ్ం షితారిషత్॥
( కూష్మాండ దుర్గ) శ్రీ మహాలక్ష్మీ దేవతాయైనమః దధ్నాస్నపయామి.
ఆజ్యం
శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్సవితో త్పునాత్వచ్ఛిద్రేణ।
పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః ॥
(కూష్మాండ దుర్గ) శ్రీ మహాలక్ష్మీ దేవతాయైనమః ఆజ్యేన స్నపయామి.
మధుః
మధు వాతా ఋతాయతే మధుక్షరంతి సింధవః।
మాధ్వీర్నః సంత్వోషధీః మధునక్త ముతోషసి
మధుమత్పార్థివగ్ం రజః మధు ద్యౌరస్తునః పితా॥
మధుమాన్నో వనస్పతిర్మధుమాగ్ం అస్తు సూర్యః
మాధ్వీర్గావో భవంతునః ॥
(కూష్మాండ దుర్గ) శ్రీ మహాలక్ష్మీ దేవతాయైనమః మధునాస్నపయామి.
శర్కర
స్వాదుః పవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ
సుహవీతు నామ్నే ।
స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే
మధుమాగ్ం అదాభ్యః ॥
(కూష్మాండ దుర్గ ) శ్రీ మహాలక్ష్మీ దేవతాయైనమః శర్కరయాస్నపయామి.
ఫలోదకం
యాః ఫలినీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీః
బృహస్పతి ప్రసూతాస్తానో ముంచంత్వగ్ం హ సః॥
(కూష్మాండ దుర్గ) శ్రీ మహాలక్ష్మీ దేవతాయైనమః ఫలోదకేనస్నపయామి.
పంచామృత స్నానానంతరం శుద్ధోదక స్నానం.
శుద్ధోదక స్నానం.
గంగాజలం మయానీతం మహాదేవ శిరః స్థితం।
శుద్ధోదక స్నానమిదం గృహాణ విధు సోదరి॥
గంగాది సర్వ తీర్థేభ్యః ఆహృతైరమలైర్జలైః ।
స్నానం కురుష్వ శ్రీదేవి సర్వలోక సుతోషిణి ॥
(కూష్మాండ దుర్గ) శ్రీ మహాలక్ష్మీ దేవతాయైనమః శుద్ధోదక స్నానం సమర్పయామి.
వస్త్రయుగ్మం
ఉపై'తు మాం దే'వసఖః కీర్తిశ్చ మణి'నా సహ |
ప్రాదుర్భూతోఽస్మి' రాష్ట్రేఽస్మిన్ కీర్తిమృ'ద్ధిం దదాతు' మే ‖
సురార్చితాంఘ్రి యుగళే దుకూల వసనప్రియే
వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ హరి వల్లభే ॥
(కూష్మాండ దుర్గ) శ్రీ మహాలక్ష్మీ దేవతాయైనమః కంచుకసహిత వస్త్రయుగ్మం సమర్పయామి.
ఉపవీతం
క్షుత్పి'పాసామ'లాం జ్యేష్ఠామ'లక్ష్మీం నా'శయామ్యహమ్ |
అభూ'తిమస'మృద్ధిం చ సర్వాం నిర్ణు'ద మే గృహాత్ ‖
తప్తహేమకృతం సూత్రం ముక్తాదామ విభూషితం
ఉపవీత మిదం దేవిగృహాణ త్వం శుభప్రదే ॥
యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే ర్యత్సహజం పురస్తాత్।
ఆయుష్య మగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః॥
(కూష్మాండ దుర్గ) శ్రీ మహాలక్ష్మీ దేవతాయైనమః ఉపవీతం సమర్పయామి.
గంధం
గంధద్వారాం దు'రాధర్షాం నిత్యపు'ష్టాం కరీషిణీ''మ్ |
ఈశ్వరీగ్ం' సర్వ'భూతానాం తామిహోప'హ్వయే శ్రియమ్ ‖
కర్పూరాగరు కస్తూరీ రోచనాది భిరన్వితం ।
గంధం దాస్యామహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతా ॥
(కూష్మాండ దుర్గ) శ్రీ మహాలక్ష్మీ దేవతాయైనమః దివ్యశ్రీగంధం సమర్పయామి.
కుంకుమ
సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థసాధికే ।
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే॥
(కూష్మాండ దుర్గ) శ్రీ మహాలక్ష్మీ దేవతాయైనమః, సర్వమంగళ స్వరూపిణి జగన్మాత్రేనమః
కుంకుమం సమర్పయామి.
హరిద్రాం
హరిద్రాచ మయానీతం దేవి కళ్యాణ దాయిని ।
సౌభాగ్య వర్దనీం నిత్యం గృహాణ హరివల్లభే ॥
(కూష్మాండ దుర్గ) శ్రీ మహాలక్ష్మీ దేవతాయైనమః, హరిద్రాం సమర్పయామి.
ఆభరణం
మన'సః కామమాకూ'తిం వాచః
సత్యమ'శీమహి |
పశూనాం రూపమన్య'స్య మయి శ్రీః శ్ర'యతాం యశః' ‖
కేయూర కంకణ దివ్యే హారనూపుర మేఖలాః ।
విభూషణాన్య మూల్యాని గృహాణ ఋషి పూజితే ॥
(కూష్మాండ దుర్గ) శ్రీ మహాలక్ష్మీ దేవతాయైనమః, దివ్యాభరణాని సమర్పయామి.
పుష్పమాల
కర్దమే'న ప్ర'జాభూతా మయి సంభ'వ కర్దమ |
శ్రియం' వాసయ' మే కులే మాతరం' పద్మమాలి'నీమ్ ‖
మల్లికా జాజికుసుమైః చంపకై ర్వకుళైస్తథా ।
శతపత్రైశ్చ కల్హారై సర్వ పుష్పాన్ ప్రతిగృహ్యతామ్॥
(కూష్మాండ దుర్గ) శ్రీ మహాలక్ష్మీ దేవతాయైనమః, సర్వదేవతా స్వరూపిణీ దేవాతాయైనమః
పుష్పమాలాం సమర్పయామి.
పరిమళద్రవ్యమ్
సుగంధశీతలం శుభ్రం నానాగంధ సమన్వితం।
ప్రీత్యర్థం తవదేవేశి త్వామద్య ప్రతిగృహ్యతాం॥
(కూష్మాండ దుర్గ ) శ్రీ మహాలక్ష్మీ దేవతాయైనమః దివ్య సుగంధయుక్త పరమళం సమర్పయామి.
అథాంగపూజా
ఓం చంచలాయైనమః - పాదౌపూజయామి
ఓం చపలాయైనమః - జానునీ పూజయామి
ఓం పీతాంబరధరాయైనమః-ఊరుః పూజయామి
ఓం కమలవాసిన్యైనమః - కటిం పూజయామి
ఓం పద్మాలయాయైనమః - నాభింపూజయామి
ఓం మదనమాత్రేనమః - స్తనౌపూజయామి
ఓం లలితాయైనమః - భుజద్వయంపూజయామి
ఓం కంబుకఠ్యైనమః - కంఠం పూజయామి
ఓం సుముఖాయైనమః - ముఖంపూజయామి
ఓం శ్రియైనమః - ಓష్ఠౌపూజయామి
ఓం సునాసికాయైనమః - నాసికాపూజయామి
ఓం సునేత్రాయైనమః - నేత్రే పూజయామి
ఓం రమాయైనమః - కర్ణౌపూజయామి
ఓం కమలాయైనమః - శిరః పూజయామి
ఓం మహాలక్ష్మైనమః - సర్వాణ్యంగాని పూజయామి.
శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తరశతనామావళిః
ఓం ప్రకృత్యై నమః |
ఓం వికృత్యై నమః |
ఓం విద్యాయై నమః |
ఓం సర్వభూతహితప్రదాయై నమః |
ఓం శ్రద్ధాయై నమః |
ఓం విభూత్యై నమః |
ఓం సురభ్యై నమః |
ఓం పరమాత్మికాయై నమః |
ఓం వాచే నమః |
ఓం పద్మాలయాయై నమః | ౧౦ ||
ఓం పద్మాయై నమః |
ఓం శుచయే నమః |
ఓం స్వాహాయై నమః |
ఓం స్వధాయై నమః |
ఓం సుధాయై నమః |
ఓం ధన్యాయై నమః |
ఓం హిరణ్మయ్యై నమః |
ఓం లక్ష్మ్యై నమః |
ఓం నిత్యపుష్టాయై నమః |
ఓం విభావర్యై నమః | ౨౦ ||
ఓం అదిత్యై నమః |
ఓం దిత్యై నమః |
ఓం దీప్తాయై నమః |
ఓం వసుధాయై నమః |
ఓం వసుధారిణ్యై నమః |
ఓం కమలాయై నమః |
ఓం కాంతాయై నమః |
ఓం కామాక్ష్యై నమః |
ఓం క్రోధసంభవాయై నమః |
ఓం అనుగ్రహప్రదాయై నమః | ౩౦ ||
ఓం బుద్ధయే నమః |
ఓం అనఘాయై నమః |
ఓం హరివల్లభాయై నమః |
ఓం అశోకాయై నమః |
ఓం అమృతాయై నమః |
ఓం దీప్తాయై నమః |
ఓం లోకశోకవినాశిన్యై నమః |
ఓం ధర్మనిలయాయై నమః |
ఓం కరుణాయై నమః |
ఓం లోకమాత్రే నమః | ౪౦ ||
ఓం పద్మప్రియాయై నమః |
ఓం పద్మహస్తాయై నమః |
ఓం పద్మాక్ష్యై నమః |
ఓం పద్మసుందర్యై నమః |
ఓం పద్మోద్భవాయై నమః |
ఓం పద్మముఖ్యై నమః |
ఓం పద్మనాభప్రియాయై నమః |
ఓం రమాయై నమః |
ఓం పద్మమాలాధరాయై నమః |
ఓం దేవ్యై నమః | ౫౦ ||
ఓం పద్మిన్యై నమః |
ఓం పద్మగంధిన్యై నమః |
ఓం పుణ్యగంధాయై నమః |
ఓం సుప్రసన్నాయై నమః |
ఓం ప్రసాదాభిముఖ్యై నమః |
ఓం ప్రభాయై నమః |
ఓం చంద్రవదనాయై నమః |
ఓం చంద్రాయై నమః |
ఓం చంద్రసహోదర్యై నమః |
ఓం చతుర్భుజాయై నమః | ౬౦ ||
ఓం చంద్రరూపాయై నమః |
ఓం ఇందిరాయై నమః |
ఓం ఇందుశీతలాయై నమః |
ఓం ఆహ్లాదజనన్యై నమః |
ఓం పుష్ట్యై నమః |
ఓం శివాయై నమః |
ఓం శివకర్యై నమః |
ఓం సత్యై నమః |
ఓం విమలాయై నమః |
ఓం విశ్వజనన్యై నమః | ౭౦ ||
ఓం తుష్ట్యై నమః |
ఓం దారిద్ర్యనాశిన్యై నమః |
ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః |
ఓం శాంతాయై నమః |
ఓం శుక్లమాల్యాంబరాయై నమః |
ఓం శ్రియై నమః |
ఓం భాస్కర్యై నమః |
ఓం బిల్వనిలయాయై నమః |
ఓం వరారోహాయై నమః |
ఓం యశస్విన్యై నమః | ౮౦ ||
ఓం వసుంధరాయై నమః |
ఓం ఉదారాంగాయై నమః |
ఓం హరిణ్యై నమః |
ఓం హేమమాలిన్యై నమః |
ఓం ధనధాన్యకర్యై నమః |
ఓం సిద్ధయే నమః |
ఓం స్త్రైణసౌమ్యాయై నమః |
ఓం శుభప్రదాయే నమః |
ఓం నృపవేశ్మగతానందాయై నమః |
ఓం వరలక్ష్మ్యై నమః | ౯౦ ||
ఓం వసుప్రదాయై నమః |
ఓం శుభాయై నమః |
ఓం హిరణ్యప్రాకారాయై నమః |
ఓం సముద్రతనయాయై నమః |
ఓం జయాయై నమః |
ఓం మంగళా దేవ్యై నమః |
ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః |
ఓం విష్ణుపత్న్యై నమః |
ఓం ప్రసన్నాక్ష్యై నమః |
ఓం నారాయణసమాశ్రితాయై నమః | ౧౦౦ ||
ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః |
ఓం దేవ్యై నమః |
ఓం సర్వోపద్రవవారిణ్యై నమః |
ఓం నవదుర్గాయై నమః |
ఓం మహాకాల్యై నమః |
ఓం బ్రహ్మావిష్ణుశివాత్మికాయై నమః |
ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః |
ఓం భువనేశ్వర్యై నమః | ౧౦౮ ||
ధూపం
ఆపః' సృజంతు' స్నిగ్దాని చిక్లీత వ'స మే గృహే |
ని చ' దేవీం మాతరం శ్రియం' వాసయ' మే కులే ‖
ఓం దశాంగం గుగ్గులోపేతం సుగంధంచ మనోహరం।
ధూపం దాస్యామి దేవిశ్రీవరలక్ష్మి
గృహాణతం ॥
(కూష్మాండ దుర్గ) ఓం శ్రీ మహాలక్ష్మీ దేవతాయైనమః ధూపం సమర్పయామి.
దీపం
ఆర్ద్రాం పుష్కరి'ణీం పుష్టిం పింగలామ్ ప'ద్మమాలినీమ్ |
చంద్రాం హిరణ్మ'యీం లక్ష్మీం జాత'వేదో మ ఆవ'హ ‖
ఘృతాక్తవర్తి సంయుక్త మంధకార వినాశకం।
దీపం దాస్యామితేదేవి గృహాణ ముదితాభవ ॥
(కూష్మాండ దుర్గ) ఓం శ్రీ మహాలక్ష్మీ దేవతాయైనమః దీపం దర్శయామి.
ధూప, దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి.
నైవేద్యం
ఆర్ద్రాం యః కరి'ణీం యష్టిం సువర్ణామ్ హే'మమాలినీమ్ |
సూర్యాం హిరణ్మ'యీం లక్ష్మీం జాత'వేదో మ మావ'హ ‖
భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయ మేవ చ।
ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం పరమేశ్వరి॥
ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
(నీరు నివేదన చుట్టూ చల్లుతూ) ఓంసత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు అమృతో పస్తరణమసి…నీరు నివేదన చుట్టూ చల్లుతూ) ఓంసత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు అమృతో పస్తరణమసి…
(కూష్మాండ దుర్గ) ఓం శ్రీ మహాలక్ష్మీ దేవతాయైనమః నమః అమృత నివేదనం సమర్పయామి
ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహో, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మేణ్యే స్వాహా
(కూష్మాండ దుర్గ) ఓం శ్రీ మహాలక్ష్మీ దేవతాయైనమః అమృత నివేదనం సమర్పయామి.
మధ్యే మధ్యే ఉదక పానీయం సమర్పయామి.(నీటిని వదలాలి).
అమృతాపిధానమసి ఉత్తరాపోశనం సమర్పయామి.
ఓం (కూష్మాండ దుర్గ) శ్రీ మహాలక్ష్మీ దేవతాయైనమః హస్తౌ ప్రక్షాళయామి..నీరువదలాలి.
ఓం (కూష్మాండ దుర్గ) శ్రీ మహాలక్ష్మీ దేవతాయైనమః పాదౌ ప్రక్షాళయామి.. నీరువదలాలి.
ఓం (కూష్మాండ దుర్గ) శ్రీ మహాలక్ష్మీ దేవతాయైనమః శుద్దఆచమనీయం సమర్పయామి.
ఓం (కూష్మాండ దుర్గ ) శ్రీ మహాలక్ష్మీ దేవతాయైనమః మహా నైవేద్యం నివేదయామి.
తాంబూలం
తాం మ ఆవ'హ జాత'వేదో
లక్షీమన'పగామినీ''మ్ |
యస్యాం హిర'ణ్యం ప్రభూ'తం గావో' దాస్యోఽశ్వా''న్,
విందేయం పురు'షానహమ్ ‖
పూగీ ఫలైః సకర్పూరం నాగవళ్ళీ దళైర్యుతమ్।
ముక్తా చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగుహ్యతామ్॥
ఓం (కూష్మాండ దుర్గ ) శ్రీ మహాలక్ష్మీ దేవతాయైనమః తాంబూల, దక్షిణాం సమర్పయామి.
తాంబూల చర్వణానంతరం ఆచమనం సమర్పయామి.
నీరాజనం
సామ్రాజ్యం భోజ్యం స్వారాజ్యం వైరాజ్యం
పారమేష్ఠికం రాజ్యం మహారాజ్యమాధిపత్యం
నతత్రసూర్యోభాతిన చంద్రతారకం
నేమా విద్యతోభాంతి కుతోయమగ్నిః
తమేవ భాంత మనుభాతి సర్వం
తస్య భాసా సర్వమిదం విభాతి॥
ఓం మంగళం శ్రీమహాలక్ష్మై శారదాయై సుమంగళం,
మహిషాసుర మర్థిన్యై మహా గౌర్యైచ మంగళం,
సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే
ఘృతవర్తిసహస్రైశ్చ కర్పూర శకలైస్తథా ।
నీరాజనం మయా దత్తం గృహాణ వరదోభవ॥
నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం
తుభ్యం దాస్యామ్యహం దేవి గృహ్యతాం విష్ణువల్లభే॥
(కూష్మాండ దుర్గ) ఓం శ్రీ మహాలక్ష్మీ దేవతాయైనమః మంగళ కర్పూర నీరాజనం
దర్శయామి.
నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి.
మంత్రపుష్పం
ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే
నమోవయం వైశ్రవణాయ కుర్మహే
సమేకామాన్ కామకామాయ మహ్యమ్
కామేశ్వరో వైశ్రవణో దదాతు
కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయనమః
ఓం తత్ బ్రహ్మ । ఓం తద్వాయుః । ఓం తదాత్మా।
ఓం తథ్సత్యమ్। ఓం తథ్సర్వం । ఓం తత్పురోర్నమః
అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు
త్వం యఙ్ఞస్త్వం వషట్కారస్త్వం యింద్రస్త్వం
రుద్రస్త్వ విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః
త్వంతదాప ఆపోజ్యోతీ రసోమృతంబ్రహ్మ భూర్భువస్సువరోమ్॥
ఈశానస్సర్వ విద్యానాం ఈశ్వరస్సర్వ భూతానాం బ్రహ్మాధిపతి
ర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివోమేస్తు సదాశివోమ్॥
గౌరీమిమాయ సలిలాని తక్షత్యేకపదీ ద్విపదీసా చతుష్పదీ।
అష్టాపదీ నవపదీ బభూవుషీ సహస్రాక్షరా పరమే వ్యోమన్॥
దుర్గా సూక్తమ్
ఓం ‖ జాతవే'దసే సునవామ సోమ' మరాతీయతో నిద'హాతి వేదః' |
స నః' పర్-షదతి' దుర్గాణి విశ్వా' నావేవ సింధుం' దురితాఽత్యగ్నిః ‖
తామగ్నివ'ర్ణాం తప'సా జ్వలంతీం వై'రోచనీం క'ర్మఫలేషు జుష్టా''మ్ |
దుర్గాం దేవీగ్ం శర'ణమహం ప్రప'ద్యే సుతర'సి తరసే' నమః' ‖
అగ్నే త్వం పా'రయా నవ్యో' అస్మాంథ్-స్వస్తిభిరతి' దుర్గాణి విశ్వా'' |
పూశ్చ' పృథ్వీ బ'హులా న' ఉర్వీ భవా' తోకాయ తన'యాయ శంయోః ‖
విశ్వా'ని నో దుర్గహా' జాతవేదః సింధున్న నావా దు'రితాఽతి'పర్-షి |
అగ్నే' అత్రివన్మన'సా గృణానో''ఽస్మాకం' బోధ్యవితా తనూనా''మ్ ‖
పృతనా జితగం సహ'మానముగ్రమగ్నిగ్ం హు'వేమ పరమాథ్-సధస్థా''త్ |
స నః' పర్-షదతి' దుర్గాణి విశ్వా క్షామ'ద్దేవో అతి' దురితాఽత్యగ్నిః ‖
ప్రత్నోషి' కమీడ్యో' అధ్వరేషు' సనాచ్చ హోతా నవ్య'శ్చ సత్సి' |
స్వాంచా''ఽగ్నే తనువం' పిప్రయ'స్వాస్మభ్యం' చ సౌభ'గమాయ'జస్వ ‖
గోభిర్జుష్ట'మయుజో నిషి'క్తం తవేం''ద్ర విష్ణోరనుసంచ'రేమ |
నాక'స్య పృష్ఠమభి సంవసా'నో వైష్ణ'వీం లోక ఇహ మా'దయంతామ్ ‖
ఓం మహాదేవ్యైచ విద్మహే విష్ణుపత్నైచ ధీమహి।
తన్నోలక్ష్మీ ప్రచోదయాత్॥
ఓం కాత్యాయనాయ' విద్మహే' కన్యకుమారి' ధీమహి |
తన్నో' దుర్గిః ప్రచోదయా''త్ ‖
ఓం వీణాపాణ్యై చ విద్మహే బ్రహ్మపత్నై చ ధీమహి।
తన్నో వాణీః ప్రచోదయాత్॥
ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి ।
తన్నో దంతిః ప్రచోదయాత్ ॥
ఓం శాంతిః శాంతిః శాంతిః' ‖
(కూష్మాండ దుర్గ ) ఓం శ్రీ మహాలక్ష్మీ దేవతాయైనమః దివ్యసువర్ణ మంత్రపుష్పాంజలిం సమర్పయామి.
ప్రార్ధనం:
శ్లో// సర్వస్వరూపే సర్వేశి సర్వశక్తి స్వరూపిణి
పూజాం గృహాణ మాతా జగన్మాతర్నమోస్తుతే
(కూష్మాండ దుర్గ శ్రీ మహాలక్ష్మీదేవ్యైనమః ప్రార్థనాం సమర్పయామి.
సాష్టాంగ నమస్కారం:
ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా
పధ్బ్యాం కరభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే
(కూష్మాండ దుర్గ ) శ్రీ మహాలక్ష్మీదేవ్యైనమః సాష్టాంగనమస్కారన్ సమర్పయామి.
ప్రదక్షిణం
యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ।
తానితాని ప్రణస్యంతి ప్రదక్షిణ పదేపదే॥
శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే।
సర్వస్స్యార్తి హరేదేవి మహాలక్ష్మీ నమోస్తుతే॥
అన్యధా శరణంనాస్తి త్వమేవ శరణం మమ।
తస్మాత్కారుణ్య భావేన రక్షరక్ష హరివల్లభే ॥
(కూష్మాండ దుర్గ ) ఓం శ్రీ మహాలక్ష్మీ దేవతాయైనమః ఆత్మప్రదక్షణ నమస్కారాన్ సమర్పయామి.
పునః పూజ
(కూష్మాండ దుర్గ ) ఓం శ్రీ మహా లక్ష్మీనుంచి దేవతాయైనమః
ఛత్రమాచ్ఛాదయామి, చామరం వీజయామి , నృత్యందర్శయామి, గీతంశ్రావయామి, ఆందోళికామారోహయామి, అశ్వానారోహయామి
గజానారోహయామి, సమస్త రాజోపచార, శక్త్యుపచార, భక్త్యుపచార, మంత్రోపచార, సర్వోపచార పూజాం సమర్పయామి.
యస్యస్మృత్యాచ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు।
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యోవందే మహాలక్ష్మీ॥
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి।
యత్పూజితం మయాదేవీ పరిపూర్ణం తదస్తుతే॥
అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా భగవతీ జగన్మాతా (కూష్మాండ దుర్గ ) శ్రీమహాలక్ష్మీదేవతా సుప్రీతా సుప్రసన్నా వరదాభవతు .
(అక్షతలు, పుష్పములు, నీరు కలిపి పాత్రలో విడువవెను)
పూజాక్షతలు శిరస్సుపై నుంచుకొనవలెను తీర్థప్రసాదములు తాము పుచ్చుకుని అందరికీ పంచవలెను.
తీర్థగ్రహణము
అకాలమృత్యు హరణం సర్వ వ్యాధి నివారణం సమస్త దురితోపశమనం (కూష్మాండ దుర్గ) శ్రీమహాలక్ష్మీ పాదోదకం పావనం శుభం.
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం
న్యాయేన మార్గేణ మహీం మహీశాః
గోబ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం
లోకాస్సమస్తా స్సుఖినోభవంతు
కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ
దేశాయాం క్షోభరహితో బ్రాహ్మణాస్సంతు నిర్భయాః
అపుత్రః పుత్రిణస్సంతు పుత్రిణస్సంతు పౌత్రిణః
అధనా ధనాస్సంతు జీవంతు శరదాం శతం॥
ఓం శాంతి శాంతి శాంతిః
4 .నాల్గవ రోజు నైవేద్యము చిల్లులులేని "అల్లం గారెలు"
కావలసినవి :-
మినపప్పు 2 కప్స్,
అల్లం చిన్న ముక్క,
పచ్చిమిరప కాయలు 6 సన్నగా తరిగినవి,
జీలకర్ర 1/4 స్పూన్,
ఉప్పు రుచికి తగినంత,
కరివేపాకు, కొత్తిమీర, తగినంత
నూనె గారెలు వేయించేందుకు.
చేసే విధానం :- మినపప్పు బాగా కడిగి 4 , 5 , గంటలు నానపెట్టి ( లేకుంటే ముందు రోజు రాత్రి నానపెట్టుకొండి ).
నానిన మినపప్పును గ్రైండర్లో వేసి, ఉప్పు, కాస్త తినే సోడ వేసి బాగా గ్రైండ్ చేసుకోండి. ఆ పిండిలో అల్లం, పచ్చిమిరప కాయలు, కరివేపాకు, కొత్తిమీర సన్నగా తరిగి వేసి కాగిన నూనెలో ఈ మినపిండిని చేతిలో తీసుకొని రౌండుగా అదిమి నూనెలో విడచాలి.
దోరగా వేగిన వడలను, సహస్ర నామాలతో శ్రీ లలితాదేవికి ఆరాధించి నైవేద్యం పెట్టి
ఆశీర్వాదం పొందుదాం.
ఆశ్వయుజ శుద్ధ చవితి
దుర్గామాత నాల్గవ స్వరూపము
కూష్మాండా దుర్గా 4వరోజు
నాలుగో రోజు, గురువారం రోజున కుష్మాండ పూజ
కూష్మాండ (కామాక్షి): అమ్మవారి నాలుగవ అవతారం కూష్మాండ అంటే బూడిద గుమ్మడికాయ ఈమె తేజోమయి. ఎనిమిది భుజాలతో విరాజిల్లుతుండటం వల్ల ఈమెను ‘అష్టభుజదేవి’ అని కూడా అంటారు.
శ్లో|| సురా సంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ|
దధానా హస్త పద్మభ్యాం కూష్మాండా శుభ దాస్తుమే ||
శరన్నవరాత్రులు’
శరదృతువులో వస్తుంది కాబట్టి ‘శరన్నవరాత్రులు’ అంటారు. ఈ ఋతువులో వర్షాకాలం ముగిసి చలికాలం మొదలవుతుంది. ఈ సమయంలో వాతావరణంలో కలిగే మార్పులు అనేక రోగాలకు కారణమవుతాయి. అందుకే ఈ అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు శక్తి ఆరాధన పేరుతో ప్రజలంతా శుచిగా, శుభ్రంగా ఉండి ఎలాంటి రోగాల దరిజేరవన్నది ఈ నవరాత్రి వేడుకల వెనుక ఉన్న చరిత్ర. మార్కండేయ మహర్షి అమ్మవారిని ఎలా ఆరాధించాలి అని అడగడంతో బ్రహ్మ ఇలా వివరించాడట.
నవదుర్గలు :
ప్రధమంశైలపుత్రిణి, ద్వితీయం బ్రహ్మచారిణి
తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్ధామ్||
పంచమం స్కంధమాతేతి షష్ఠమం కాత్యాయనీ తిచ
సప్తమం కాళరాత్రంచ, మహాగౌరేతి చాష్టమం
నవమం సిద్ధితి ప్రోక్త, నవదుర్గ ప్రకీర్తిత||
కూష్మాండా దుర్గా 4వరోజు
నవదుర్గల్లో నాలుగో అవతారం. నవరాత్రుల్లో నాలుగో రోజైన ఆశ్వీయుజ శుద్ధ చవితి నాడు ఈ
అమ్మవారిని పూజిస్తారు.
"కు" అంటే చిన్న, "ఊష్మ" అంటే శక్తి, "అండా" అంటే విశ్వం.
తన శక్తితో ఈ విశ్వాన్ని సృష్టించింది
అని అర్ధం.[1]
ఈ అమ్మవారిని పూజిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, శక్తీ లభిస్తాయని భక్తుల విశ్వాసం.[2]
రూపం
కుష్మాండా దుర్గా దేవి 8 చేతులతో ఉంటుంది. ఆ చేతులలో చక్రం, ఖడ్గం, గద, పాశం, ధనువు, బాణాలు, ఒక తేనె భాండం, ఒక రక్త భాండం ఉంటాయి. ఈ అమ్మవారి వాహనం పులి/సింహం.
విశ్వ ఆవిర్భావం
ఈ విశ్వం లేనప్పుడు, అంతా చీకటే అలుముకున్నప్పుడు ఈ విశ్వాన్ని సృష్టించి, తన చిరునవ్వుతో వెలుగును ప్రసాదించింది అమ్మవారు. సూర్యునికి వెలుగును ఇచ్చింది కుష్మాండా దుర్గా దేవి అని పురాణోక్తి. సూర్యుని మధ్యభాగంలో ఈ అమ్మవారు నివసిస్తుందని చెప్తుంది దేవీ పురాణం.[3]
త్రిమూర్తులు, త్రిమాతల సృష్టి
మహాకాళీ
కుష్మాండా దుర్గాదేవి ఎడమ కంటి కాంతి నుంచి నల్లటి రూపంతో ఒక అమ్మవారు జనించింది. ఈమె చాలా ఉగ్ర స్వరూపమైనది. ఈ అమ్మవారికి పది తలలు, పది చేతులు, పది కాళ్ళు, 30 కళ్ళు, 30 చేతి వేళ్ళు, 30 కాలి వేళ్ళు ఉన్నాయి. చిందరవందరగా ఉండే జుట్టుతో, నాలుకలు బయట పెట్టి ఉంటుంది. ఆమె తెల్లటి పళ్ళు, తన 10 నాలుకలను కొరుకుతున్నట్టుగా ఉంటాయి. మండుతున్న చితిపై కూర్చుని ఉంటుంది ఈ అమ్మవారు. ఆయుధం, త్రిశూలం, చక్రం, బాణం, డాలు, తెంచిన రాక్షసుని తల, పుర్రె, నత్త గుల్ల, ధనువు, కర్ర ధరించి ఉంటుంది కాళీ. కూష్మాండా దేవి ఈమెకు మహాకాళీ అని పేరు పెట్టింది.
మహాలక్ష్మి
కుష్మాండా దుర్గాదేవి మూడో కంటి నుంచి ఒక ఉగ్రమైన స్త్రీ ఉద్భవించింది. బంగారు వర్ణంలో ఉన్న ఈ అమ్మవారు 18 చేతులతో ఉంది. ఈమె కాషాయ రంగు వస్త్రాలు, కవచం, కిరీటం ధరించింది. ఆ చేతుల్లో గొడ్డలి, త్రిశూలం, చక్రం, గద, పిడుగు, బాణం, ఖడ్గం, కమలం, జపమాల, నత్తగుల్ల, ఘంట, ఉచ్చు, బల్లెం, కొరడా, ధనువు, డాలు, మధుకలశం, నీటిపాత్రలు పట్టుకుని ఉంది. కమలంపై కూర్చున్న ఈ అమ్మవారు మధువును తాగి, గట్టిగా గర్జించిందిట. అలా ఉన్న ఆ అమ్మవారికి కూష్మాండా దేవి మహాలక్ష్మి అని నామకరణం చేసింది.
మహాసరస్వతి
కుష్మాండాదేవి కుడి కంటి కాంతి నుంచి శాంతమూర్తి అయి, తెల్లని శరీర ఛాయ కలిగిన ఒక స్త్రీ జనించింది. తెల్లటి బట్టలు కట్టుకుని, తలపై చంద్రవంకతో ఉన్న ఆమెకు 8 చేతులు ఉన్నాయి. వాటిలో త్రిశూలం, చక్రం, చిన్న ఢమరుకం, నత్తగుల్ల, ఘంట, విల్లు, నాగలి ఉన్నాయి. ఆమె ముఖం చంద్రబింబంలా వెలిగిపోతోంది. ముత్యాల నగలు అలంకరించుకున్న ఆమె రత్నాలతో చేసిన సింహాసనంపై కూర్చుని ఉంది. కుష్మాండాదేవి ఆమెను మహా సరస్వతి అని పిలిచింది.
శక్తి
కుష్మాండాదేవి దృష్టి మహాకాళిపై పడగానే, ఆమె నుండి ఒక స్త్రీ, పురుషుడు పుట్టారు. పురుషునికి 5 ముఖాలు, 15 కళ్ళు, 10 చేతులు ఉన్నాయి. అతని చర్మం పులి చర్మంలా ఉంది. అతని మెడ చుట్టూ ఒక పాము ఉంది. తలపై చంద్రవంకను ధరించి ఉన్నాడు. అతని చేతుల్లో గొడ్డలి, జింక, బాణం, ధనువు, త్రిశూలం, పిడుగు, కపాలం, ఢమరుకం, జపమాల, కమండలం ఉన్నాయి. కూష్మాండా దుర్గా అతనికి శివుడు అని పేరు పెట్టింది.
మహాకాళీ శరీరం నుంచి పుట్టిన స్త్రీ తెల్లగా ఉండి, నాలుగు చేతుల్లో పాశం, జపమాల పుస్తకం, కమలం ఉన్నాయి. ఆమెకు శక్తి అని పేరు పెట్టింది కుష్మాండా దేవి. ఇలా కలసి పుట్టిన శివుడు, శక్తి (సరస్వతీదేవి)లు అన్నాచెల్లెళ్ళు అని అంటారు.
బ్రహ్మ/లక్ష్మి
కుష్మాండా దేవి మహాలక్ష్మిని చూడగానే ఆమె శరీరం నుండి ఒక స్త్రీ, ఒక పురుషుడు వచ్చారు. నాలుగు ముఖాలతో, నాలుగు చేతులతో ఎరుపు రంగు శరీరంతో కాషాయ వస్త్రాలతో ఉన్నాడు. ఖరీదైన నగలు ధరించిన అతను తామరపువ్వు, పుస్తకం, జపమాల, కలశం పట్టుకుని ఉన్నాడు. అతనికి బ్రహ్మ అని పేరు పెట్టింది కుష్మాండా దేవి. స్త్రీకి నాలుగు చేతులు ఉన్నాయి. అందంగా, లేత ఎరుపు వర్ణంలో ఉన్న ఆమె పై రెండు చేతుల్లో తామరమొగ్గలు, కింద రెండు చేతులూ అభయ ముద్రలోనూ ఉన్నాయి. లెక్కలేనన్ని ఆభరణాలు ధరించి ఉంది అమె. కుష్మాండా దేవి ఆమెకు లక్ష్మి అని పేరు పెట్టి పిలిచింది. ఇలా కలసి పుట్టిన బ్రహ్మ, లక్ష్మీదేవిలు కూడా అన్నాచెల్లెళ్ళే.
సురాసంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ ।
దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా
శుభదాస్తు మే ॥
దుర్గామాత నాలుగవ స్వరూప నామము ‘కూష్మాండ’. దరహాసముతో అంటే అవలీలగా బ్రహ్మాండమును సృజించుతుంది కాబట్టి ఈ దేవి ‘కూష్మాండ’ అనే పేరుతో విఖ్యాతి చెందింది.
ఈ జగత్తు సృష్టి జరుగక ముందు అంతటా గాఢాంధకారమే అలముకొని ఉండేది. అప్పుడు ఈ దేవి తన దరహాసమాత్రంతో ఈ బ్రహ్మాండాలను సృజించింది. కాబట్టి ఈ స్వరూపమే ఈ సృష్టికి ఆదిశక్తి. ఈ సృష్టిరచనకు పూర్వము బ్రహ్మాండమునకు అస్తిత్వమే లేదు.
ఈమె సూర్యమండలాంతర్వర్తిని. సూర్యమండలంలో నివసింపగల శక్తిసామర్థ్యములు ఈమెకే గలవు. ఈమె శరీరకాంతిచ్ఛటలు సూర్యకిరణ ప్రభలలాగా దేదీప్యమానముగా వెలుగొందుతూ ఉంటాయి. ఈమె తేజస్సు నిరుపమానము. దానికి అదే సాటి. ఇతర దేవతాస్వరూపాలేవీ ఈమె తేజః ప్రభావములతో తులతూగలేవు. ఈమె తేజోమండల ప్రభావమే దశదిశలూ వెలుగొందుతూ ఉంటుంది. బ్రహ్మాండములోని అన్ని వస్తువులలో, ప్రాణులలో ఉన్న తేజస్సు కూష్మాండ ఛాయయే.
ఈ స్వరూపము ఎనిమిది భుజాలతో విరాజిల్లుతూ ఉంటుంది. అందువల్లనే ఈమె ‘అష్టభుజాదేవి’ అనే పేరుతో కూడా వాసిగాంచింది. ఈమె ఏడు చేతులలో వరుసగా కమండలమూ, ధనుస్సూ, బాణమూ, కమలమూ, అమృతకలశమూ, చక్ర గదలు తేజరిల్లుతూ ఉంటాయి. ఎనిమిదవ చేతిలో సర్వ సిద్ధులనూ, నిధులనూ ప్రసాదించే జపమాల ఉంటుంది. సింహవాహన. సంస్కృతంలో ‘కూష్మాండము’ అంటే గుమ్మడికాయ. కూష్మాండబలి ఈమెకు అత్యంత ప్రీతికరము. ఇందువల్ల కూడా ఈమెను ‘కూష్మాండ’ అని పిలుస్తారు.
నవరాత్రి ఉత్సవాలలో నాల్గవరోజు కూష్మాండాదేవీ స్వరూపమే దుర్గామాత భక్తుల పూజలను అందుకొంటుంది. ఈనాడు సాధకుని మనస్సు అనాహత చక్రంలో స్థిరమవుతుంది. కాబట్టి ఈ రోజు ఉపాసకుడు పవిత్రమైన, నిశ్చలమైన మనస్సుతో కూష్మాండాదేవి స్వరూపాన్నే ధ్యానిస్తూ పూజలు చేయాలి. భక్తులు ఈ స్వరూపాన్ని చక్కగా ఉపాసించడంవల్ల పరితృప్తయై ఈమె వారి రోగాలనూ, శోకాలనూ రూపుమాపుతుంది. ఈమె భక్తులకు ఆయుర్యశోబలములూ, ఆరోగ్యభాగ్యములు వృద్ధి చెందుతాయి. సేవకుల కొద్దిపాటి భక్తికే ఈ దేవి ప్రసన్నురాలవుతుంది. మానవుడు నిర్మల హృదయంతో ఈమెను శరణుజొచ్చిన వెంటనే అతి సులభముగా పరమ పదము ప్రాప్తిస్తుంది.
శాస్త్రాలలో, పురాణాలలో పేర్కొనబడిన రీతిలో విధివిధానమును అనుసరించి మనము దుర్గాదేవిని ఉపాసిస్తూ అనవరతము భక్తి మార్గంలో అగ్రేసరులమై ఉండాలి. ఈ తల్లి భక్తిసేవా మార్గంలో కొద్దిపాటిగానైనా పురోగమించగలిగిన సాధకునికి ఆమె కృపానుభవము అవశ్యము కలిగి తీరుతుంది. దాని ఫలితంగా దుఃఖరూప సంసారమంతా భక్తునికి సుఖదాయకమూ, సుగమమూ అవుతుంది. మనిషి సహజంగా భవసాగరాన్ని తరించడనికి ఈ తల్లియొక్క ఉపాసన అతి సులభమైన, శ్రేయస్కరమైన మార్గం. మనిషి ఆధివ్యాధులనుండీ సర్వదా విముక్తుడవటానికీ, సుఖసమృద్ధిని పొందటానికీ, ఉన్నతిని పొందటానికీ కూష్మాండా దేవిని ఉపాసించటమనేది రాజమార్గం వంటిది. కాబట్టి లౌకిక, పారలౌకిక ఉన్నతిని కాంక్షించేవారు ఈ దేవీస్వరూపంయొక్క ఉపాసనలో సర్వదా తత్పరులై ఉండాలి.
ధ్యాన శ్లోకం
"సురాసంపూర్ణ కలశం రుధిరప్లుత మేవ చ
దధాన హస్త పద్మాభ్యాం కూష్మాండా శుభమస్తు మే"
కూష్మాండదేవి (మహాలక్ష్మిగా)
ధ్యానము
లక్ష్మీం క్షీరాబ్ధికన్యాం త్రిభువనజననీం విష్ణువక్షస్థలస్థాం
పద్మాం పద్మాయతాక్షీం నిఖిలశుభకరాం పద్మినీం పద్మహస్తాం
నానా రత్నోత్తమాఢ్యైః కనకవిరచితైర్భూషణై ర్భూషితాంగీం
దేవీం బాలార్కవర్ణాం సురమునివరదాం విష్ణుపత్నీం నమామి !!
పద్మాసనస్థితేదేవీ పరబ్రహ్మస్వరూపిణీ
పరమేశీ జగన్మాతర్మహాలక్ష్మీ నమోస్తుతే
శ్వేతాంబరధరే దేవీ నానాలంకారభూషితే
జగత్స్థితే జగన్మాతర్మహాలక్ష్మీ నమోస్తుతే !!
శ్రీమహాలక్ష్మష్టకము
1) నమస్తేఽస్తు మహామాయే ! శ్రీపీఠే సురపూజితే ! ।
శంఖచక్రగదాహస్తే ! మహాలక్ష్మీ ! నమోఽస్తుతే ।।
2) నమస్తే గరుడారూఢే ! కోలాసురభయంకరి ! ।
సర్వపాపహరే ! దేవి ! మహాలక్ష్మీ ! నమోఽస్తుతే ।।
3) సర్వజ్ఞే ! సర్వవరదే ! సర్వదుష్టభయంకరి !
సర్వదుఃఖహరే ! దేవి ! మహాలక్ష్మీ ! నమోఽస్తుతే ।।
4) సిద్ధిబుద్ధిప్రదే ! దేవి ! భుక్తిముక్తిప్రదాయిని !
మంత్రపూతే ! సదాదేవి ! మహాలక్ష్మీ ! నమోఽస్తుతే ।।
5) ఆద్యన్తరహితే ! దేవి ! ఆదిశక్తి ! మహేశ్వరి !
యోగజ్ఞే ! యోగసంభూతే ! మహాలక్ష్మీ ! నమోఽస్తుతే ।।
6) స్థూలసూక్ష్మే ! మహారౌద్రే ! మహాశక్తి ! మహోదరే !
మహాపాపహరే ! దేవి ! మహాలక్ష్మీ ! నమోఽస్తుతే ।।
7) పద్మాసనస్థితే ! దేవీ ! పరబ్రహ్మస్వరూపిణీ !
పరమేశీ ! జగన్మాతః ! మహాలక్ష్మీ ! నమోఽస్తుతే ।।
8) శ్వేతాంబరధరే ! దేవీ ! నానాలంకారభూషితే !
జగత్స్థితే ! జగన్మాతః ! మహాలక్ష్మీ ! నమోఽస్తుతే !!
9) మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం యఃపఠేత్ భక్తిమాన్ నరః ।
సర్వసిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ।।
10) ఏకకాలే పఠేన్నిత్యం మహాపాపవినాశనమ్ ।
ద్వికాలం యః పఠేన్నిత్యం ధనధాన్యసమన్వితః ।।
11) త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రువినాశనమ్ ।
మహాలక్ష్మీర్భజేన్నిత్యం ప్రసన్నా వరదా శుభా ।।
(ఇతి ఇంద్రకృతం మహాలక్ష్మ్యష్టకమ్)
శ్రీ మహాలక్ష్మ్యష్టోత్తర శతనామ స్తోత్రమ్
ఓం దేవ్యువాచ:
దేవదేవమహాదేవ త్రికాలజ్ఞ మహేశ్వర,
కరుణాకర దేవేశ భక్తానుగ్రహకారక
అష్టోత్తరశతం లక్ష్య్మాః శ్రోతుమిచ్ఛామి తత్త్వతః
ఈశ్వర ఉవాచ:
దేవి సాధు మహాభాగే మహాభాగ్య ప్రదాయకమ్
సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వ పాప ప్రణాశనమ్
సర్వ దారిద్ర్య శమనం శ్రవణాద్భుక్తి ముక్తిదమ్
రాజవశ్యకరం దివ్యం గుహ్యాద్గుహ్యతమంపరమ్
దుర్లభం సర్వ దేవానాం చతుష్షష్టికళాస్పదమ్
పద్మాదీనాం వరాన్తానాం నిధీనాం నిత్యదాయకమ్
సమస్త దేవ సంసేవ్య మణిమాద్యష్ట సిద్ధిదమ్
కిమత్ర బహునోక్తేన దేవీ ప్రత్యక్షదాయకమ్
తవ ప్రీత్యాఽద్య వక్ష్యామి సమాహితమనాశ్శ్రుణు అష్టోత్తర శతస్స్యాస్య
మహాలక్ష్మీస్తు దేవతా.
క్లీం బీజ పదమిత్యుక్తం శక్తిస్తు భువనేశ్వరీ,
అంగన్యాసః కరన్యాసః ఇత్యాది ప్రకీర్తితః.
ధ్యానం:
వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదామ్
హస్తాభ్యామభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితామ్
భక్తాభీష్ట ఫలప్రదాం హరిహరబ్రహ్మాదిభి స్సేవితామ్
పార్శ్వే పఙ్కజ శఙ్ఖ పద్మనిధిభి ర్యుక్తాం సదాశక్తిభిః
సరసిజనయనే సరోజ హస్తే ధవళతరాంశుక గన్ధమాల్య శోభే
భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యమ్
ఓం ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదామ్
శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికామ్ 1
వాచం పద్మాలయాం పద్మాం శుచిం స్వాహాం స్వధాం సుధామ్
ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీమ్ 2
అదితిం చ దితిం దీప్తాం వసుధాం వసుధారిణీమ్
నమామి కమలాం కాన్తాం కామ్యాం క్షీరోదసంభవామ్ 3
అనుగ్రహప్రదాం బుద్ధి మనఘాం హరివల్లభామ్
అశోకామమృతాం దివ్యాం లోక శోక
వినాశినీమ్ 4
నమామి ధర్మనిలయాం కరుణాం లోకమాతరమ్
పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీమ్ 5
పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమామ్
పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీమ్ 6
పుణ్యగన్ధాం సుప్రసన్నాం ప్రసాదాభిముఖీం ప్రభామ్
నమామి చన్ద్రవదనాం చన్ద్రాం
చన్ద్రసహోదరీమ్ 7
చతుర్భుజాం చన్ద్రరూపా మిన్దిరా మిన్దుశీతలామ్
ఆహ్లాద జననీం పుష్టిం శివాం శివకరీం సతీమ్ 8
విమలాం విశ్వజననీం పుష్టిం దారిద్ర్య నాశినీమ్
ప్రీతిం పుష్కరిణీం శాన్తాం శుక్లమాల్యాంబరాం శ్రియమ్ 9
భాస్కరీం బిల్వనిలయాం వరారోహాం యశస్వినీమ్
వసున్ధరా ముదారాఙ్గాం హరిణీం హేమమాలినీమ్10
ధనధాన్యకరీం సిద్ధిం సదాసౌమ్యాం శుభప్రదామ్
నృపవేశ్మగతాం నన్దాం వరలక్ష్మీం వసుప్రదామ్11
శుభాం హిరణ్యప్రాకారాం సముద్రతనయాం జయామ్
నమామి మఙ్గళాం దేవీం
విష్ణువక్షస్స్థలస్థితామ్ 12
విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణ సమాశ్రితామ్
దారిద్ర్య ధ్వంసినీం దేవీం సర్వోపద్రవవారిణీమ్13
నవదుర్గాం మహాకాళీం బ్రహ్మవిష్ణు శివాత్మికామ్
త్రికాలజ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరీమ్14
లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీమ్
దాసీభూత సమస్తదేవవనితాం లోకైక దీపాఙ్కురామ్
శ్రీమన్మన్ద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేన్ద్ర గఙ్గాధరామ్
త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకున్దప్రియామ్
మాతర్నమామి కమలే కమలాయతాక్షి
శ్రీవిష్ణుహృత్కమల వాసిని విశ్వమాతః
క్షీరోదజే కమల కోమల గర్భ గౌరి
లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే
త్రికాలం యో జపేద్విద్వాన్ షణ్మాసం విజితేన్ద్రియః
దారిద్ర్యధ్వంసనం కృత్వా సర్వమాప్నోతి యత్నతఃదేవీనామ సహస్రేషు
పుణ్యమష్టోత్తరం శతమ్‌యేన శ్రియ మవాప్నోతి కోటి జన్మ దరిద్రతః
భృగువారే శతం ధీమాన్ పఠేద్వత్సరమాత్రకమ్‌అష్టైశ్వర్యమవాప్నోతి
కుబేర ఇవ భూతలేదారిద్ర్యమోచనం
నామ స్తోత్ర మంబాపరం శతమ్‌యేన శ్రియమవాప్నోతి కోటి జన్మదరిద్రతఃభుక్త్వాతు విపులాన్ భోగానస్యాస్సాయుజ్య మాప్నుయాత్
ప్రాతఃకాలే పఠేన్నిత్యం సర్వదుఃఖోప శాన్తయే
పఠం స్తు చిన్తయే ద్దేవీం సర్వాభరణ భూషితామ్
శ్రీలక్ష్మ్యష్టోత్తర శత నామ స్తోత్రమ్ సమాప్తమ్
Comments
Post a Comment